SAINT OF THE DAY – December  13 పునీత లూసీ|ST. LUCY

 (కన్య, వేదసాక్షి, సిరకూ సె, సిసిలీలకు పాలక పునీతురాలు, కంటి వ్యాధిగ్రస్తుల సంరక్షక పునీతురాలు క్రీ||శ|| 283 - 304)   పునీత లూసియమ్మగారి పండుగ రోజున ప్రభుమార్గాన నడువ తమకు వెలుగు చూపుమని ఆ యమ్మను భక్తులు కోరుతుంటారు. శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను తాము అంధులుగా మిగిలిపోకుండా మార్గదర్శకత్వం వహింపుమని, మంచి దృష్టితో ముందుకు సాగునట్లు తమ కొరకు దేవుని ప్రార్థింపుడని భక్తులు అర్థిస్తుంటారు. లోకాశలు, తప్పుడు నినాదాలు, చెడ్డదృశ్యాల వలలో చిక్కుకొనకుండ కాపాడుకొనుటకు విశ్వాసులు లూసియమ్మగారి మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటారు. ఆయమ్మ పలికినట్లు “క్రియాశీలకంగా ప్రవర్తించండి. గాలిలో ఎగిరే పక్షి చేసే వాగ్దానాలు విని మోసపోకండి. నేల విడిచి సాముచేయకండి. మీముందు ఉన్న అవకాశాన్ని ఇప్పుడే ఇక్కడే సద్వినియోగపర్చుకోండి. ఈ లోకంలో మీ జీవితం శాశ్వతం కాదు కదా !” అనే మాటలను జ్ఞాపకపర్చుకుంటారు. .

పునీత లూసిగారిది గ్రీకువంశం. ధనిక కుటుంబంలో పుట్టారు. 'సిసిలి' ద్వీపకల్పంలో 'సిరకూ సె' నగరంలో క్రీ॥శ॥ 283లో ఉద్భవించారు. వీరికి లూసి అని పేరు పెట్టబడింది. లక్స్ అనబడే లాటిను పదానికి సమానార్థం. 'వెలుగు అనే సార్థక నామధేయురాలు వీరు. పసి ప్రాయంలోనే తండ్రి చనిపోగా తల్లి యుతీబియా పెంపకంలోనే పెరిగారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చిన్న ప్రాయంలోనే నిశ్చతార్థం జరిపించి పెండ్లీడు వచ్చాక కళ్యాణం జరిపించేవారు. అలాగే లూసియమ్మకు ఒక ధనిక కుర్రాడితో పెండ్లి జరిపించాలని తల్లికోరిక. బలవంతంగా నిశ్చితార్థ కార్యక్రమం జరిపించింది. కన్యగా దేవునికి అర్పించుకోవాలన్న ఆ యమ్మ కోర్కెకు గండిపడింది.

అయితే ఆ యువకుడు క్రైస్తవేతరుడు. దియో క్లేషియన్ చక్రవర్తి క్రైస్తవ వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్న రోజులవి. అయినా పునీత సెసీల్వమ్మగారిలా తాను ప్రయత్నించి తనకు కాబోయే భర్తను తనదారికి తెచ్చుకోవాలని లూసీ భావించారు.

ఇది ఇలా ఉండగా, లూసియమ్మగారి తల్లి యుతీబియాకు చాలా కాలంనుండి రక్త స్రావరోగం బాధిస్తూ ఉంది. ఈ సందర్భాన్ని లూసి వినియోగింప తలంచారు. తాము ఉంటున్న సిరకూ సె పట్టణంకు 50 మైళ్ల దూరంలో కలానియ పట్టణంలో (సిసిలీ దేశంలోనే) పునీత గారి సమాధి ఉంది. అక్కడ అద్భుతాలు స్వస్థతలు కోకొల్లలుగా నెరవేరుతున్నాయి. ఈ విషయాన్ని లూసీగారు తల్లికి వివరించి అక్కడికి ప్రయాణానికి పురమాయించారు. అగతగారి సమాధిని దర్శించి ప్రార్థింపగా తల్లి యుతీబియాకు పూర్తి ఆరోగ్యం, శాంతి లభించింది. అందువల్ల ఆనందపడింది. బిడ్డ మాటల పై గురి ఏర్పడింది.

