SAINT OF THE DAY – November 10  పునీత 1వ లియో ఘనుడు |ST. LEO GREAT 1

(45వ పోపు, సంస్కర్త, మతసాక్షి క్రీ||శ|| - 461) పునీత సిక్స్ తుగారి పాలన ముగిశాక పునీత 1వ లియో (సింహరాయలు)గారు క్రీ||శ|| 440 సెప్టెంబరు 29వ తేదీన 45వ శ్రీ సభాధినేతగా భాధ్యతల్ని చేపట్టారు. చరిత్రలోని ప్రఖ్యాత జగద్గురువులలో వీరునూ ఒకరు. క్రైస్తవ విశ్వాసాన్ని పరిరక్షించడంలో వీరు విశేష సేవలందించారు. వీరు శ్రీసభ పితరులలో ఒకరుగా కీర్తింపబడ్డారు. శ్రీసభ చట్టాలలో వీరు బహుళ పాండిత్యం గడించారు. వీరి స్వస్థలం ఇటలీలోని టస్కనీ.

రోమా పౌరుడే. 1వ సెలస్తీను పోపుగారి పాలనాకాలంలో లియోగారు ఒక డీకనుగా సేవలందించారు. ఆ కాలంలో నిరు పేదల వ్యవహారాల్ని పర్యవేక్షించి చక్కబెట్టే బాధ్యత వీరికి అప్పగింపబడింది. ఇటలీలో శ్రీసభకు వ్యతిరేకంగా తప్పుడు సిద్దాంతాల్ని బోధించే పెలజియనులు, మనిచియనులను ఈ జగద్గురువు తీవ్రంగా ఖండించి వెలివేశారు. అదేవిధంగా స్పెయిన్లో చెలరేగిన ప్రెసిల్లియనుల్ని, తూర్పు శ్రీ సభలో అలజడిరేకెత్తించిన మోనోఫిజియనుల్ని వీరు అణచివేశారు.

పునీత లియోపోపుగారు క్రీ.శ|| 451లో కాల్సెడాన్ మహాసభలో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. కాన్‌స్టాంట్ నోపుల్ పీఠాధిపతికి శ్రీ సభలో రెండవ హోదాను కల్పిస్తూ మహాసభ ఆమోదించిన 28వ ఆర్టికలను వీరు వీటోచేశారు. అనగా త్రోసిపుచ్చారు. గ్రీసు ప్రాంత శ్రీసభను తన అధికారం క్రిందనే ఉంచుకుని పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. ఈ పోప్. కాన్స్టాంట్ నోపుల్ లోని న్యాయస్థానంలో శాశ్వత ప్రతినిధిని ఏర్పాటుచేశారు. వీరి పాలనలో పాశ్చాత్య శ్రీసభ పరిపాలనా వ్యవస్థను పటిష్టపరిచారు.

అట్టిలా, జెన్సెరిక్ అనువారలు శ్రీసభపై దాడులు నిర్వహించినప్పుడు అయోగారు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. శ్రీ సభలో ప్రవేశించి సూర్య నమస్కారాలు వంటి మూడాచారాలి, వారు మాన్పింపజేశారు. వీరు తమ పవిత్రపాలనా కాలంలో సంగాలు, 173 కరపత్రాలు చక్కని భాష, శైలిలో వ్రాసి ముద్రింపజేసి అట్టి 96 ప్రసంగాలు, ప్రతులను విశ్వాసులకు విరివిగా అందించినట్లు చరిత్ర వివరిస్తుంది. గురువుల అనుదిన పఠిత ప్రార్థనా పుస్తకం బ్రివియరీలో వీరి ప్రార్థనలు ముమ్మరంగా చేర్చబడ్డాయి. ఆఫ్రికా వంటి దేశాలకు వేద ప్రచారకుల్ని అధికంగా పంపించారు. శ్రీసభకు గట్టిపట్టు, అధికారం, సమైక్యత ఒకేమాట ఒకే బాట నడచేలా అన్ని చర్యల్సి చేపట్టారు. వీరు క్రీ॥శ॥ 461 నవంబరు 10న స్వర్గస్తులయ్యారు. లియో ది గ్రేట్ లేక పెద్ద లియోగా పేర్గాంచారు.

బాల్య శ్రీసభను సమర్థవంతంగా పాలించి, పలు అడ్డంకులు ఎదుర్కొని శ్రీసభను క్రమపద్ధతిలో నడిపిన వారిలో 1వ లియో పోపుగారు అగ్రగణ్యులు. వీరు శ్రీ సభ పండితులుగా క్రీ||శ|| 1754లో 14వ బెనడి క్టు పోపుగారిచే ప్రకటింపబడ్డారు. లియో అనగా సింహం.

Saint Leo was born in Rome. He embraced the sacred ministry, was made Archdeacon of the Roman Church by Pope Saint Celestine, and under the same Vicar of Christ and Saint Sixtus III, had a large share in governing the Church. On the death of Sixtus, Leo was chosen Pope, and consecrated on Saint Michael's day, 440, amid great joy.

It was the time of terrible trial which preceded by thirty years the definitive fall of the Roman Empire. Vandals and Huns were wasting the provinces of the empire, and Nestorians, Pelagians, and other heretics wrought still more grievous havoc in souls. While Leo's zeal was making headway against these perils, there arose the new heresy of Eutyches, who confounded the two natures of Christ. At once the vigilant pastor proclaimed the true doctrine of the Incarnation in his famous tome; but fostered by the Byzantine court, the heresy gained a strong hold upon the Eastern monks and bishops. After three years of unceasing toil, Saint Leo brought about its solemn condemnation by the Council of Chalcedon, the Fathers all signing his tome, and exclaiming, Peter has spoken by Leo.

Soon after, Attila with his Huns broke into Italy, and marched through its razed cities upon Rome. Leo went out boldly to meet him, and prevailed on him to turn back. His chieftains were astonished to see the terrible Attila, the Scourge of God, fresh from the sack of Aquileia, Milan and Pavia and with the rich prize of Rome within his grasp, turn his great host back to the Danube at the Saint's word. They asked him why he had acted so strangely. He told them he had seen two venerable personages — who are generally supposed to be Saints Peter and Paul — standing behind Saint Leo; and impressed by this vision, he withdrew. Two years later the city fell a prey to the Vandals, but Leo saved it again from total destruction. He died in 461 after having ruled the Church for a little over twenty years.

Add new comment

9 + 2 =