SAINT OF THE DAY – December 3 పునీత ఫ్రాన్సిస్ జేవియర్ (శౌరి) |ST. FRANCIS XAVIER

(గురువు, ఆసియా ఆశాజ్యోతి, విదేశీ వేదప్రచారకుల పాలక పునీతులు మతసాక్షి, క్రీ||శ|| 1506 - 1552) ప్రతి కాలంలో కూడ ప్రభువు అపోస్తలులకు ఇచ్చిన అనుజ్ఞ ప్రకారం ప్రపంచ నలుదెసల గల సుదూర ప్రాంతాలకు పోయి బోధించి విస్తారంగా ఉన్న తెలియని ప్రజానీకాన్ని క్రీస్తు రాజ్యంలోకి తేవడానికి, ఎందరో మహానుభావులు వీరోచితంగా పయనించి, బోధించి ఘోర అపాయాలనుండి తప్పించుకొని లేక తప్పించుకోలేక తమ జీవితాలను ధన్యంచేసుకున్నారు. పునీతులయ్యారు. ఉత్సాహంతో శ్రమంచి ఇట్టి కోవలో స్థానం సంపాదించినవారే జెస్విట్ గురువు ఫ్రాన్సిస్ శౌరిగారు. 10వ పయస్ (భక్తినాథ) పోపుగారి మాటల్లో విశ్వాస వ్యాపకానికి సాధికార విదేశీ మెషినరీలకు పాలక పునీతులు ఈ శౌరిగారు.

వీరు గొప్ప ఆధునికవేద ప్రచారకులు. భారత్ లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు హిందూ మహాసముద్రంలో ఉన్న బారత్ కు చెందిన ద్వీపాలు, జపాను దేశంలోకూడ క్రైస్తవాన్ని బలంగా ప్రాదుగొల్పిన వీరు చైనా ప్రజలకుకూడ బోధింపచేసిన ప్రయాణంలో వీరు సాహసమరణం పొందారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు స్పెయిన్ దేశంలో 1506 ఏప్రిల్ 7న జన్మించారు. ఫ్రాన్సిస్ నామధేయులయ్యారు. వీరు పురాతనమైన జేవియర్ (శౌరి) అనే కోటలో పుట్టారు కాన ఫ్రాన్సిస్ జేవియర్ అని పేరు వచ్చింది. వీరిది ధనవంతుల కుటుంబం. తల్లి అజ్ పిల్ క్వెటావంశజురాలు కాగా, తండ్రి నవ రాజ్యంలో కౌన్సిలరైన డాన్ జ్వాన్ దె జస్సో, వీరికి గల చాలామంది పిల్లల్లో ఫ్రాన్సిసుగారు కడపటివారు, ఫ్రాన్సిసుగారి అన్నలిద్దరు దేశరక్షణ సైన్యంలో యుద్ధవీరులు. కాని వారి సైన్యం యుద్ధంలో ఓడింది. శత్రువులు జేవియర్ కోటను ముట్టడించి పగ ద్వేషంతో దాన్ని నేలమట్టంచేశారు. ఏవో కొన్ని గదుల్ని మాత్రం వదిలేశారు. అక్కడే వశిస్తూ తండ్రి దిగులుతో మరణించగా పిల్లల పెంపకం ముఖ్యంగా తెలివిగల వాడైన ఫ్రాన్సిసును పెద్ద చదువుల్లో పెంచాల్సిన బాధ్యత తల్లి పై బడింది.

ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడయ్యా డు. గుర్రపు స్వారీ, కుస్తీ, ఈత, ఈటె విసరడం, వ్యాయామం ధైర్యసాహసాలు ప్రదర్శించడంలో శ్రద్ధ. అలాగే కష్టపడి చదివేవారు. తల్లి సద్భోధలవల్ల తోడి విద్యార్థుల్లో దొంగతనంగా ధియేటర్లుకు వెళ్లడం, తరగతులు తరచుమానడం, జూదము, మద్యపానము చేయడం వంటి దుర్వసనాలకు లోనుకాలేదుఁ బుద్ధిగా చదువుకుని ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడై విద్యార్ధుల, ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్నాడు. పెద్ద చదువులకోసం ఫ్రాన్సులోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలోని పునీత బార్బరా కళాశాలలో చేరి క్రీ||శ|| 1530లో యం. ఏ. పట్టాపుచ్చుకున్నారు. అరిస్టాటిల్ తత్వశాస్త్ర బోధకునిగా అదే విశ్వవిద్యాలయంలో సేవలందించారు కూడ.

అయితే వీరు గొప్ప చదువులు చదవుతుండటాన తన విద్యాకాలంలో గర్వందర్పం చోటుచేసుకున్నాయి. వారి దృష్టంతా ఉన్నత పదవి, అంతస్థు, గౌరవం, సిరిసంపదలపైనే నిలిచింది. విలాసవంతమైన జీవితంవైపు మొగ్గుచూపసాగారు. అయితే వీరిగదిలో తనకన్నా పదిహేను సంవత్సరాల పెద్ద అయిన మరో విద్యాధి ఉండేవారు. గతంలో సైనికుడిగా పనిచేసి యుద్ధంలో కాలు విరుగగొట్టుకున్నవారు. వీరునూ గొప్ప సైన్యాధినేతయై పేరు ప్రతిష్ఠలకై కలలుగన్నవారే. ఇప్పుడు మారు మనస్సు పొంది దైవ సేవకు ఆరాటపడుతున్నారు. పేరు ఇగ్నేషియస్. “ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను మాత్రం కోల్పోతే ఏం ప్రయోజనం ?" అని పదే పదే పలికి ఫ్రాన్సిస్ గార్కి క్రీస్తు విశ్వాసంలో క్రీస్తు సేవలో నమ్మకం కుదిర్చారు. అందువల్ల ఈ లోక ఆశలపై వ్యా మోహం తగ్గి తన కహిమకోసం గాక దేవుని మహిమకోసం, దేవుని సేవకోసం జీవితమంతా తమించాలని ఫ్రాన్సిస్ నిశ్చయించుకున్నారు. వీరితో పాటు ఈ లోగా దేవుని సేవకోసం ఇష్టపడే మరో అయిదుగురు యువకుల్నికూడ ఇగ్నేష్య గారు తమ మితబృందంలో చేర్చుకున్నారు. వారంతా లోకాన్ని త్యజించినట్లు గుర్తుగా ఒక నిలువుటంగీని ధరించి, చేత ఊతకర్రను పట్టుకున్నారు. ఒక రోజు ఉదయం ప్యారిస్ నగరం వెలుపల ఉన్న కొండనెక్కి వెళ్లారు. అచటగల దేవాలయంలో ప్రార్థించి వారంతా పేదరికం, పాలిత్ర్యతా బ్రహ్మచర్యం, విధేయతలను జీవిత పర్యంతం పాటిస్తూ దేవుని సేవ ప్రజల సేవ చేస్తామని దీక్షగైకొన్నారు. ఈ విధంగా క్రీ||శ||  1534లో ఈ ఏడుగురు బృందంతో 'ఏసుసభ' ఆవిర్భావానికి నాంది జరిగింది.

కొంతకాలమయ్యాక ఇగ్నేషియస్, ప్రాన్సీస్ వారి సహచరులు కాలినడకన రోమువెళ్లి పోపుగార్ని కలసి తమ సభ నియమావళిని సమర్పించి ఆమోదం పొందారు. ఆనాటి 3వ పౌలు పోపుగారు వారంతా గురుపట్ట మొంద అనుమతినిచ్చారు. ఫ్రాన్సిసుగారు 1537 ఆగష్టు 15న వెనిస్ నగరంలో తమ 31వ ఏట గురుపట్టాభిషిక్తు లయ్యారు. తమ ప్రథమ దివ్య బలిపూజ అర్పించినప్పుడు వారికళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి వారు ఆస్పత్రిలో రోగులకు సేవ చేస్తూ గడిపారు.అయితే ఆ కాలంలో పోర్చుగల్ రాజు సువార్తా ప్రచారంతో శ్రీసభ వ్యాపకం కోసం తూర్పు దేశాల నుండి కొంతమంది బోధక గురువుల్ని పంపమని రోమునగర రాయబారి ద్వారా ఇగ్నేషియస్ కు వర్తమానం పంపగా అందుకు రోడ్రిగ్వస్, బోబడిల్లా గురువులను ఎంపికచేశాడు. సుదీర్ఘ ప్రయాణంచేసి రోమునగరం చేరుకున్న

