SAINT OF THE DAY – November 13 పునీత స్టనిస్లాసు కొస్తక ST. STANISLAUS KOSTHAK

ఏసుసభ సభ్యుడు, పోలెండు పాలక పునీతుడు మతసాక్షి (క్రీ|శ|| 1550-1568) యువకులుగా ఉన్నప్పుడే మానవ మర్యాదకు తగ్గకుండ సంస్కారవంతులై తమ బాధ్యతలు నెరవేర్చుకోవాలి. సరియైన ముందుచూపు అవగాహనతో పట్టుదల చురుకు దనం కలిగి తాము అనుకున్న గమ్యం సాధించుకోవాలి. అట్టి వర్గానికి చెందిన వారే ఈ పునీత స్టనిస్లాసు కొస్తకగారు.వారు పోలెండుదేశంలో రోస్ట్ కొవొకోటలో ఒక ప్రజాప్రతినిధి (సెనెటరు) ఇంట క్రీ||శ|| 1550 అక్టోబరు 28న జన్మించారు. వారి తల్లిదండ్రులు ఇంటివద్దనే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుని నియమింపజేసి విద్య చెప్పించారు.స్టనిస్లాసుగారికి 14 సం|| ప్రాయంలో పై చదువుల కోసం వారి పెద్ద అన్నయ్య పౌలుతో పాటుగా వియెన్నాపట్టణంలోని జేసుసభ కళాశాలలో చేర్పింపబడ్డారు. ఈ అన్నదమ్ములిద్దరికి తోడుగా ప్రైవేటు చెప్పడానికి ప్రత్యేక ఉపాధ్యాయునికూడ పంపించారు.ఈ ముగ్గురూ వియెన్నాలో ఒక లూథరన్ ప్రొటెస్టెంటు ఇంట అద్దెకు ఉండేవారు.

స్టనిస్లాస్ గారు తమ విద్యను కొనసాగిస్తూనే కతోలిక భక్తి విశ్వాసాలలో దృఢ చిత్తంతో జీవించేవారు. పౌలుమాత్రం హింసావాదం, వైరిభావంతో ఉండేవాడు. ఈ లోకాన్ని అంటీ అంటనట్టు ఒక మునిలా జీవిస్తున్న తమ్ముడు స్టనిలాసు యెడల ఏహ్య భావం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు స్టనిస్లాస్ గార్కి జబ్బుచేసి మంచం పట్టి గుడికి వెళ్లలేని పరిస్థితి దాపురించింది. గురువు వచ్చి దివ్యసత్రసాదం ఇవ్వడానికి ఆ ఇంటి యజమాని అడ్డుచెప్పారు. కాని స్టని సుగారి కోరిక నెరవేర పునీత బార్బరాగారు వచ్చి దివ్యసత్రసాదం అందించారు. వారితోపాటు పరిశుద్ధ దేవమాతకూడ దర్శనమై జబ్బు వెంటనే నయమైపోతుంది. పోయి జేసుసభలో చేరి గురువుకమ్మని పలికి దీవించి అదృశ్యమయ్యారు.స్టనిస్లాస్ గారు ఒక గురువుకావడం వారి తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన హెచ్చరికలవల్ల భయపడి వియెన్నాలో జేసుసభలో స్టనిస్లాసుగార్కి ప్రవేశం లభింపలేదు. ఒకరోజు వారు చీకటితో నిద్రలేచి ఇల్లు విడచి ఒక పేదవానిలా దుస్తులు వేసుకుని అడవి మార్గంగుండా ప్రయాణం కొనసాగించారు. వారి గమ్యం జర్మనీలో జేసుసభ ప్రొవిన్షియలుగా ఉన్న పునీత పీటరు కనీషియస్ గారి కలసికోవడం, కాస్త కూస్త దూరంకాదు. 350 మైళ్లు నడచి గమ్యంచే రారు స్టనిస్లాసుగారు. కనీషియసుగారు సిఫారసుపత్రం ఇచ్చి రోమునగరంలో సభలోచేరమని అనుమతించారు. అనగా ఇంకా 800 మైళు నడవాలి. పట్టుదలతో గమ్యం చేరాడు ఆ యువకుడు.

రోమునగరంలో జేసుసభ గురు శిక్షణాలయ అధిపతిగా ఉన్న పునీత ఫ్రాన్సిసు బోర్గియాగారు స్టనిస్లాసుగార్ని ఆదరించి తమసభలో నోవిగా చేర్చుకున్నారు. స్టనిస్లాస్ గారి సన్మస్కుని పోలిన అమాయకత్వం పరిశుద్ధత ముఖంలో కన్పించే ఆర్హత తేజస్సు అక్కడ ఉన్న గురువులు బ్రదర్లు అందరి హృదయాల్ని ఇట్టే ఆకట్టుకున్నాయి. అందరికీ దగ్గరి వాడుగా ప్రియమైన వ్యక్తిగా రూపొందారు. స్టనిస్లాసుగారు అనేక మైళ్లు ప్రయాణంవల్ల కొంత బలహీనపడినప్పటికిని తన ప్రార్థన ఉపవాస దీక్షలో ఏమీ తక్కువ చేయలేదు. పవిత్రాత్మవరాలు, అనుగ్రహాలు వారిపై అధికాధి కంగా కురిపింపబడ్డాయి. వారు గురుశిక్షణాలయంలో చేరి కేవలం పది మాసాలు నిండాయో లేదో తిరిగి వారు తీవ్ర వ్యాధికి గురియైనారు. ఈసారి దైవ చిత్తమేమోగాని కోలుకోలేదు. వారు క్రీ॥శ|| 1568 ఆగష్టు 15న దేవమాత మోక్షారోపణ పండుగ దినాన తన ఇహలోక జీవిత యాత్రను చాలించి మోక్షం చేరుకున్నారు. ఈ పవిత్రునికి క్రీ||శ|| 1726 డిసెంబరు 31న 13వ బెనడికు పోపుగారిచే పునీత పట్టాకట్టబడింది.

