SAINT OF THE DAY – AUGUST  13 ​పునీత జాన్ బెర్కుమన్స్|ST. JOHN BERCHMANS

@pjsri

(గురు విద్యార్థి, మతసాక్షి క్రీ||శ|| 1599 - 1621)మనం తరచూ అనుకుంటూ ఉంటాం. పునీతుడు అయ్యేందుకు గొప్పగొప్ప కార్యాలు చేయాలని. కానీ అలాకాదు. అందుకు మంచి ఉదాహరణే పునీత జాన్ బెర్క్మన్స్ అని చెప్పుకోవచ్చు. వీరు చిన్నిచిన్ని సుకృత కృత్యాలనే దేవునికి ప్రీతి దాయకమైనవిగా నెంచారు. ఎంతో ఒద్దికగా విశుద్ద జీవితం గడిపారు. వీరిలోని పరిపూర్ణ విశ్వాసం, పవిత్రతే మంచి పునీతుడు కావడానికి ప్రధాన ఉపకరణాలయ్యా యి.

బెల్జియందేశంలో ఒక పేద కుటుంబంలో 1599 మార్చి 13న జాన్ బెర్క్మన్స్ జన్మించారు. చెప్పులు కుట్టుపనినే వృత్తిగా చేసుకున్న వీరి తండ్రి తగు సంపాదనతో కుటుంబ పోషణచేస్తూ పిల్లలను క్రమశిక్షణలో క్రీస్తుభక్తిలో పెంచి పెద్దచేశారు. జాన్గారు మాత్రం తమ 9వ ఏటనే ఒక మంచి గురువు కాదలచారు. అందుకు ఒక గురుమండలం వసతి గృహంలోచేరి విద్య గడించారు. ఇక్కడే ఏకాగ్రతతో జపించటం, పూజ్యభావంతో వత్తాసుచేయడం అలవర్చుకున్నారు. వీరు తమ పేదరికంవల్ల కొన్ని అవాంతరాలు చుట్టుముట్టి కొంతకాలం వరకు చదువు ఆ పేసుకున్నారు. ఇది తెలుసుకున్న ఒక గురువు జాన్గార్ని వేరొక గురువువద్ద సహాయకుడుగా ఉండి విద్యకొనసాగించే ఏర్పాటుచేశారు. ఆ గురువువద్ద జాన్ వంటపని, భోజనశాల అమరిక ఏర్పాట్లు చూసుకుంటు తీరిక వేళల్లో బుద్దిగా చదువుకున్నారు.

విద్యారంగం అభివృద్ధిలో యేసుసభ గురువులు ముందుంటారు. వీరు 1615లో బెల్జియం దేశంలోని మెక్లిన్ పట్టణంలో ఒక కళాశాలను ప్రారంభించారు. జాన్ గారు ఈ కళాశాలలోనే తన ఉన్నత విద్యకై ప్రవేశం పొందారు. ఒక సంవత్సరం గడిచాక 1616లో వీరు గురువు విద్యకై మెక్లిన్ పట్టణంలోనే ఉన్న ఏసుసభ నొవిషియేట్లో చేరారు. పునీత అలోషియస్ గొంజాగ వారి జీవిత చరిత్ర జాన్గార్ని ఎంతో ప్రభావితం చేసింది. బ్రహ్మచర్య దైవాంకితం పట్ల అనురక్తి పెంచింది.

"అద్భుతాలు చేయడం, గంటల తరబడి ప్రార్థనలు చేయడంలోనే సంపూర్ణత ఉందని అనుకోవద్దు. అనుదినం మనంచేసే చిన్నచిన్న పనులను సమగ్రంగా చిత్తశుద్ధితో నెరవేర్చడంలోనే సంపూర్ణత్వం ఇమిడి ఉంది.” అని చెప్పే ఏసుసభ గురువుల ఉపదేశం జాన్ ను బాగా ఆకట్టుకొంది. అందువల్లనే జాన్గారు నొవీషియేట్లో పాటించాల్సిన ప్రతి నియమాన్ని తు.చ. తప్పక చేసేవారు. నిర్ణయింవ బడిన ప్రతి చిన్న కార్యాన్ని దేవుని చిత్తమని సంతోషంతో ఆచరించేవారు. ఈ విధంగా వ్యక్తిత్వ వికాస తర్పీదును విజయవంతంగా పొందారు.