గతంలో లూసీగారు తమ తల్లిని అడుగుతూ ఉండేవారు. తమకుగల అపారమైన ఆస్థిలో తనవాటాకు వచ్చే ఆస్థిని అమ్మి పేదలకు పంచాలని తల్లికి స్వస్థత చేకూరిన సందర్భంగా దేవునికి ధన్యవాదాలు తెల్పుటకు కొంత ఆస్థిని ఈ సందర్భంలో పంచడానికి తల్లి సమ్మతించింది. అయితే వీరి ఆస్థికోసం ఆశపడి లూసీగార్ని వివాహమాడ నిశ్చితార్ధమైన యువకుడు ఆస్థిని దిక్కుమాలిన వారికి దానధర్మం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించాడు. గవర్నరుకు పిర్యాదుచేశాడు. గవర్నరు ఆ తల్లీ కూతుర్లకు హెచ్చరిక చేశాడు. అనేక ఆటంకాలు కలిగించాడు. బాధలు పెట్టాడు. మరో ప్రక్క దియోక్లేషియను చక్రవర్తి వేద హింసలు కొనసాగుతూనే ఉన్నాయి. రోమన్ దేవతలనే ప్రజలు ఆరాధించాలని కలసి మెలసి జీవించాలని చక్రవర్తి శాసనం. దేశభక్తులు, ధనికులైనా సరే క్రైస్తవ మతావలంబన తన రాజ్యంలో నిషిద్ధమని ఆచరణ, ప్రచారంకూడదని ఆజ్ఞ జారీచేశాడు. లూసీగారు ఇందుకు గట్టిగా వ్యతిరేకించారు. వ్యక్తి స్వేచ్ఛకు యిష్టానికి చక్రవర్తి అడ్డు చెప్పడం విడ్డూరమని నుడివారు. పైగా అన్య దేవతలను పూజించడం వల్లకాదని విముక్త ఏసుక్రీస్తు ప్రభువును విడిచి పెట్టేదిలేదని నిక్కచ్చిగా ప్రకటించారు.

లూసియమ్మగార్ని వేశ్యగృహానికి తరలింపమని గవర్నరు తాఖీదు జారీచేశాడు. ఎంత ప్రయత్నించినా ఆ యమ్మ నిలబడ్డ చోటనుండి కదలించడం బలమైన భటులవల్ల కాలేదు. ఆమె అందమైన జ్యోతిర్మయ కండ్లు దేవునివైపే నిలబడ్డాయి. ఆమెను కాల్చి చంపాల్సిందిగా మరో ఆజ్ఞ జారీచేయబడింది. కాని మంటలు ఆ పవిత్రురాలిని తాక లేకపోయాయి. పిమ్మట పదునైన ఒక పెద్ద బాకును ఆయమ్మ గొంతులో దూరే విధంగా బలంగా పొడవబడటంతో ఆ కన్య తన అంతిమ శ్వాస విడిచారు. ఇది క్రీ॥శ॥ 304లో జరుగుగా ఎందరో విశ్వాసులకు ఆదర్శ ప్రాయమైంది.

ఆరవ శతాబ్దంలో రోమునగరంలో భక్తులు లూసియమ్మ ఒక పవిత్ర కన్యని కొనియాడుచుండగా శ్రీసభ పూజల్లో ఆయమ్మ పేరు ఉచ్చరింపబడునట్లుగా శాసించింది. పోపు గ్రెగోరి ది గ్రేట్ గారు ఆయమ్మ పరిశుద్ధత, తమలేఖలో ఎంతగానో శ్లాఘించారు. ఆ పవిత్రురాలిని సిరకూసే నగరం. సిసిలీ ద్వీపకల్పంకు, కంటి, గొంతు, రక్తస్రావ వ్యాధిగ్రస్తులకు పాలక పునీతురాలిగా శ్రీసభ నియమించింది. 

Saint Lucy was a young Christian maiden of Syracuse in Sicily. She had already offered her virginity to God and refused to marry, when her mother pressed her to accept the offer of a young pagan. The mother was afflicted afterwards for several years by an issue of blood, and all human remedies were ineffectual. Lucy reminded her mother that a woman in the Gospel, suffering from the same disorder, had been healed by the divine power. They determined to make a journey to Catania, a port of Sicily, where the tomb of Saint Agatha, martyred in 251, was already a site of pilgrimage. Saint Agatha, Lucy said, stands ever in the sight of Him for whom she died. Only touch her sepulchre with faith, and you will be healed. The Saint of Catania had already saved that city, when Mount Etna had erupted the year after her martyrdom: some frightened pagans, seeing a course of lava descending directly toward the city, had uncovered her tomb, and at once it had stopped.

Saint Lucy and her mother spent an entire night praying by the tomb, until, overcome by weariness, both fell asleep. Saint Agatha appeared in vision to Saint Lucy, and addressing her sister in the faith, foretold her mother's recovery and Lucy's future martyrdom: You will soon be the glory of Syracuse, as I am of Catania. At that instant the cure was effected; and in her gratitude the mother allowed her daughter to distribute her wealth among the poor, and to conserve her virginity.

The young man who had sought her hand in marriage denounced her as a Christian during the persecution of Diocletian, but Our Lord, by a special miracle, saved from outrage this virgin He had chosen for His own. The executioners who would have taken her to a house of ill fame were unable to move her. The exasperated prefect gave orders to attach her by cords to harnessed bulls, but the bulls, too, did not succeed, and he accused her of being a magician. How can you, a feeble woman, triumph over a thousand men? She replied, Bring ten thousand, and they will not be able to combat against God! A fire kindled around her did her no harm, though she was covered with resin and oil. When a sword was plunged into her heart, the promise made at the tomb of Saint Agatha was fulfilled. Saint Lucy died, predicting peace for the Church. 

 

Add new comment

8 + 1 =