బోబడిల్లా గురువు అస్వస్థుడు కాగా మరో మార్గం లేక ఇగ్నేషియస్ (ఇన్యాసి) వారు ఫ్రాన్సిస్ శౌరిగార్ని పంప నిశ్చయించారు. ఒక్కరోజునే తన సామాను సర్దుకుని 1540 మార్చి 16న ఫ్రాన్సిస్ రోమును వీడి పోర్చుగల్ వెళ్లాడు. రెండేళ్ల తర్వాత అక్కడనుండి 1541 ఏప్రిల్ 7న ఫ్రాన్సిసువారి 35వ జన్మదినం రోజున ఓడలో ప్రయాణమై 1542 మే 6న గోవాపట్టణంలో తన పవిత్ర పాదం మోపారు.ఫ్రాన్సిస్ శౌరిగారు గోవాలో నౌక దిగగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేందుకు గుడికి వెళ్లి ఆ రాత్రంతా ప్రార్థనలోనే గడిపారు. ఉదయాన్నే తాను వచ్చిన పని నిమిత్తమై ఉపక్రమించారు. పేదలు, అనాధలు, వ్యాధి గ్రస్తులు, ఖైధీలు, కుష్ఠురోగులను సందర్శించి, తమ ఇంటివారినుండి సేకరించిన విరాళాన్ని వారికందించారు. ఫ్రాన్సిస్ గారు తరచు చేతిలో గంటపట్టుకొని కొట్టుకుంటూ వీథుల్లోకెళ్లేవారు. వారి చుట్టూ పిల్లలు పెద్దగుంపుగా మూగేవారు. వారిని గుడికి తీసుకెళ్లి విశ్వాసం గురించి ముఖ్యంగా జపాలు నేర్పించారు. సాయంవేళలో బహిరంగంగా సువార్త బోధించేవారు. శ్రోతలు తమ పాపాలకై కన్నీరు కారుస్తూ గుండెలు బాదుకొని పశ్చాత్తాపపడి తమ జీవితాలు మార్చుకున్నారు.

ఫ్రాన్సిసుగారు రోగులను స్వస్థపరచే వరం కలిగి ఉన్నారు. మరణావస్థలో ఉన్న ఒక వృద్ధ స్త్రీని విశ్వాస సంగ్రహం చెప్పి స్వస్థపరిచారు. బావిలో పడి చనిపోయిన ఒక బిడ్డను బ్రతికించారు. ఒకసారి పడవ పై సముద్రంలో పయనిస్తుండగా తుఫాను చెలరేగింది. ఫ్రాన్సిసుగారు వారి సిలువను నీటిలో ముంచగా సముద్రం నెమ్మళించింది. కాని అలల తాకిడికి సిలువ స్వరూపం సముద్రంలో పడిపోయింది.

ఫ్రాన్సిసుగారు ఎంతో బాధపడ్డారు. మరుసటి రోజు తీరం వెంబడి నడిచి వెళ్తుండగా ఒక పీత తన కొండ్లతో సిలువను పట్టుకొని ఒడ్డుకు చేర్చి ఫ్రాన్సిసుగారికి అందించిది.

