SAINT OF THE DAY – AUGUST  21 పునీత10వ పయస్ (భక్తినాథ) పోపుగారు|ST. POPE PIUS X

@pjsri

(మతసాక్షి క్రీ||శ|| 1835 - 1914) కతోలిక శ్రీసభ పునీతుల నిలయం. ఎందరో మహానుభావులు వారివారి భక్తి మయ జీవితాలద్వారా శ్రీన భలోని సభ్యుల కు న్పూర్తినిచ్చి చిరస్మరణీయులయ్యారు. మానవాళిని ప్రభావితంచేసి కాలగర్భంలో కలిసిపోయినవారు కొందరైతే, తమ జీవిత విధానాల ద్వారా క్రైస్తవాళి పై శాశ్వత ముద్రవేసినవారు మరికొందరు. ఈ కోవకు చెందిన పునీత పదవ పయస్ పోపుగారు ప్రజలమనిషిగా స్మరింపబడుచున్నారు.

వీరి జ్ఞానస్నానం పేరు జోసఫ్ మెల్కియోర్ సార్తో, వీరు ఇటలీలో వెనిస్ నగర దాపులోగల 'త్రివేసా' పీఠంలోని ఓరియెసె' (Riese) అనబడు చిన్నపట్టణంలో క్రీ||శ|| 1835 జూన్ 2న పుట్టారు. తండ్రి పేరు జ్వాన్నిబత్తిస్తసార్త. వీరి ప్రధాన వృత్తి పాదరక్షలు తయారుచేయడం. మరియు వీరు నగర ప్రజాసమావేశ భవంతికి, తపాలా అధికారి భవంతికి భద్రతాధికారిగా పనిచేశారు. వీరి తల్లి పేరు మర్గరీత శాన్సన్. ఈమె కుట్టుపని చేస్తుండేది. పేద కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో తానే పెద్దవాడై పుట్టడాన బాల్యదశలో చాలా కష్టంగా జీవించారు. జోసఫ్ సార్తీగారు గురుమండల పాఠశాలలో చేరి విద్యనభ్యసించారు.

చదువులో చూపిన ప్రజ్ఞ, ప్రవర్తనలో కన్పర్చిన క్రమశిక్షణ అక్కడి గురువును ముగ్ధుణ్నిగావించింది. అందుకే జోసఫ్ సార్తె, కాసెల్ ఫ్రాంకో పట్టణంలోని ఉన్నత విద్యాశాలలో ప్రవేశింపగా ఉపకార వేతనాన్ని సమకూర్చి పెట్టారు. ఇక్కడ నాలుగు సంవత్సరాలు చదువుకున్నారు. ఈ సమయంలోనే జోసఫ్ సాల్తో తనలోని దైవపిలుపును ఆలకించారు. తల్లిదండ్రులుకూడ ప్రోత్సహించారు. తన సెమినరి ఖర్చులకు సరిపడ మరో ఉపకార వేతనం కూడ లభించడంతో పాదుకా పట్టణంలోని గురు శిక్షణాలయంలో 1850 నవంబరులో ప్రవేశించారు. ఎంతో భక్తిశ్రద్ధలతో నిష్టగా గురు విద్యను ముగించి కాస్టల్ ఫ్రాంకో పట్టణ కథెడ్రల్లో 1858 సెప్టెంబరు 18న గురు పట్టాభిషేకం పొందారు. సెమినరి పెద్దలు వీరిని "క్రమశిక్షణాపరుడు, సమర్ధుడు, జ్ఞాపకశక్తి కలవాడు, ఆశాజ్యోతి” అని కీర్తించారు.

యువకుడు, స్పురద్రూపి, శ్రీసభకోసం ఏదోచేయాలనే తపనగల ఫాదర్ జోసఫ్ సార్తీగారు ఇటలీలోనే తెంతినొ జిల్లాలోగల “తొంబోలో గురు మండల సహాయక కర్తగా నియమింపబడినారు. ఇక్కడ 1500 మంది క్రైస్తవులున్నారు. ఈ సంఖ్యను పెంచేదిశలో ప్రేషిత కార్యం చేపట్టారు. తాను ఇక్కడ 8 సం||లు పనిచేసి కూలి పనిమీద బ్రతికే తన విచారణ క్రైస్తవులకు చేదోడు వాదోడుగా నిలిచారు. మంచి సంగీత బృందాన్ని తయారు చేశారు. విచారణ పెద్ద స్వామిగా ఉన్న ఫాదర్ కాన్స్తంతీని గారు సార్త్ సామర్థ్యంగూర్చి పొగడుతూ ప్రవచనం పలికారు. వీరు ఎప్పటికైనా శ్రీసభలో ప్రధాన పాత్ర నిర్వహిస్తారని నుడివారు.

