SAINT OF THE DAY – AUGUST 28 పునీత అగస్టీను|ST. AUGUSTINE

(బిషప్, శ్రీసభ పండితుడు, ముద్రాపకుల పాలక పునీతుడు క్రీ||శ|| 354 - 430) అగస్టీను వారికి పునీత పట్టా కట్టబెడుతూ 1వ లియో (సింహరాయులు) జగద్గురువులు “పునీత అగస్టీను వారి పండుగను ప్రత్యేక గౌరవంతో ఒక అపోస్తలునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతతో జరుపుకోవాలి. తరతరాల వరకు కతోలికులకు, అన్యులకు అందరికి సమానంగా వీరి రచనలు మంచి ప్రేరణ, స్పూర్తి అందిస్తాయి” అని అన్నారు. అగస్టీను వారు ఉత్తర ఆఫ్రికాలోగల హిప్పోనగర పీఠం, నుమిదియా మండలంలోని 'తగాస్టె' అనబడే చిన్న పట్టణంలో క్రీ||శ|| 354 నవంబరు 13న తొలి సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు అంత ధనవంతులుకారు. కాని ఉన్నత కుటుంబమే. తండ్రి పేరు పెట్రిషియస్. అన్యుడు.

కోపిష్టి కాని ఉత్తమ క్రైస్తవ ఇల్లాలి వల్ల తన మరణానికి చాలాముందే దీనత్వము ఆపాదించుకొని జ్ఞానస్నానంపొందాడు. ఈయన భార్య అనగా అగస్టీనుగారి తల్లి పేరు మోనికా. ఈమె భర్త కు ఉత్తమ ఇల్లాలే గాక తమ పిల్లలకు ఆదర్శతల్లి. ఈమె పునీతురాలుకూడా. వీరికి అగస్టీను, నవిజియస్ అనే కొడుకులు పెర్పుతువా అనే కూతురు కలిగారు. అగస్టీను తన బాల్యం , నిలకడ నీతిలేని యవ్వనం, స్వీయ పరివర్తన, తల్లి మరణో దంతంగూర్చి “పాపోచ్చరణలు” అనే తన ఆత్మ కథలో వ్రాసుకున్నారు. “పరుల బ్రతుకులు ప్రవర్తనగూర్చి ఆసక్తి కనబరిచే మనిషి తనను తాను సంస్కరించు ఎందుకు జాగ్రత్తపడడు ? ఒక పాపాత్ముని యెడల దైవం చూపే కానికిగంను గుర్తించాలి. తాను ఉన్న స్థితికంటే గొప్పవాడని ఎవరూ తలంచరనీ గహించాలి' అని ఈ అనుభవజ్ఞుడు వ్రాశారు. అగస్టీను తన 12 ఏళ్ల ప్రాయంలో 'మదౌరా' పట్నంలోని ఒక రోమను వ్యాకరణ గశాలలో చేర్పింపబడ్డారు. లాటిను భాష బాగానేర్చాడు. కాని గ్రీకు భాష చేరడంలో వెనుకబడ్డాడు.

తన 16వ ఏట తగా స్టెకు తిరిగి వచ్చాడు. ఇక అగసీనుగారికి చెడ్డ స్నేహితులు దాపురించారు. దుర్వ్యసనాలతో విచ్చలవిడిగా తిరగడం ఎక్కువైంది. వీరిని సంస్క రించాలని తండ్రి ఆకాంక్ష. కాని అంతతీరిక పటింపు చూపలేదు. వైరము, మోహము, క్రోధము (ఎఫీ. 5:31) అనే మనో వికారాలను అణచి వేసుకొమ్మని తల్లి బుద్దిమాటలు పలికింది. పదే పదే ప్రభువును ప్రార్థించింది. ఇంతలో తండ్రి గతించగా ఒక ధనవంతుని ఆర్ధిక సహాయంతో 'కర్తానె నగరంలో పెద్ద చదువులకై వెళ్లాడు. ఇక్కడ మానసికంగా బాగా ఎదిగాడు. సాహిత్య విద్యలో మొదటి వారుగా నిల్చారు. కాని ధన సంపాదన, కీర్తి, అహంకారం పెంచుకునేందుకే చదువని అప్పట్లో తుచ్చంగా భావించానని అగస్టీను తమ ఆత్మకథలో వ్రాసుకున్నారు. తన ఈ విద్యాకాలంలోనే ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని 13 సం||లు కాపురం చేశారు. తనకు 20 ఏళ్లు నిండకముందే తండ్రి అయ్యాడు. కుమారుడికి “దేవవరప్రసాద్' (Adeodotus) అని భక్తినామం ధరింపజేశారు. కాని అగస్టీను ఒక అన్యుడుగానే జీవించడం తల్లి మోనికాకు నచ్చలేదు. మనో పరివర్తన చెంది మంచి క్రైస్తవుడుగా మారాలని దేవుని సాయం కోరుతు పరిపరి విధాల జపతపాలు నిర్వహించింది. అగస్టీనుగారు తన సాక్ష్యాలు పుస్తకం (5:8)లో “దేవా ! ఆమె నా కోసం మరీ మరీ నిన్ను ప్రార్థించింది” అని వ్రాశారు.