క్రీ||శ|| 1616లో బెర్కుమన్స్గారికి మాతృవియోగం సంభంవించింది. అప్పటి విధానం అనుమతులననుసరించి జాన్గారి కన్నతండ్రిగారుకూడ మెక్లిన్ మేత్రాసనం గురు శిక్షణాలయంలో ప్రవేశం పొంది వేదాంత విద్యను పఠించి 1618లో గురుపట్టాభిషిక్తు లయ్యారు. వీరి ప్రథమ దివ్యబలిపూజ సాంగ్యములో జాన్గారుకూడ పాల్గొని ఆనందభరితుడయ్యారు. తానొకటి తలస్తే దైవం ఒకటి తలుస్తాడన్నట్లు జాన్ గారియొక్క తండ్రిగారు కేవలం ఆరు మాసాలు మాత్రమే గురువుగా విధులు నిర్వర్తించి అకస్మాత్తుగా పరమపదించారు.

ఇదిలా ఉండగా 1618లో జాన్ గారు బ్రదరుగా ప్రథమ వ్రతదీక్షను స్వీకరించి మెక్లిన్లోనే తత్వశాస్త్ర విద్యనేర్వ ప్రారంభించారు. అయితే మూడు వారాల తర్వాత ఇదే విద్యను రోము నగరంలో కొనసాగింప జాన్గారు పంపబడ్డారు. ఎవరి జీవిత చరిత్ర చదివి ఏసుసభ గురువుకావాలని జాన్ గారు నిర్ణయించుకున్నారో అట్టి అలోషియస్గారి గదినే రోమన్ కళాశాలలో వీరికి కేటాయింపబడింది. 31 సం||ల క్రితం అలోషియస్గారు ఆ గదిలో తిరుగాడారు జీవించారన్న భావన జాన్గారి హృదయాన్ని సంతోషసంద్రములో వోలలాడించింది.

క్రీ||శ|| 1621 మార్చి 19న జాన్ బెర్కుమన్స్గారు తత్వశాస్త్ర పరీక్షలో అద్వితీయ ప్రజ్ఞ ప్రదర్శించి ప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యారు. జాన్ గారి కుశాగ్రబుద్దిని వాదనా పటిమను మెచ్చిన పెద్దలు సంపూర్ణ తత్వశాస్త్రంలో బహిరంగ చర్చకు సన్నద్ధుడు కావాల్సిందిగా కోరారు. ఇందుకు విధేయించి జాన్గారు మూడు నెలలపాటు రాత్రింబవళ్లు శ్రమించారు. జూలై 8న “తత్వశాస్త్ర విద్య బహిరంగ చర్చావేదికపై పండితులు విసిరిన పలు సంక్లిష్ట ప్రశ్నలకు సుళువు సూత్రంగా సమాధానాలు చెప్పి సెభాష్! అనిపించుకున్నారు. అయితే తీవ్ర ఒత్తిడి, కఠోర పరిశ్రమవల్ల జాన్గార్ని నీరసం అవరించింది. ఇది గమనింపని వారి పెద్దలు ఆగష్టు 8న గ్రీసు కళాశాలలో

జరుగబోయే మరో చర్చావేదికలోకూడ పాల్గొనాల్సిందిగా అభ్యర్థించారు. పెద్దల మాటను జవదాటని జాన్గారు ఆ బహిరంగ చర్చలోకూడ పాల్గొని ప్రశంసలందు కుని తిరిగి వచ్చారు.అయితే నీరసంతో వెళ్లిన జాన్ అస్వస్థతతో తిరిగివచ్చాడు. రోజు రోజుకు జ్వరం ఎక్కువ కావొచ్చింది. చికిత్స సఫలం కాలేదు. పరిస్థితి విషమించడంతో జాన్ గార్కి దివ్యసత్రసాదమివ్వబడి పిమ్మట అవస్థాభ్యంగంకూడ ఇవ్వబడింది. జాన్గారు ఒక సిలువ, జపమాల, సభ నిబంధనల పుస్తకమును అడిగి తన శయ్యమీదకు తెప్పించుకొని “ఈ మూడు వస్తువులు నాకెంతో ఇష్టమైనవి. వీటి సాహచర్యంతో నేను సంతోషంగా చనిపోతాను” అని పలికారు. ఆ రాత్రంత అఖండ ప్రార్థనలో గడిపి 1621 ఆగష్టు 12న తమ 22వ ఏటనే తెల్లవారకముందే కన్నుమూశారు.

యౌవన ప్రాయంలో పవిత్రతను కాపాడుకుంటు విరక్తత్వము, విధేయతను సంపూర్ణంగా పాటించారు జాన్. గురుపట్టా పొందక మునుపే దైవదర్శన పట్టాపుచ్చు కున్నట్లయ్యింది. వీరి సుగుణశీలతకు సంతృప్తిచెందిన శ్రీసభ 13వ లియో (సింహ రాయలు) జగద్గురువుల సాక్షిగా 1888 జనవరి 15న పునీతులని ప్రకటింపబడింది.వత్తాసు పిల్లల, పూజకు సహాయపడే భక్తులందరికీ వీరు పాలక పునీతులుగా శ్రీసభ ఏర్పరచి గౌరవించుకుంది.


