SAINT OF THE DAY – April 6 పునీత 1వ సెలస్టీను|POPE ST. CELESTINE 

(43వ పోపు క్రీ||శ|| 432) పునీత 1వ బోనిఫాస్గారి అనంతరం పునీత సెలస్టీన్గారు క్రీ||శ|| 422 సెప్టెంబరు 10వ తేదీన 43వ జగద్గురువుగా రోమునగర పీఠాన్ని అధిష్టించారు. వీరు రోమాపౌరుడు ఇటలీలోని కాంపానియాలో పుట్టారు. వీరి తండ్రి ప్రిస్కస్. వీరు పోపుగా ఎన్నిక కాకముందు రోమునగర శ్రీసభలో (ఆర్చి) ప్రధాన డీకనుగా సేవలందించారు. గతించిన జగద్గురువుల మాదిరిగానే వీరు కూడా పలువురు ప్రత్యర్థులు, తప్పుడు బోధనలు చేసేవారిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

వీరు పునీత అగస్టీనువారికి స్నేహితులు కావడం విశేషం. దేవుని అపార కృపావరాల పై పునీత అగస్టీనుగారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఈ పోపుగారు గట్టిగా సమర్థించారు. క్రీ||శ|| 429లో పోప్ సెలస్తీనుగారు ఆగ్సేరైనగర బిషప్ పునీత జెర్మానుస్ గార్ని పెలజియ' అనే తప్పుడు సిద్ధాంతి శ్రీసభకు వ్యతిరేకంగా లేవనెత్తుతున్న అనేక సిద్దాంత భాష్యాలకు విరుగుడుగా సమాధానాలివ్వడానికి బ్రిటస్కు పంపారు. ఈ జగద్గురువే పునీత పల్లాడియస్, పునీత కర్తానంద (పాట్రిక్) మేత్రాణుల్ని క్రీIIశI 423లో సువార్తా ప్రచారం నిమిత్తం ఐర్లాండు దేశానికి పంపారు.

ఏసుక్రీస్తు మనుష్యావతారం పై కాన్స్టాంట్ నోపుల్ బిషప్ అయిన నెస్టోరియస్ చేసిన తప్పుడు బోధనల్ని క్రీ||శ|| 430లో ఏర్పాటు చేసిన రోమునగర మత పెద్దల మహాసభలో సెలస్తీనుగారు తీవ్రంగా ఖండించారు. ఇదే విషయం పై అలెగ్జాండ్రియా బిషప్ పునీత సిరిల్ గారు పోపుగారికి పిర్యాదుచేయగా క్రీ||శ|| 431లో జరిగిన ఎఫెసు మహాసభలకు తమ ప్రతినిధుల్ని ముగ్గుర్ని ఈ పోపుగారు పంపారు. వారిద్వారా చెప్పించి గురువులందరి సహకారంతో బిషప్ నెస్టోరియస్ ను పదవీ భ్రష్టుల్ని మత భ్రష్టుల్ని గావించి ధైర్యాన్ని ప్రదర్శించారు. పొరబడని తమ అధికారాన్ని ఋజువు పర్చారు.

1వ సెలస్టీన్ పోపుగారు మేరీమాత “దేవుని తల్లి' అని నొక్కి చెపుతూ ఫ్రాన్సు పీఠాధిపతులకు తమ లేఖ ద్వారా వివరించారు. రోమునగరంలో అవెంటెన్ వీధిలో పునీత సబీనా బసిలికా గుడిని నిర్మించిన ఘనత ఈ పోపుగారిదే. వీరు క్రీ||శ|| 432 జూలై 27న పరమపదించారు. వీరి పవిత్ర భౌతిక శరీరాన్ని ప్రిసిల్లా స్మశాన వాటికలోని సిల్వెస్టర్ బసిలికా గుడిలో ఖననం చేశారు. సెలస్టీను అంటే మోక్షం అని అర్థం.


(† 432) Saint Celestine was a native of Rome, a relative of the emperor Valentinian, and at the death of Pope Saint Boniface in September 422, he was chosen to succeed him, by the consent of the entire city.His first official act was to confirm the condemnation of an African bishop who had been convicted of grave crimes. He wrote also to the bishops of the provinces of Vienne and Narbonne in Gaul to correct several abuses which had followed upon errors in doctrine.

He stipulated, among other things, that absolution or reconciliation should never be refused to any dying sinner who sincerely asked it; for repentance depends not so much on time as on the heart, which can be changed in a moment when God so wills.Saint Celestine assembled a synod at Rome in 430, by which the writings of Nestorius were examined, and the heresiarch's obstinate errors in maintaining in Christ two persons, a divine and a human, were condemned. 

The Pope pronounced sentence of excommunication against Nestorius, and deposed him. Being informed that in Great Britain, the seeds of the Pelagian heresy, denying the necessity of grace, were spreading, Saint Celestine sent there Saint Germanus of Auxerre, whose zeal and ministry happily prevented the threatening danger.

He also sent Saint Palladius, a Roman, to preach the Faith to the Scots, both in North Britain and in Ireland. Many authors of the life of Saint Patrick say that he, too, received his commission to preach to the Irish from Saint Celestine, in 431. This holy Pope died on the 1st of August, in 432, having reigned almost ten years.

Add new comment

5 + 13 =