SAINT OF THE DAY – December 21 పునీత పీటర్ కనీషియస్|ST. PETER CANISIUS

(గురువు, శ్రీసభకోవిదుడు, మతసాక్షి జర్మనీ దేశ పాలక పునీతుడు క్రీ|శ|| 1521 - 1597) అది జర్మనీదేశంలో శ్రీసభకు వ్యతిరేక పవనాలు వీచేకాలం. దివ్యబలిపూజ, కతోలిక దివ్య సంస్కా రాలు, ఆచార వ్యవహారాల యెడల విముఖత కన్పట్టిన కాలం. ఎవరికి తోచిన బైబిలు భాష్యం వారు చెప్పుకుంటు వారివారి అభిరుచుల అనుకూలతలకు తగ్గటు క్రైస్తవ శాఖలు, ఆ శాఖలకు ఉపశాఖలు ఇలా ప్రొట్టెస్టెంటులు అధికం కావొచ్చిన కాలం. ఈ వికట కాలంలో పీటర్ కనీషియస్ జర్మనీ క్రైస్తవాళికి మార్గంచూపే వేగుచుక్కలా ప్రత్యక్షమయ్యారు. వీరినే పేతురు కనీషియసుగారని కూడ పిలుస్తారు.

జర్మనీ శ్రీ సభను కాపాడే నిమిత్తం 3వ పౌలు పోపుగారు ఒక సభను స్థాపించి అందులో ఉండి పనిచేయుటకు వేదకోవిదులను, శాస్త్రులను విరివిగా పంపమని వివిధ సభాధిపతులను కోరారు. అందుకు స్పందించిన పునీత లొయోలా ఇన్యాసివారు తమ ఏసుసభ అధీనంలో ఉన్న పీటర్ కనీషియస్, లిజె, అల్పోన్ సాల్మరాన్ అనే మువ్వురు గురు పండితులను జర్మనీదేశంకు పంపారు.

తన ఇరువురు సహగాములతో పీటర్ కనీషియస్ 1549 నవంబరు 13న జర్మనీలోని 'ఇంగోల్ స్టొద్' నగరం ప్రవేశించారు. ఆరోజునుండి తాము చనిపోయేవరకు జర్మనీదేశంలోని ముఖ్య ప్రదేశాలన్నీ సందర్శించి, శ్రీసభ సువార్తా ప్రచారం చేస్తు విశ్వాసాన్ని నూరిపోస్తూ విశేష కృషిసల్పారు. తెల్లవారింది లగాయతు ఆనాటి ఆర్థరాత్రి వరకు తరగతి గదుల్లోను, సమావేశాలలోను, దివ్యబలిపూజాదికాల్లోను పాల్గొని విరివిగా మత సిద్ధాంతాల్ని, విశ్వాస సత్యాల్సి విడమర్చి చెప్పేవారు. జటిల ప్రశ్నలకు సవివర సూటి సమాధానాలనిచ్చి సంతృప్తి పరచేవారు.

గురుశ్రీ పీటర్ కనీషియస్ గారు మొదటగా ఇంగోల్ స్టాద్ నగరంలో ఒక కళాశాలను నెలకొల్పారు. అందుచేరిన క్రైస్తవ యువతను విశ్వాసంలో బలపడేలా సునిశిత తర్పీదు నిచ్చారు. మరో మూడు సంవత్సరాల తర్వాత వియన్నా నగరంలో మరో కళాశాలను స్థాపించి శ్రీసభకు అండగా నిలిచారు. ఏసుసభ గురువుగా రచయితగా ఒక ప్రసంగాల సంపుటాన్ని, సత్యోపదేశ వివరణా పుస్తకాన్ని లిఖించారు. ఇవి వివిధ భాషల్లోకి అనువదింప బడి విరివిగా అమ్ముడయ్యా యి. ప్రొటెస్టంటులకు కతోలిక సిద్ధాంత వివరణను స్పష్టంగా చెప్పుట ద్వారా ఫాదర్ పీటర్ గారి విశ్వాస ప్రతిభాపాటవాలు ప్రస్పుటమయ్యాయి. కతోలిక విద్యాలయాల్లో సంస్థల్లో లోతైన కతోలిక విశ్వాస పునాది కోసం సత్యోపదేశాన్ని విధిగా నేర్పించాలని పట్టుబట్టింది వీరే. ఇందుకు తగిన పుస్తక రచన, కృషి సల్పిందియు వీరే.

