SAINT OF THE DAY – AUGUST  16 పునీత రాక్ (ఆరోగ్యనాథుడు)|ST. ROCH

(ఆరోగ్యనాథుడుగా పేర్గాంచిన క్రీస్తుభక్తుడు క్రీ||శ|| 1295 - 1378) పునీత రాక్ గారినే రోక్కొ అనికూడా పిలుస్తారు. వారి సేవలను బట్టి ఆరోగ్యనాథులవారని అంటారు. వీరు ఫ్రాన్స్ దేశంలోని మోంట్ పెల్లియెర్ పట్టణంలో జన్మించినట్లు చెప్పబడింది. ధనవంతులైన స్థానిక గవర్నరుగారింట గారాలపట్టీగా క్రీ|||| 1295లో పుట్టారు. భక్తి సంపన్నుడుగా పెరిగారు. వారికి తమ 20 ఏట తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. దాంతో వారిలో విరక్తి స్వభావం రెట్టింపైంది. పవిత్ర రోమునగరంకు యాత్రకు వెళ్లాలని నిశ్చయించుకుని అక్కడకు వెళ్లారు.

రోజుల్లో ప్లేగు అనబడే అంటువ్యాధి మహమ్మారిలా విస్తరించి ఇటలీలో హాహాకారాలు చేయించింది. గొప్ప జాలిగుండెగల రాక్ గారు వచ్చిన పని పరిత్యజించి ప్లేగు అనబడు కలరా అంటువ్యాధిగ్రస్తులకు సేవచేయడం మొదలు పెట్టారు. కాని వారికి కూడ ప్లేగువ్యాధి తగుల్కొంది. అప్పుడువారు పియా సెంజా పట్టణంలో ఉన్నారు. వారు తమ ప్రార్థనాబలంతో పుంజుకొని ఆరోగ్య వంతులయ్యారు. దేవుడు వారికి స్వస్థతా వరం అనుగ్రహించి ఉండటాన వారు వ్యాధిగ్రస్తుడినైనా తాకి ఏసుక్రీస్తు నాధుని పేరట స్లీవగుర్తువేసి స్వస్థతా వచనం చెప్పినప్పుడు రోగికి పట్టిన ప్లేగువ్యాధి మటుమాయమై పోయింది. విధంగా వారుఆరోగ్యనాథుడు'గా ప్రసిద్ధికెక్కారు. వారు అనేక అద్భుతాలు చేసే వరంకూడ కలిగి ఉన్నందున మరింత పేరువచ్చింది. ప్రభువు మహిమ కొరకే వారు తమ స్వస్థతా వరంను పరిపూర్ణంగా విశుద్ద వినమ్రతతో వినియోగించారు.

చాలా రోజులు ఇలా వ్యాధిగ్రస్తులకు తమ అద్భుత సేవలు అందించి తిరిగి స్వరామం మోంటు పెల్లియరుకు చేరుకున్నారు. అయితే స్థానిక గవర్నరు రాక్గార్ని అనుమానించి ఏదోయాత్ర పేరట ముసుగులో వచ్చిన వేగువాడు అని, తమ దేశ రహస్యాల్ని పొరుగుదేశాల కందింపవచ్చిన చారుడు అని తలంచారు. వారిని చెరసాలలో వేయించాడు. అయిదు సంవత్సరాలు రాక్ గారు కారాగారంలోనే మగ్గిపోయారు. కేవలం ప్రార్థనలు, ఉపవాసాలతో జైలు జీవితంగడిపారు. పెరిగిన గడ్డం, మాసినజుట్టు చిరిగిన వస్త్రాలతో ఒక బికారిలా, దిక్కులేని వానిలా పడి ఉన్నారు. అనంతరం వారు క్రీ|||| 1378లోనే కటకటాల మధ్యనే మరణించారు.

పునీత రొక్కొగారు మరణించిన వెంటనే పంచనామా జరిగింది. వారి రొమ్ము పైభాగాన సిలువగుర్తు పచ్చబొట్టుగా వేయబడిఉంది. ఇతర గుర్తులమూలంగా వారు గతించిన గవర్నరుగారి సుపుత్రుడని ధృవపడింది. ప్రస్తుతం గవర్నరుపనిచేస్తూ రాక్ గార్ని జైలు పాలుచేసింది. స్వయంగా వారి పినతండ్రి లేక మేనమామగారే. అయితే అపార్ధంవల్ల ఒకరినొకరు గుర్తుపట్టకపోవడంవల్ల విచిత్ర వైపరీత్యం సంభవించినట్లు చెప్పబడింది. మరో చరిత్రకారుడైతే రాక్ గారు విదేశీయ రహస్యచారుడని భావించి లొంబార్డి మండలంలోని ఏంజర్స్ జైలులో వేయబడి అక్కడే చనిపోయారని వ్రాశారు. పునీత రాక్ గారి మరణానంతరం వారి సమాధి వద్ద ప్రార్ధించిన వారికి అనేక స్వస్థతలు, అద్భుత మేలులు జరిగాయి. విధంగా వారిని ప్రత్యేక విధంగా గౌరవించడం ఆరంభమైంది. వారి మధ్యవర్తిత్వాన వేడుకున్నప్పుడు ప్లేగు ఇతర అంటువ్యాధులు సమసిపోయినట్లు ప్రత్యేకంగా భక్తులు సాక్ష్యమిచ్చారు. ఇటలీలో వీరిని, రొక్కొ అనియు స్పెయిన్లో రోక్ అనియు అంటారు. రోగగ్రస్తులు, దుర్బలులు, లేవలేనివారలకు వీరు పాలక పునీతులు.

Saint Roch was the son of a governor of Montpellier. His pious parents, already advanced in age, obtained his birth by their persevering prayers, promising to give to God the child He would grant them. This miraculous infant was born with a red cross on his breast, sign of a very particular predestination. From the age of five he began to chastise his little body by privations. As he grew in age and in grace, he was noted for his gracious hospitality for the poor and travelers. He was not yet twenty years old when he experienced the grief of losing both his father and his mother. He immediately sold all his property and made himself poor to follow Christ. He entered the Third Order of Saint Francis and dressed as a pilgrim, traveled on foot to Rome, asking alms.

A pestilence was then devastating Italy; he devoted himself to caring for the sick. Passing alongside their beds, he would take their hand, and with them make the sign of the Cross, and all rose up cured. In Rome, miracles multiplied where he passed. He lived there for three years without making known his name and his origins, even to the Holy Father. Then, returning to his native region, he was suddenly seized by the plague and withdrew into a cabin on the borders of a forest, where a dog brought him a small loaf of bread every day. Cured by the graces of heaven, he entered Montpellier like a stranger; and his uncle, the governor, not recognizing him, cast him into prison as a spy. After five years there he died, stretched out on the ground, after receiving the Last Sacraments. He was recognized by the red cross on his breast, and his funeral was a triumph. His cult became very popular and has remained so for the entire Church. We always see him pictured with his famous little dog.

Add new comment

2 + 2 =