ఫ్రాన్సిస్ గోవాలోని పోర్చుగీసు వారి మధ్య గురువుగా తన సేవలందించారు. తమిళ భాష కొంచెం నేర్చుకుని ప్రస్తుతం తమిళనాడు దక్షిణ తీరానగల 'పరవలనే' వారిని క్రైస్తవ విశ్వాసం బోధించి జ్ఞానస్నానాలనిచ్చారు. భాష బాగా రాకున్నను ఇద్దరు అనువాదకులను వెంటనిడుకొని పల్లె పల్లె తిరిగి పిల్లలు పెద్దలకు ఏసే నిజయేక దైవం రక్షకుడని బోధించి సత్యోపదేశం నేర్పించి ఆ ప్రాంతాల్లోని ప్రజల మూఢనమ్మకాలు మూఢాచారాలను ఖండించి వారికి పది ఆజ్ఞలను సోదాహరణంగా వివరించి కొద్ది సంవత్సరాల్లోనే పదిలక్షలమందికి జ్ఞానస్నానాలిచ్చి చక్కని శ్రీసభ సంఘాన్ని తయారుచేశారు. క్రైస్తవ గ్రామాల్లో గట్టి ఉపదేశికులను నియమించి క్రైస్తవుల ఆలనా పాలనా బాధ్యతల్ని పర్యవేక్షించారు. 1544లో ట్రావెన్కూరు ప్రాంతం వైపు వెళ్లి అక్కడ కూడ క్రీస్తుబోధ విన్పించి లక్షమందికి జ్ఞానస్నానంతో దేవుని బిడ్డలయ్యే భాగ్యం కల్పించారు. 1545 జనవరిలో కొచ్చిన్ పరిసర ప్రాంతాల్లో సువార్త ప్రచారం చేస్తున్నప్పుడు ఒక విదేశీయాత్రికుని ద్వారా మలక్కాదీవులు మత బోధకు అనువైన ప్రదేశమని గ్రహించారు. పిదప మైలాపూరు (చెన్నై)లో గల అపోస్తలమైన పునీత తోమాసువారి కొండను వధస్థలంను దర్శించి అక్కడ నాలుగు నెలలపాటు ఏకాంతంగా తపస్సుచేసి, ప్రభుదీవెనలు సమృద్ధిగా పొంది 1545 సెప్టెంబరులో మలక్కాదీవులకు ఫ్రాన్సిస్ ప్రయాణమయ్యారు.

సుగంధ ద్రవ్యాలకు నిలయమైన మలక్కా తదితర దీవుల్లో క్రీస్తు వాక్యాన్ని ఈ వెయ్యిమందికి పైగా జ్ఞానస్నానమిచ్చారు. మత ప్రచారానికై అక్కడకు ఏసుసభ గురువుల్ని రప్పించారు. అక్కడ ఉన్న సమయంలో 'అంజిరో' పాస్ దేశీయుని ద్వారా జపాను దేశాన్ని గూర్చి విని అక్కడకు వెళ్లేందుకు మరున్నారు. దానికి ముందుగా గోవా చేరుకుని భారతదేశ యేసుసభ సువులకు సూచనలిచ్చి క్రొత్తగా వచ్చిన గురువులను వివిధ ప్రాంతాలకు పంపి 1549లో జపాన్ కు ప్రయాణమయ్యారు.