ఫాదర్ కనీషియస్ తన తీరిక సమయాల్లో నగరలోని వైద్యశాలలు, చెరసాలలు సందర్శించి బాధితులను పరామర్శించేవారు. సద్బోధ చేసేవారు. వారిని ఏసు పేరట ఆశీర్వదించి శాంతపరచేవారు. క్రీ||శ|| 1552లో జర్మనీలో అంటువ్యాధి ప్రబలంకాగా వీరు ముందుండి పరిచర్య కార్యక్రమం జయప్రదం చేశారు. నెలలు, సంవత్సరాల తరబడి దివ్యపూజ అర్పింపబడక మూసివేయబడిన దేవాలయాలను తెరిపించి శుభ్రపరచి వాటిని పునరుద్ధరించారు. అప్పుడప్పుడు తానే దివ్యబలిపూజలర్పించి క్రైస్తవులను ప్రార్ధనోన్ముఖు లను గావించారు. తన వాగ్దాటితో శ్రీసభ సిద్ధాంతాల్ని సోదాహరణంగా విన్పించి క్రైస్తవులను ముగ్గులను గావించారు. తామరతంపరగా విడిపోయిన క్రైస్తవులను శ్రీసభ జీవన స్రవంతిలోకి విరివిగా రప్పింపకలిగారు. నేరస్తులు, అవిశ్వాసుల మనసు త్రిప్పుటకు తన జ్ఞాన సంపదనంతా క్రుమ్మరించి వారిని తన మాటవినేట్లు చేసుకున్నారు. పవిత్రాత్మశక్తి రుచి చూపారు.

క్రీ||శ|| 1553లో ఫాదర్ పీటర్ గార్కి పీఠాధిపతి అయ్యే అవకాశం వచ్చినా వారు సున్ని తంగా త్రోసిపుచ్చారు. అయితే వియాన్నా పీఠానికి బిషప్ లేని కాలంలో పరిపాలనాధికారిగా దిగ్విజయంగా పనిచేశారు. ప్రేగ్ నగరంలో రెండేళ్లు గురువుగా పనిచేసిన కాలంలో ప్రతి ఆదివారము పెద్ద దేవళంలో తన గంభీర ఉపదేశాలనందించేవారు. ప్ర లోనే ఒక కళాశాలనుకూడ స్థాపించారు. పలువురు కార్డినర్లు, బిషప్పులు వీరిని తమవద్దకు రప్పించుకొని సలహాలు సూచనలను పొంది తమ మేత్రాసన పరిపాలనను మెరుగు పరచుకునేవారు. ప్రొటెస్టాంటులను తట్టుకోవడంలో శ్రీసభ పాలకులను సుదృఢపరచడంలో వీరికి వీరే సాటిగా నిలిచారు. కతోలిక నాయకులకు నిత్యనూతన తర్ఫీదునిస్తూ వారు శ్రీ సభకు తగిన బిడ్డలనుగా రూపొందించారు. వీరు ఒక వ్యక్తిగా కాక ఒక శక్తిగా పనిచేశారు.

జర్మనీ దేశంలో తాను గురువుగానున్న ఏసుసభకు ప్రాంతీయాధిపతిగా 1556 నుండి 1569 వరకు 14 సం||లు సేవలందించారు. ఆ కాలంలో వారు 18 కళాశాలలను స్థాపించి ఉన్నత విద్యాప్రదాతగా, సుజ్ఞాన సంవిధాతగా గణుతికెక్కారు. వీరు ముఖ్యంగా యువజనులకు మంచి మార్గదర్శకత్వం వహించారు. వీరు శ్రీసభ బోధలకు సోపానాలైన 37 గ్రంథాలను వ్రాశారు. వీరి ఉపన్యాసాల సంగ్రహమే పదివేల పేజీలనుమించిన పుస్తకమయ్యింది. క్రీ||శ|| 1562లో ట్రెంట్ మహా సమావేశాల్లో వేదాంతశాస్త్రవేత్తగా పాల్గొని తమ అమూల్య సలహాలు, వాఖ్యలనందించి కౌన్సిల్కు ఎంతో తోడ్పడ్డారు. 1573లో 13వ గ్రెగోరి పోపుగారి ఆహ్వానంపై వెళ్లి జర్మనీలో కతోలిక శ్రీసభ అభివృద్ధిగూర్చి చర్చించారు. తగినన్ని గురుశిక్షణాలయాలు, తగినంతమంది గురువులు జర్మనీలో ఉండేలా ప్రత్యేక సలహా నొసంగారు.