Born in 1599 in Diest, a town of northern Belgium near Brussels and Louvain, this angelic young Saint was the oldest of five children. Two of his three brothers became priests, and his father, after the death of John's mother when he was eleven years old, entered religion and became a Canon of Saint Sulpice.

John was a brilliant student from his most tender years, manifesting also a piety which far exceeded the ordinary. Beginning at the age of seven, he studied for three years at the local communal school with an excellent professor. And then his father, wanting to protect the sacerdotal vocation already evident in his son, confided him to a Canon of Diest who lodged students aspiring to the ecclesiastical vocation. After three years in that residence, the family's financial situation had declined owing to the long illness of the mother, and John was told he would have to return and learn a trade. He pleaded to be allowed to continue his studies. And his aunts, who were nuns, found a solution through their chaplain; he proposed to take John into his service and lodge him.

Saint John was ordinarily first in his classes at the large school, a sort of minor seminary, even when he had to double his efforts in order to rejoin his fellow students, all of excellent talent, who sometimes had preceded him for a year or more in an assigned discipline. He often questioned his Superiors as to what was the most perfect thing to say or do in the various circumstances in which he found himself. Such was the humility which caused the young to advance without ceasing on the road to heaven. Later he continued his studies at Malines, also not distant from Diest, under the tutelage of another ecclesiastic, who assigned to him the supervision of three young boys of a noble family. In all that John did he sought perfection, and he never encountered anything but the highest favor for his services, wherever he was placed.

He found his vocation through his acquaintance with the Jesuits of that city, and manifested his determination to pursue his course, although his father and family opposed it for a time. It had been decided that he would continue his studies at the Jesuit novitiate of Malines, with about 70 other novices. With another young aspirant, he was waiting in the parlor to be introduced, when he saw in the garden a coadjutor Brother turning over the ground in the garden. He proposed to his companion to go and help him, saying: Could we begin our religious life better than with an act of humility and charity? And with no hesitation, both went to offer their assistance. How many young persons in that situation would have thought of such an offer? This incident reveals the profound charity and interior peace which characterized this young religious at all times.

As a novice he taught catechism to the children in the regions around Malines. He made his instructions so lively and interesting that the country folk preferred his lessons to the ordinary sermons. The children became attached to him, and in a troop would conduct him back to the novitiate, where he distributed holy pictures, medals and rosaries to them. At the end of his novitiate in 1619 he was destined to go to Rome to begin serious application to philosophy, but his superiors decided to send him home for a few days first. A shock awaited him at the train station of Malines, where he was expecting to meet his father; he had died a week earlier. John was given time to take the dispositions necessary to provide for the younger brothers and sister. When he departed, it was apparently with a premonition that he would perhaps never see them again, for he said in a letter to the Canon of Diest with whom he had dwelt, to tell the younger ones for him: Increase in piety, in fear of God and in knowledge. 

With a fellow novice he began the two months' journey on foot to Rome, by way of Paris, Lyons and Loreto, where the two assisted at the Christmas Midnight Mass. Both of these two young Jesuits would die within three years' time, his companion in a matter of several months. John had time during these three years to give unceasing proofs of his already perfected sanctity; nothing that he did was left to chance, but entrusted to the intercession of his Heavenly Mother, to whom his devotion continued to increase day by day. He made an extraordinary effort during an intense heat wave in the summer of 1621, participating splendidly in a debate, which took place at a certain distance from the Jesuit residence, despite the fact he did not feel well. Two days later he was felled by a fever, which continued implacably to mine his already slight resistance, and he died in August of that year, after one week of illness. The story of his last days is touching indeed; in a residence of several hundred priests and students, there was none who did not follow with anxiety and compassion the progress of his illness. When the infirmarian told his patient that he should probably receive Communion the next morning — an exception to the rule prescribing it for Sundays only, in those times — John said, In Viaticum? and received a sad affirmative answer. He himself was transported with joy and embraced the Brother; the latter broke into tears. A priest who knew John well went to him the next morning and asked him if there was anything troubling or saddening him, and John replied, Absolutely nothing.

He asked that his mattress be placed on the floor, and knelt to receive his Lord; when the Father Rector pronounced the words of the Ritual: Receive, Brother, in viaticum, the Body of Our Lord Jesus Christ, all in attendance wept. Their angelic, ever joyous and affectionate young novice was called to leave them; no clearer tribute than their tears could have been offered to the reality of his sanctity, his participation in the effusive goodness of the divine nature. Devotion to his memory spread rapidly in Belgium; already in 1624 twelve engraving establishments of Anvers had published his portrait. He was canonized in 1888 by Pope Leo XIII, at the same time as two other Jesuits who lived during the first century of that Society's existence, so fruitful in sanctity — Peter Claver and Alphonsus Rodriguez.

 

Add new comment

2 + 3 =