అటుపిమ్మట 1867 జూలైలో తన 32వ ఏట ఫాదర్ సార్తె “సాల్టన్" విచారణ కర్తగా బదిలీ అయ్యా రు. అనతికాలంలోనే వీరు పేదల పెన్నిధిగా పేర్గాంచారు. తన చెల్లెళ్లిరువురిని తన ఇంటిలో తన బాగోగులు చూసుకొన నియమించుకున్నారు. గురువైన తమ అన్న ఫాదర్ సార్తో తన దుస్తులు, ఆహారంలో ఎక్కువభాగం పేదలకు పంచి పెట్టేవాడని ఆ సోదరీలు చెప్పేవారు. ఇక్కడ వీరు పిల్లలు పెద్దలందరికి కతోలిక విశ్వాస సిద్దాంతాల్ని బాగా ఒంటబట్టించాలని సత్యోపదేశాన్ని క్షుణ్ణంగా నేర్పించారు. ఈ విచారణ గురువుగా తొమ్మిది సంవత్సరాలు ఉత్తమ గురువుగా తన బహు ముఖ సేవలందించారు.

వారి సేవలకు గుర్తింపుగా 1875 నవంబరు 28న తైవిసో కేథెడ్రలకు ప్రధాన గురువు గాను మేత్రాసనానికి ఛాన్సలర్గాను మరియు అక్కడి గురు తర్ఫీదు విద్యాలయానికి ఆథ్యాత్మిక సలహాదారుగాను నియమితులయ్యారు. గురువులు కాబోయేవారిని క్రీస్తును పోలిన వార్నిగా తీర్చిదిద్దారు. సెమినరినుండి నగరంలోకి వెళ్లి పిల్లలకు సత్యోపదేశంను నేర్పించేవారు. మతం నిషేధింపబడిన పబ్లిక్ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఆదివార తరగతులు నిర్వహించేవారు. అటు తరువాత 1884 నవంబరు 16న 13వ లియో (సింహరాయులు) పోపుగారిచే 'మంతువా పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డారు. ఇక్కడ క్రైస్తవం పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వం క్రైస్తవ మఠాలను సంస్థలను అనేక ప్రతిబంధకాలతో అణచివేస్తుంది. అధిక పన్నులు వేసి పీడిస్తుంది. సెమినరీలు ఖాళీగా పడి ఉన్నాయి. ఉన్నకొద్ది గురువులు శ్రమ కాపరిత్వపనిలో గురితప్పారు. సెక్యులరిజం పేరుతో మత విభేదాలు పొడసూపాయి

ఇట్టి దుస్థితిని బిషప్ సాల్తో ఒక సవాలుగా స్వీకరించి క్రమశిక్షణా బలం విశ్వాస శక్తితో క్రైస్తవం వృక్షాన్ని విరబూయించారు. గురుమండలాల సందరా సందేశాలు సూచనలు వ్రాసి గురువులను కార్యోన్ముఖులను చేశారు. ముఖ్యం సత్యోపదేశం నేర్పింప చేయుటధాగా పరివర్తనతెచ్చారు. బిషప్ సార్తోకూడ ఈ పనుల్లో అవిశ్రాంతంగా కాళ్లకు బలపం కట్టుకుని పనిచేశారు. తన పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు విశేష కృషిసల్సి బహుముఖ సేవలందించినందుకు గుర్తింపుగా కాబోలు 1893లో 13వ లియో ఊపుగారిచే కార్డినలుగా ఎన్నుకోబడినారు. మరో మూడురోజులకు వెనిస్ నగర పేట్రియార్క్ (ప్రధాన మతాధికారిగా నియమింపబడినారు. దాదాపు పది సంవత్సరాలు తమ నూతన హోదాలో సమర్ధవంతంగా తమ సేవల్ని కొనసాగించారు. ఆత్మల కాపరిగా, గురువర్గం సంస్కర్తగానే కాకుండా, క్రైస్తవ విలువల సంరక్షకుడుగా వెలుగొందారు. వీరు ఎంత ఉన్నత పదవులు నిర్వహించినా శ్రామిక వర్గాల ప్రజల యోగక్షేమాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు.