ఇంతటి మహనీయుడైన పీటర్ కనీషియస్ 1521 మే 8న హాలెండ్ దేశంలోగల 'నిజ్ మెగెన్' గ్రామంలో పుట్టారు. కొలోన్వెలో చదివి ఏసుసభలో చేరి 1546లో గురుపట్టా పొందారు. జర్మనీ దేశంలోనే శక్తివంతంగా తమ గరిష్ఠ గురు సేవలందించి శ్రీసభ నిలదొక్కు కోడానికి తన శక్తియుక్తులన్నీ ధారపోశారు. వీరు తమ వృద్ధాప్యలో 1597 డిసెంబరు 21న స్విట్జర్ల్యాండ్ దేశంలోని పై పొర్లి పట్టణంలో పరలోక ప్రాప్తినొందారు. శ్రీసభ పుత్రుడుగా, వేదపండితునిగా, విద్యామతల్లి పోషకునిగా, నిష్కళంక జీవితం, నిస్వార్ధ సేవకు గుర్తింపుగా 11వ పయస్, (భక్తినాధ) పోపుగారు 1925 మే 21న పునీత పట్టా పురస్కారంతో గౌరవించారు. శ్రీసభ వీరిని జర్మనీ దేశ పాలక పునీతునిగా ప్రకటించింది. భిన్న మతావలంబికులయెడ “సమ్మెట, సుత్తి” అని పిలువబడిన వీరు అర్థవంతమైన గురువుకు ప్రతీకగా నిలిచారు.

Born in 1521 of a distinguished family of Holland, Saint Peter Canisius studied in Cologne and received his license as doctor of civil law; he then went to Louvain (Belgium) to learn canon law. These studies followed close upon the days when Luther had burnt the papal bulls at Wittenberg, Germany. Soon Saint Peter, become a Jesuit, was teaching at the University of Cologne; he was there when the unfortunate archbishop of that city fell into the new heresy. The Catholics who desired to depose him needed a deputy to the emperor to present their request, and Saint Peter was chosen.

His mission, seconded by the Holy Spirit, succeeded; and the deputy was remarked by a Cardinal, who desired to send him to the Council of Trent as his representative and theologian. Saint Peter's superior, Saint Ignatius of Loyola himself, approved this choice, and the young Jesuit took his place among the Fathers of the Council. He was commissioned to draft a memoir on the exact nature of the errors being propagated in the lands of the reform, in consort with the Pope's theologian, another Jesuit named Jacques Laynez. Their work was admired; the Council was dissolved soon afterwards, however, and Saint Peter was recalled to Rome by Saint Ignatius, to consult with him concerning the formation of the religious and the future of their Order.

Afterwards Saint Peter and two other Jesuits founded a college at Ingolstadt, going there with only two books in their baggage, the Spiritual Exercises of Saint Ignatius and the famous Ratio Studiorum, or Plan of Studies of their Order. Saint Peter was named Rector of the University by that institution. He was in demand everywhere; King Ferdinand of Rome obtained his presence for Vienna. A pestilence broke out there, and he was most often found at the bedside of the dying, caring for the bodies and regenerating the souls of the unfortunate citizens. He opened a boarding school for boys, and Vienna soon found itself reborn in the faith: the famous Catechism of Saint Peter Canisius had much to do with the renovation. During his lifetime it appeared in more than 200 editions, in at least twelve languages. It remains a monument of the triumph of the Church over error in the time of Luther.

Its author had tried to keep his name a secret but did not succeed, and then several nations disputed the honor of his presence. But Saint Peter was Provincial of Germany, named by Saint Ignatius, and he concerned himself above all with the colleges at Prague, Ingolstadt and Munich. Until his death in 1597 the Apostle of Germany continued the valiant and perpetual combat of the Church against error. For a long time forgotten, Saint Peter was canonized and declared a Doctor of the Church by Pope Pius XI in 1927.

Add new comment

14 + 5 =