గుండె అధికముగా కొట్టుకొనుట వంటి హృద్రోగము, మిక్కిలి అపాయకర రోగములు దివ్యసత్రసాదము లో కొనకయే ప్రాణాపాయంలో ఉన్నవారు స్టన్నిగారి మధ్యవర్తిత్వాన మేలులు పొందడం జరుగుతోంది. వారు నోవీసులకు, గురు శిక్షణలో ఉన్న బ్రదరుగార్లకు పాలక పునీతునిగా గౌరవింపబడుచున్నారు. పోలెండు దేశీయులును వారిని తమ పాలక పునీతునిగా వందిస్తున్నారు. స్టని స్ అనగా బస ప్రదేశ మహత్మ్యం , నివశించే స్థల గొప్పతనం అని అర్థం.

Saint #Stanislaus Kostka was born in Poland in 1550, of a noble Polish family. At the age of fourteen he was sent with his older brother Paul to study at the Jesuit College in Vienna. Twice a day he would pray at length in the chapel, and he never failed to recite a crown of the Rosary. He avoided the company of students too free in their speech and behavior, and often fasted and inflicted on himself a rude discipline. His love for God did not cease to augment with these practices, and he decided to make a vow to enter the Company of Jesus. He told his confessor of it only six months later, as he wanted it to remain unknown until he would be in a position to carry it out.

He fell ill, and the demon appeared in his room under the form of a black dog which lunged at his throat. The young Saint drove him away with the sign of the Cross; but his illness was growing worse. He was lodged in the residence of a Protestant who would not permit the Blessed Sacrament to be brought to him. Saint Stanislaus remembered having read that those who invoked Saint Barbara never died without the Sacraments, and he begged that she would assist him in his danger and not permit that he die without the Viaticum. His prayer was answered; one night, when his life was despaired of, he saw this beautiful virgin-martyr, accompanied by two Angels, enter his room with the Blessed Sacrament. He was greatly consoled by this favor and another which immediately followed it; the Blessed Virgin also appeared and assured him that God wanted him to enter the Jesuit Society. Soon he felt better and was restored to complete health.

He was still too young to enter the Order in Vienna without his parents' permission; he therefore determined to go to another province where it might be possible. Stanislaus had always been gentle and cheerful, and his sanctity was felt as a reproach by his brother Paul, who had been surveying him constantly and often spoke rudely to him, even going so far as to strike him. Stanislaus nonetheless succeeded in evading him when he left for Augsbourg, dressed as a beggar, to go to Father Peter Canisius, Provincial of Upper Germany, with letters of recommendation he had received from a Father of the Company. His brother, when he realized he had left, pursued him, but even though Stanislaus was on foot, passed him by without recognizing him. A little farther on, Paul's horses refused to advance and he was obliged to return to Vienna.

Saint Peter sent Stanislaus to Rome, a very long distance in those days, over a rugged and dangerous road, where rocks, mountains and rivers made the journey very difficult. Saint Francis of Borgia received him in Rome as a treasure sent by God, and he was clothed in the Jesuit habit in October 1567. His father was very irritated, but the son answered his letters with modesty and firmness, and continued to apply himself to every practice that might lead him closer to God and religious perfection. In ten months it is said that he advanced more than many do over a period of fifty or sixty years. During those ten short months he always had Our Lady in his mind, in his heart and on his lips. A custom was introduced for the novices during his sojourn in Rome; they would turn toward Her church of Saint Mary Major and ask, kneeling, for Her benediction; this practice has been conserved in the Roman novitiate ever since that time.

The fervent novice ardently desired to be in heaven on the feast of Her Assumption; he fell ill of a fever on the 9th of August, and it was revealed to him that his desire would be fulfilled. In effect, his holy soul departed to rejoin His Heavenly Mother, when She came to claim him at a little after 3 o'clock on the morning of the 15th of August, 1568. He was eighteen years old. We often see him with the Infant Jesus in his arms, because when Our Lady came to cure him in Vienna with Her Divine Treasure in Her arms, She had placed the Infant Saviour on his bed. Many illnesses were cured at his tomb, and his body was found incorrupt three years after his death. He was soon considered as a Saint in Italy and Poland; in 1604 he was declared Blessed and was canonized in 1726. Paul Kostka wept for long years over his mistreatment of his younger brother, and was about to enter the Society of Jesus himself in 1607, when he died suddenly on November 13th, anniversary of the discovery of the incorrupt remains of Saint Stanislaus.

Add new comment

2 + 0 =