SAINT OF THE DAY – AUGUST 14 మ్యాక్సిమిలియను కోల్బె|ST. MAXIMILLIAN KOLBE

(పోలెండుదేశ ఫ్రాన్సీసుసభ గురువు, కష్టతర శతాబ్ద పాలక పునీతుడు, అభినవ అపోస్తలుడు, వేదసాక్షి క్రీ||శ|| 1894 - 1941) పోలెండుదేశంలో లోడ్స్ నగర దాపులోని జదునస్కావోల గ్రామంలో 1894 జనవరి 1 లేక 8న పునీత మేక్సిమిలియను మేరి కోల్బె జన్మించారు. క్రీస్తు సుగుణాలయెడల బాగా ఆకర్షితులయ్యారు. వీరి జ్ఞానస్నానం పేరు రేమండ్. క్రీస్తు అనుచరుడు కాగోరి ఫ్రాన్సీసువారి సభలో చేరారు. 1911 మరియు 1917లో గురుశిక్షణా వ్రతాలు స్వీకరించారు. క్రీ||శ|| 1918లో పరిశుద్ద రోమునగరంలో గురుపట్టాను పొందారు. గురువుగా మేక్సిమిలియన్ అను పేరును ధరించారు. పిమ్మట పోలెండు సొంతగడ్డకు విచ్చేశారు.

వీరికి దేవమాత యెడల అపారమైన భక్తి ఉండేది. క్రీస్తు విశ్వాసం వెదజల్లడానికి వీరు “నిష్కళంక మరియమాత దళం'ను నెలకొల్పారు. మాతృదేశంలోను అనేక ఇతర దేశాల్లోను ఈ దళ కార్యక్రమం విస్తరింపజేశారు. వీరు 'జన్మపాపరహితోద్భవి దండు' పేరట ఒక మాసపత్రికను కూడ నెలకొల్పి తమ విశ్వాస భావాల్ని వేలాది భక్తులకు అందించారు. 1927లో “నిర్మలమాత నగరాలు” అని అర్దంనిచ్చే 'నియోపొకలనోవ్' సభను స్థాపించారు. దీని ప్రధానకేంద్రం వార్సాపట్టణంకు 25 మైళ్ల దూరంలోని ప్రదేశంలో నిర్మింపజేశారు. ఈ సభ జపాను భారతదేశంలోను బాగా విస్తరించింది. వీరు జపానులో వేద ప్రచారకునిగా విరివిగా పనిచేశారు.  1936లో వీరు పోలెండులోని తమసభ కు సుపీరియరుగా తమ సేవలందించారు. ఆరంభంలోనే దాదాపు ఎనిమిది వందల మందికి పైగా అనుచరులతో తన సభ కార్యక్రమాల్ని విస్తరిల్లజేశారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అనేక బాధలనుభవించారు. 1941లో జర్మను వారు దండెత్తి పోలెండును ఆక్రమించారు. జర్మనీనియంత హిట్లరు ఏర్పరచిన నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవార్ని వారు చంపించేవారు.

మాక్సిమిలియన్గారు నాజీల దౌష్ట్యాన్ని అమానవీయతను దుయ్యబడుతూ ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాసి ప్రచారం చేశారు. అందులో భాగంగా ఆ రోజుల్లో ఫాదర్ కోల్బెగారుకూడ బందీగా ఔచ్ విట్జ్ జైలులో ఉంచబడ్డారు. నాజీలకు బందీలుగా చిక్కినవారిలో కొందరికి అనగా దాదాపు పదిమందికి మరణశిక్ష విధింపబడింది. అందులో ఒక వ్యక్తికి ఈ కఠిన శిక్షపడటం ఫాదర్ కోల్బెగార్ని కలచివేసింది. ఆ వ్యక్తి పేరు ఫ్రాన్సీజెక్ గజోవ్నిక్ జేక్. ఇతనికి భార్య, అధిక సంఖ్యలో సంతానం ఉన్నారు. అతన్ని విడిపించాలంటే అతని బదులు తాను మరణించాలని కోల్బె నిశ్చయించారు. అతన్ని సాధారణ బందీల్లోకి మార్చి తాను ఆ స్థానంలో చేరుకున్నారు. ఈ మరణశిక్ష పడిన వారికి అన్న పానీయాలు అందింపబడక మలమల మాడ్చబడ్డారు. వారి శరీరంలోకి ప్రమాదకరమైన ఫినాయిలును ఇంజెక్షను ద్వారా ఎక్కించడం జరిగింది.