అగస్టీనుగారు సుప్రసిద్ధ గ్రంథకర్తలైన వెర్టిల్, వర్రో, సిసిరో రచనల్ని చదివి సంతృప్తి పడక వేద శాస్త్రాలు చదవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తగా సె. కర్తాన్య పట్టణాల్లో 9సం||లు సాహిత్యం, వ్యాకరణ శాస్త్రాల విద్యాలయాన్ని నడిపారు. మోనికాగారు తమ దాపులోని బిషప్పుగార్కి తన గోడు వెళ్లబోసుకుంది. “అమ్మా ! ని పుత్రుని పరివర్తన కోసం నీవు రాల్చిన ఎన్నో కన్నీటి చుక్కలు వృధాపోవు. నీ ప్రార్థనలు, ఉపవాసాలు, సుబోధలు అగస్టీనును ఏనాటికైనా ఉత్తమ క్రైస్తవుని Sణంఅని జోస్యం చెప్పారు. క్రీ.శ 383లో అగస్టీన్ ఒంటరిగా ఇటలీలోని రోమునగరం : పాఠశాల ప్రారంభించారు. కాని ఆర్దిక లేమివల్ల విఫలమయ్యారుశాలలో ఇటలీదేశలోనే ఉన్న మిలానో నగరంలో ఒక ప్రసిద్ధ పాఠశాల అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు. ఇక్కడే పునీత బిషప్ అం/g పరిచయమేర్పడింది. వారి ఉపన్యాసాలు, సలహాలు అగస్టీనుగారిలో 5. అంకురార్పణచేశాయి. ఆ రోజుల్లో గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో మరియు ... రచనలు చదివారు. “ప్లేటో నిజ దేవుని గురించిన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. ఆ ఏసు నాకు మార్గం చూపాడు” అని తన పుస్తకంలో అగస్టీన్ వ్రాసుకున్నారు.

ఇంతలో తల్లి మోనికా ఆఫ్రికా నుండి బయలుదేరి ఇటలీలోని 'మి ఆ నగరంలో ఉన్న కుమారుని చేరుకుంది. ఈ విషయమై “ప్రేమబలంవల్లనే ఆమెలలోని మిలానో నాకోసం ప్రయాణం కట్టుకుని నన్ను వెంబడించింది.' అని అగస్టీన్ తన సాకాయి. (6:1) పుస్తకంలో వ్రాసుకున్నారు. ఇప్పటికైనా అగస్టీన్ మంచి క్రైస్తవుడు కావాలని ఉంచుకున్న స్త్రీని విడిచివేయమని ప్రాధేయపడింది. అందుకు అగస్టీనుగారు నీతికి ఆధ్యాత్మికతకు మధ్య సంఘర్షణలో పడిపోయారు. శస్త్రచికిత్స విజయవంతమైంది కాని రోగి మాత్రం చనిపోయాడన్న చందంగా ఉంది వీరి పరిస్థితి. బైబిలు చదవడం మొదలు పెట్టారు. ముఖ్యంగా పౌలు లేఖలు వీరిని ఆకర్షించాయి. 

మొదటి (పాత) నిబంధనలోని ప్రవచనాలు రెండవ (క్రొత్త) నిబంధనలో క్రీస్తు నందు నిజంకావడం అగస్టీనుగారి విశ్వాసంలోకి లాగుతోంది. ఇంతలో వీరితో గడిపిన స్త్రీ స్వదేశంలో ఒక మఠంలో చేరి దేవుని సేవలో పడినట్లుగా చరిత్ర చెబుతోంది.ఒకరోజు ఆఫ్రికానుండి పొంతితియాన్, అలిపియస్ అను ఇద్దరు క్రైస్తవులు వచ్చి అగస్టీనుగార్ని కలసుకున్నారు. ఈజిఫుదేశ పునీత అంతోనివారి ఆదర్శచరిత్రను విన్నింపజేశారు. పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 13:13-14 చాం అగస్టీనుగారిలో పరివర్తన కలిగింది. తాను అనుసరిస్తున్న 'మనిఛిన్ లో విడిచి పెట్టారు. మిలాన్ నగరంలోనే పునీత బిషప్ అంబ్రోస్గారి ద్వారా ఈ 387 ఏప్రిల్ 24న జ్ఞానస్నానం పొందారు. కొత్త జీవితం మొదలు పెట్టారు. ఏ స్వదేశం వెళ్లడానికి తల్లితో సహా ఓస్టియా ఓడరేవువెళ్లారు. అస్వస్థతవల్ల అక్కడే మృతిచెందారు. ఈ సందర్బంగా "నా తల్లికి ఆమె ప్రాథ నేను సర్వదా ఋణపడి ఉంటాను'' అని అగస్టిన వ్రాసుకున్నారు.