పదమూడవ లియో పోపుగారి ఫలవంతమైన సుదీర్ఘ పాలన 1903 జూలై 20న ముగిసింది. నూతన పోపుగార్ని ఎన్నుకోవడానికి కార్డినళ్లందరు రోము నగరంలో జరిగే గుప్త సమావేశంకు తరలి వచ్చారు. తన దాతృత్వపనులవల్ల డబ్బుకొరత ఉన్నా కార్డినల్ సార్తీగారును వెనిస్ నుండి రోముకు రానుపోను టిక్కెట్లు కొనివెళ్లారు. అక్కడ వీరి పేరే ప్రముఖమైంది. 1903 ఆగష్టు 9న వీరే పోపుగా ఎన్నికకాగా “ప్రభూ మీ చిత్తమే నెరవేరునుగాక !'' అని దీనతతో పదవ పయస్ (భక్తినాథ) పోపుగారిగా ఈ లోకంలో క్రీస్తు ప్రతినిధిగా కిరీటధారియయ్యా రు. ఇలా ఈ ప్రపంచమే తన ముందు ఒక గురుమండలమయ్యింది. “క్రీస్తులో అన్ని విషయాల్ని నవీకరించాలి” (ఎఫె. 1:10) అనేది ధర్మసూత్రంగా నెంచుకున్నారు నూతన జగద్గురువులు. సెమినరీలను ఆధునీకరించి దైవజ్ఞాన సంపన్నమైన తర్బీదును పకడ్బందీ చేయ నాజ్ఞాపించారు.

“కతోలిక గురువులకు ప్రబోధం” పేరుతో ఒక విశ్వలేఖను ప్రచురించారు. పిల్లలు పెద్దలకై “సత్యోపదేశ ప్రబోధం” పై మరో విశ్వలేఖను వెలువరించారు. కేవలం లాటిను భాషలోనే కాకుండా అందరికీ అర్ధమయ్యే భాషలో అందరికీ అందుబాటులో అర్చనాకాండ పూజాది కార్యక్రమాలుండాలని నిర్ణయించారు. తాను కూడా వాటికనులోని వివిధ దేవాలయాల్లో పూజలర్పింపవెళ్లారు. 1905 నుండి 1910 వరకు దివ్యసత్రసాదం యెడ వీరి నిర్ణయాలు వీరిని దివ్యసత్రసాద పోప్గా ముద్రవేసింది. దైవానుగ్రహంలో ఉన్న వారంతా తరచూ దివ్యసత్రసాదం స్వీకరించాలని, చిన్న వయస్సులో ఉన్న వారికి కూడ తొలి దివ్యసత్పసాద స్వీకరణకు అనుమతించాలని, వృద్దులు వ్యాధిగ్రస్తులకు ఉపవాస క్రియలనుండి మినహాయింపునిస్తూ పోపు తమ నిర్ణయాలు ప్రకటించారు.

సామాజిక వ్యవహారాల్లో కతోలిక శ్రీసభ గురించి తన భావాలు విస్పష్టంగా ప్రకటించారు. అపోస్తులు, పునీత ఫ్రాన్సీస్గ్హావియర్ గార్ల వలె ప్రార్థనతో పాటు సాంఘిక సేవ ద్వారా మానవసమాజాన్ని క్రీస్తువైపు మరల్చబడి రక్షింపబడాలని పదవ పయస్ పోపుగారి నిర్ణయం. గురువుల ప్రార్థనాగ్రంథం, శ్రీసభ సంగీతం యెడ పలు మార్పులు సూచించారు. గ్రెగోరియను సంగీతంతో పాటు పవిత్రత, శ్రావ్యత, విశ్వజనీన ఆధునిక సంగీతం శ్రీసభ వాడుకోవాలన్నారు. పై నిర్ణయాలన్నింటి ననుసరించి శ్రీసభ చట్టాల క్రోడీకరణకు చర్యలు తీసుకున్నారు. “ఆధునికత' పేరుతో క్రైస్తవ విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు దాదాపు 14 ప్రకటనలకు పైగా చేశారు. ఒక విశ్వలేఖనుకూడ విడుదల చేశారు.