సముద్ర మార్గంలో పలు ఇబ్బందులపాలై మలక్కా చేరుకొని అటునుండి సముద్రపు దొంగకు చెందిన పడవను అద్దెకు తీసికొని 1549 ఆగష్టు 15న ఎన్ చేరుకున్నారు. ముందుగా తన మిత్రుడు 'అంజిరో'ను కలసి అతని సహాయంతో స్థానిక రాకుమారుని దర్శించి క్రైస్తవ మతాన్ని బోధింప అనుమతి పొందారు. జపాన్లోని కగోషియాలోను ఆ ప్రక్క దీవి హిరాడోలో క్రీస్తు వేదాన్ని విన్నించి కొన్ని వందలమందికి జ్ఞానస్నానమిచ్చారు. జపాన్లో పెద్ద నగరమైన 'యమగుచి' వెళ్లారు. అక్కడి రాజును సందర్శించి అతనికి వేదం బోధించాలని కలలుకన్నారు. కాని అనుమతి లభింపలేదు. అందుకు ఒక ఉపాయం ఆలోచించి ఫ్రాన్సిస్ రే ఒక రాజు వేషధారియై మేలు జాతి గుర్రాలను కొని, కండ్లు చెదరే సిల్కు బంగారు వస్త్రాలను ధరించి మంది మార్బాలంతో 'యమగుచి' పట్నం చేరుకున్నారు. అంతకు ముందు అనుమతి లభించని ఫ్రాన్సిసు కల్పించుకున్న తన వైభవంతో రాజు సిబ్బందిని సమ్మోహనపరచగా వారు రాచ మర్యాదలతో ఘనస్వాగతం పలికి తమ చక్రవర్తియొద్దకు తోడ్కొని పోయారు. ఫ్రాన్సిస్ అంతట ఆ చక్రవర్తికి గడియారం, చక్కని వాయిద్యాలను, అద్దాలను, మేలిమి వస్త్రాలను కానుకగా ఇచ్చాడు. అటు తరువాత పోర్చుగల్ రాజుకు 3వ పౌలు, 3వ జూలియన్ పోపుగారినుండి వచ్చిన రాయబారిగా తన అధికార ధృవ పత్రాలను సమర్పించారు. దానితో చక్రవర్తి క్రైస్తవ సువార్తీకులకు తన రాజ్యంలో మత ప్రబోధం చేయ హక్కును ప్రసాదించాడు. గురువుల నివాసానికి ఒక ఆశ్రమంకూడ ఉచితంగా ఇచ్చాడు. యమగుచి నగరంలో ఫ్రాన్సిస్ ఆరు మాసాలు వాక్యపరిచర్యచేసి అయిదువందల మందికి బప్తిస్మమిచ్చారు. సామాన్యులలో సామాన్యునిగా ధనవంతులలో ధనవంతునిగా రాజువద్ద రాజు ప్రతినిధిగా ప్రవర్తించి కార్య దీక్షతో పట్టుదలతో క్రీస్తు రాజ్య విస్తరణగావించి తానొక పునీతునిగా తీర్చిదిద్దుకున్నారు.ఇక ఫ్రాన్సిసు దృష్టి చైనా దేశం పైకి మళ్లింది. “మీ మతం నిజమైన మతం అయితే ఇంకా ఎందుకు మా చైనా దేశంలో అడుగు పెట్టలేద"ని చైనీయులు ఎండిగినందున తానందుకు ప్రతిస్పందించి చైనాకు తప్పక వెళ్లాలనుకున్నారు.

ముందుగా కొన్ని పనులు చక్కబెట్టేందుకు భారత్ కు తిరిగివచ్చారు. కొన్ని ఆత్మలనా రక్షించాలని 1552 ఏప్రిల్ లో ఫ్రాన్సిస్ భారత్ ను వీడి సాన్సియాన్ ద్వీపం చేరుకున్నారు. అక్కడి అక్రమ రవాణాదారులను మంచి చేసుకొని తనను చెనా తీసుకు వెళ్లమని డబ్బు ఆశచూపినా ఫలితం దక్కలేదు. ఒకడైతే డబ్బు తీసుకొని పత్తాలేకుండా పోయాడుకూడ. తనకు చైనా వెళ్లి క్రీస్తును బోధించే అదృష్టం లేదేయని చింతించారు. ఫ్రాన్సిస్ జ్వరపీడితుడై 1552 నవంబరు 21న మంచానపడ్డారు.