మన వైరాగ్యం జనించింది. కఠోర బ్రహ్మచర్యం పాటించారు. క్రీస్తుకోసం తానొక ముం స్థాపించారు. దారిద్ర్యం, ప్రార్థన, గ్రంథపఠనం వంటి ప్రతదీక్షతో ఆశ్రమ మఠం అభివృద్ధి చెందింది. తాను గురువు కావాలని అనుకోలేదు. కాని గురువిద్యనుడేకు అధ్యయనంచేసి క్రి||శ|| 391లో హిప్పోనగర పీఠాధిపతి వలేరియస్గారిచే గురుపట్టాభిషిక్తులయ్యారు. ఉత్సాహంతో మత ప్రచారం చేశారు. ఉత్తరించు ఆత్మల విమోచనకై ప్రార్థన, సిలువ స్వరూపవందన ప్రోత్సహించారు. తన 42వ ఏట క్రీ.శII 395లో బిషప్ వలేరియస్గార్కి సహాయక పీఠాధిపతిగా అభిషేకితులై వారి మరణానంతరం హిప్పోనగర పీఠాధిపతి అయ్యారు. గురువులు, డీకనులు, ఉపడీకనుల సంఖ్యను పెంపొందింపజేసి క్రైస్తవం వర్ధిల్లజేశారు. క్రీస్తు అపోస్తలునిగా సామాన్య జీవితంకు మఠవాసులు కట్టుబడునట్లు చేశారు. మఠ ఆశ్రమాలు, వైద్యశాలలు గుడులు నెలకొల్పారు. స్త్రీలకు ఒక సభను ఏర్పరచి తన చెల్లి పర్ఫెతువాగార్ని మఠశ్రేష్టురాలమ్మగా నియమించారు.

అగస్టీనుగారు తమ స్తవులతో “మీరు లేకుండా నేనొక్కణ్నే రక్షింపబడటం నాకు ఇష్టంలేదు.” అనే వారు. మరియు “నేనెందుకు ఈ లోకంలో ఉన్నాను? క్రీస్తులో జీవించడానికి. అదీనూ మీతో కలసి వారితో జీవించడానికి. ఇదే నా సంపద గౌరవం ఆనందం.” అనేవారు. వీరికి పునీత జెరోమ్ గారితో పరిచయముండేది. ఆనాటి బలమైన 'మేనిచియం' మత నాయుకుడైన ఫెలిక్స్తో బహిరంగ చర్చలో ఓడించగా అతడు జ్ఞానస్నానం పొందినట్లు చరిత్ర చెపుతోంది. విగ్రహారాధకులలో పరివర్తన కలిగేలా బోధించారు. వారికొరకై “దేవుని పట్టణం” అనే గ్రంథం విరచించారు. కతోలి కుల వేదం కు వ్యతిరేకులైన “డోనాటినులు, పెలాజీనియసుల”కు తగు బుద్ది చెప్పుటకు “పునీతులయొక్క ముందస్తు గమ్యస్థానం,” “పట్టుదలావరం” అనే గ్రంథాల్ని వ్రాశారు. గురువులు క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శ జీవితంతో మంచి కాపరులై తమ క్రైస్తవ మందను పరిరక్షించుకోవాలన్నారు. వీరు క్రీ||శ|| 430 ఆగష్టు 28న తమ 76వ ఏట పరమపదించారు.#rvatelugu #dailysaint #saint


Saint Augustine was born in 354 at Tagaste in Africa. He was brought up in the Christian faith but did not receive baptism, result of the practice, common in the first centuries, of deferring it until adulthood. An ambitious schoolboy of brilliant talents and violent passions, he early lost both his faith and his innocence. He pursued with ardor the study of philosophy. He taught grammar, rhetoric and literature for nine years in his native town of Tagaste, and in Carthage.

He persisted in his irregular life and doctrinal errors until he was thirty-two. Then one day, stung to the heart by the account of some sudden conversions, he cried out, The unlearned rise and storm heaven, and we, with all our learning, for lack of courage lie inert! The great heart of this future bishop was already evident.

When as a genial student of rhetoric, he was at Milan, where Saint Ambrose was bishop, Augustine tells us later in his autobiography, the Catholic faith of his childhood regained possession of his intellect, but he could not as yet resolve to break the chains of bad habit. His mother helped him to separate from the mother of his son, Adeodatus, who had died as a young man; and she, after this painful separation, retired for life to a convent, regretting that she had long enchained this soul of predilection. Augustine's mother, Saint Monica, died soon afterwards.

Urged also by a friend who had decided to adopt a celibate life, Saint Augustine took up a book of the Holy Scriptures, and read the Epistles of Saint Paul in a new light. A long and terrible conflict ensued, but with the help of grace the battle was won; he went to consult a priest and received baptism, returned to Africa and gave all he had to the poor. At Hippo, where he settled, he was consecrated bishop in 395.

For thirty-five years he was the center of ecclesiastical life in Africa, and the Church's strongest champion against heresy. His writings, which compose many volumes, have been everywhere accepted as a major source of both Christian spirituality and theological speculation. The great Doctor died, deeply regretted by the entire Christian world, in 430.

Add new comment

4 + 6 =