Rani manjeti | covid staff

Rani manjeti | covid staff

కరోనా వైరస్ బారిన పడిన ప్రజలకు సేవ చేయడంలో గొప్ప ధైర్యం మరియు త్యాగం  చూపించే నర్సులు మరియు వైద్యులు ముందు వరుసలో ఉన్నారు . ఈ రోజు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న కరోనా  వైరస్- ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా వారి చేస్తుంటువంటి సేవ నిజంగా కొనియాడబడినది .
రాణి మంజేటి... ప్రభుసన్నిదిలో పాటలు పడే ఒక గాయని గా , సెవెన్ హిల్స్  నర్సింగ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే ఒక ఉన్నతమైన ట్రైనర్ గా రాణి మంజేటి మన కందరికి తెలిసిందే.
ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) గా పని చేస్తున్నారు .ప్రభుత్వ ఆదేశాలనుసారం కోవిడ్ పని నిమిత్తము  గత మూడు నెలలుగా శ్రీకాకుళం లో తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు . మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా  ఉన్న రాణి కి మరియు తన టీం మెంబెర్స్ కి  14, రోజుల క్కుఆరెంటైన్  తర్వాత  మూడు రోజులు విశ్రాంత్రి దొరికింది .కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వైజాగ్ వచ్చిన రాణి ని రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు సిబ్బంది కలవడం జరిగింది .మూడు నెలలు గా తాను చేస్తున్నటువంటి పని ని గురించి వివరిస్తూ, ప్రతి రోజు తాను మరియు తన టీం మెంబెర్స్ షిఫ్ట్ ల వారీగా తమ తమ పనులను నిర్వహించేవారని తెలిపారు . తన పని లో దేవుడు సహాయం చెయ్యాలని  ప్రార్దించుదాము .

Add new comment

1 + 1 =