అంతోనియో అనే చైనా క్రైస్తవ సేవకుడొకరు శౌరివారికి సపర్యలుచేసి వారి చివరి రోజుల్లో శ్రద్ధగా కని పెట్టుకున్నాడు. నవంబరు 28న కోమా అనగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మళ్లీ డిసెంబరు 1న తెలివిలోకి వచ్చి దైవ ప్రార్థనలో గడిపి డిసెంబరు 3న ప్రభువునందు నిద్రించారు. ఫ్రాన్సిస్ దేహాన్ని ఆ సాన్సియాన్ దీవిలోనే సమాధిచేశారు. ఈనాటికి చెక్కుచెదరని వారి మృతదేహాన్ని మలక్కాకు అక్కడి నుండి గోవాకు తీసుకొనివచ్చి దేవాలయంలో భద్రపరిచారు. - గోవా దేవాలయంలో వారి భౌతిక శరీరం శిథిలం కాకుండా తాజాగా ఉండింది. క్రీ|| శ|| 1622లో 15వ గ్రెగోరి పోపుగారు శౌరివారిని పునీతులుగా ప్రకటించారు. భారత దేశంలో సువార్త ప్రచారకులకు పాలక పునీతులు వీరే. ఇండియా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా పాలక పోషకులు వీరే.

A young Spanish gentleman, in the dangerous days of the Reformation, was making a name for himself as a professor of philosophy at the University of Paris. He was aspiring, apparently, to a high dignity, until Saint Ignatius of Loyola decided to undertake the spiritual conquest of this ardent soul. What does it profit a man to gain the entire world, if he suffers the loss of his soul? Ignatius often repeated to the brilliant teacher. The words of Christ, joined to the example of Ignatius and his disciples, prevailed. It was not long before his gifted friend decided to labor for the glory of God, by adopting the evangelical life of an apostle, to which he was indeed called. He was among the first five members of the Society of Jesus, those who with Ignatius made their religious vows in the church of Montmartre in Paris, on the feast of the Assumption in 1534.

On his way to Rome with the others, handicapped by severe penances he had imposed on himself, he remained in Venice and exercised a brief apostolate by caring for the sick in the city hospital. The others waited for him to regain his ability to walk. These first fervent Jesuits were intending to embark for the Holy Land, but were prevented by a war. In Rome, Francis again went to a hospital to serve the sick; he also visited the prisons to encourage and console the poor inmates, while preparing for ordination with the others, according to the desire of the pope.

Saint Ignatius having remained in Venice, the other five returned there afterwards. Francis was sent by Saint Ignatius to the Orient in 1534, where for twelve years he labored unceasingly to win souls, sleeping only three hours a night, eating very little, and bearing the Gospel to Hindustan, to Malacca, and as far as Japan. At all times thwarted by jealousy, covetousness, and the carelessness of those who should have helped and encouraged him, he did not slacken in his apostolic endeavors despite opposition and the difficulties of every sort which he encountered. The gift of tongues and miracles accompanied him everywhere; he resurrected several dead persons. And his inexhaustible kindness was not the least of his assets in winning thousands of pagans to the Faith. He baptized so many that his arm became virtually disabled, ten thousand in a single month in the kingdom of Trevancor, where in the same space of time he saw to the building of forty-five churches. At Meliapour, site of the martyrdom of Saint Thomas, he found the marble on which the Apostle was sacrificed, and which exuded blood the first time Mass was said upon it. Passing through various islands, cities and provinces of India, he strengthened his first conquests by additional preaching. He planted crosses in the public squares and overcame all obstacles.

From India he went to Japan; Saint Francis is called Apostle of Japan as well as of India. There the pagan priests opposed and calumniated him, and tried without success to outwit him in debates. Humiliated, they used subtle means to instill dislike for him in the minds of the court authorities. But he won the love as well as the respect of those he evangelized, blessing them with such miracles as filling the hitherto sterile sea of Cangoxima with inexhaustible reserves of fish. The vast kingdom of China appealed to his charity, and he was resolved to risk his life to force an entry, when God took him to Himself. It was on December 2, 1552, that the Apostle of the Indies died on Sancian, an island facing the city of Canton in China, like Moses, in sight of the land of promise.

Add new comment

1 + 2 =