విపరీతబాధతో వారు నేల పైబడి గిలగిల కొట్టుకున్నారు. ఒక పేద కుటుంబీకుని రక్షించడం కోసం క్రీస్తుబాటను ఎంచుకున్నారు ఫాదర్ కోల్బె. 1941 ఆగష్టు 14న వీరు ఈ బాధామయ ధన్య మరణమొందారు. 1982 అక్టోబరు 10న రెండవ జాన్ పాల్ పోపుగారిచే పునీత పట్టానొందారు. తన స్థానంలో మరణించిన గురువు పునీత పట్టా పొందినందుకు జీవించి ఉన్న గజోవిక్ జెక్ ఆనందబాష్పాలు రాల్చారు. ఆనాడు “నా ప్రియ సోదరుడా! దేవుని మహిమకోసం రగులుతున్న నా హృదయం నన్ను నీ స్థానంలో ఉంచాలని ఉవ్విళ్లూరుతోంది” అని ఫాదర్ కోల్బె గారు గజోవ్నిక్ జెక్ తో పల్కిన మాటలు పదేపదే జ్ఞాపకం తెచ్చుకున్నారు. పదుగురితో పంచుకున్నారు. ఒకటే కృతజ్ఞతలు తెల్పుకున్నారు. మ్యాక్సి మిలియను అనగా గొప్ప శ్రామికుడు అని అర్థం. వీరు పాత్రికేయులకు పాలక పునీతులు.


The Knight of the Immaculate Virgin was born in Poland in 1894, and was a mischievous little boy. One day his mother, no longer knowing what to do with him, said to him: My child, what will become of you? He was suddenly afraid and went to pray before a statue of His heavenly Mother — for this was an exceptionally pious family, all of whose living members became religious, including, eventually, the parents. He was transformed that day into a new person, having asked Her to help him correct his faults.

When his parents separated to enter religion, he, too, entered a Franciscan novitiate, and was ordained in 1918 on April 28th, feast of the Marian apostle, Saint Louis Mary de Montfort. Already the great all-embracing idea of his life had come to him, a year earlier — a militia in honor of the Virgin destined to crush the head of the ancient serpent, master of pride and revolt. There should be an army at Her disposition, he was certain, and then She Herself could do all through its well-disciplined ranks. He found willing collaborators — a small group at first — ready to consecrate themselves to Her forever, for the fulfillment of Her desires.

They founded a magazine, invoking the special assistance of Saint Thérèse of Lisieux also, and the prodigious growth of this enterprise left those who could not understand its heavenly Sources mystified and sometimes very much contradicted. Soon the walls were cracking, so to speak, by the arrival of printing presses and, above all, religious vocations. The group of volunteers for the project had to leave, and Our Lady procured for them a terrain, without charge. As a result, The City of the Immaculate was organized, where some 50 low buildings were set up and mobilized for the various facets not only of publishing, but of the Franciscan life of prayer.

Father Kolbe, despite a health which was never other than precarious — for he was undermined by tuberculosis for long years, and virtually abandoned at one time as incurable — traveled both to Japan and to India to extend the militia to other lands where the Mother of God was sorely needed. Always She revealed Her protective Presence, accompanied by abundant blessings. The Founder of these holy residences said, The more souls there will be, totally given to the guidance of the Immaculate, the more Saints there will be, and very great Saints. Sanctity is not a luxury, but a simple duty, since Our Lord said, Be perfect, as your Heavenly Father is perfect.' He gave them as a formula, w=W — signifying the human will perfectly united and equivalent, through Her, to the Will of God. He said to them, Our sanctification is Her affair and Her specialty, since we belong unconditionally to Her.

The martyrdom of Father Kolbe in the hunger bunker of Auschwitz is well known. The City of the Immaculate was closed after the Nazis invaded Poland in 1939, and he was placed successively in two concentration camps, where the most cruel treatment could not alter his calm. He brought light to the despairing and renewed the faith of all with whom he came into contact. He was the last to die of the ten men condemned to the bunker to pay for the escape of an inmate of their dormitory. A guard found him alone still alive, on August 14, 1941 after fourteen days, seated in a corner in total deprivation, still praying. He stretched out his fleshless arm to the jailers who had come to finish him off with a hypodermic syringe. His expression in death was described as ecstatic; he was gazing upward, as if to welcome the One he saw coming for his soul.

Add new comment

10 + 0 =