పదవ పయస్ (భక్తినాథ) పోపుగారు తన 79వ ఏటకూడ క్రీస్తు సేవలో శ్రీసభ అభ్యుదయంకోసం శ్రమించారు. తమ వృద్ధాప్యంలో ఇన్ఫ్లూయెంజా వ్యాధిసోకి 1914 ఆగష్టు 20న ప్రపంచ యుద్దానికి ముందస్తుగా క్రీస్తు పోలిన పయస్ పోపుగారు పరలోక ప్రాప్తినొందారు. “పేదవానిగా పుట్టాను, జీవించాను, చనిపోయాను” అని వారిగూర్చి చదవబడింది. వారి పవిత్ర సమాధి వద్దకు ప్రజలు విరివిగా తరలివచ్చి ప్రార్థించి అనేక మేలులను స్వస్థతలను పొందారు. తద్వారా 1951 జూన్ 3న పదకొండవ పయస్ (భక్తినాథ) పోపుగారిచే ధన్యజీవిగా ప్రకటింపబడి, 1954 మే 29న పునీతునిగా శ్రీసభ పట్టానొసంగి గౌరవించింది 12వ భక్తినాథ పోపుగారిచే.


This canonized holy Pope of the twentieth century remains beloved by all as the Pope of Frequent Communion. This is indeed a beautiful and fitting title, but we would like to stress here what is less known of his pontifical works — his battle to conserve the faith against those mining it from within.

Joseph Sarto, born in 1836 into a family poor in earthly goods but very rich in virtue, was the first living son of eight children, including six sisters. He soon found himself orphaned of his profoundly Christian father; Joseph had already announced his desire to become a priest, and his parents had approved. When his widowed mother continued to desire like himself this unique ambition of her son, their parish priest found financial aid for him.

He became an assistant priest in 1858, and in 1867 was named in charge of the large parish church of Salzano. His three unmarried sisters followed him, as they would do even to the Vatican. He was immediately appreciated by his parishioners, then seen as heroic when an epidemic of cholera broke out. An ecclesiastic who witnessed his activity wrote that he was everywhere present. He buried the dead and confessed the sick; he saw to the needs of the various houses, he gave remedies if necessary, at all hours of the day and night. He did not permit his vicars to expose themselves to a danger associated with a duty which was first of all that of the parish priest.

He inspired courage in all. His sisters tried in vain to moderate his zeal, but the Padre did not contract the disease, and continued to need only four hours of sleep all the time of his pastoral life. In 1875 he was named a Canon of the cathedral of Trevise, where he fulfilled the administrative and pastoral duties of that charge with a success that edified all concerned.In Trevise Father Sarto learned of his nomination in 1884 as bishop of Mantua. He asked not to be received at Mantua by a brilliant reception, but that his diocesans come to the cathedral to pray with him and receive Communion.

As bishop he taught catechism to the children and continued to visit the sick like a parish priest; and it seemed to them that it was his passage among them which cured them. He manifested a remarkable compassion for the working people. He defended a man who had calumniated him and who soon afterwards was ruined financially, and sent money anonymously to his wife.In 1891 he became Patriarch of Venice, and never was there one more appreciated than Monsignor Sarto after his arrival. Twelve years there confirmed the inhabitants' profound affection and respect for him, until in 1903 his final promotion came about at the death of Leo XIII. He was chosen to replace him in the Vatican in that year, as Vicar of Christ.

He saw with perfect perspicacity that the Church was falling ever more deeply into the disastrous errors of modernism, that crossroads of every heresy. The teachings of his predecessors had entered into deaf ears; everywhere defenders of the Catholic heritage in all domains were becoming sparse. Nonetheless there remained a group of them to second their Head, and strive with him to arrest the rising tide. Saint Pius X absolutely supported all that the great encyclicals of Popes Leo XIII and Pius IX had proclaimed or enjoined upon the authorities of the Church. He brought about the resignation of a considerable number who resisted that authority and who in ambiguous language continued to promulgate the subtle errors propagated by the manifold isms, the false doctrines of the modern world separated from Christ.

He will always be known as the Pope of the Eucharist. For he was determined that the faithful should imitate the example of the earliest Christians. In consequence, he urged the reception of frequent and even daily Holy Communion for all in the state of sanctifying grace and of right intention. He insisted that children be allowed to the Spiritual Banquet prepared by Jesus at an earliest age, and declared that they were bound to fulfill the precept of the Easter Communion as soon as they reach the age of discretion.

Saint Pius labored until the very last days of his life. His Will and Testament contained the words: I was born poor, I have lived poor, and I wish to die poor. He died in 1914 at the age of 78 years, at the onset of the First World War, which he had foreseen. He was canonized by Pope Pius XII forty years later, on May 29, 1954, and recognized universally as a Saint for his charity, his piety, his zeal.

Add new comment

4 + 2 =