John the baptist | పునీత బప్తిస్మ యోహాను జయంతి | Rev Fr. Harry Phillips

పునీత బప్తిస్మ యోహాను జయంతి

(జ్ఞానస్నానాలిచ్చిన ప్రవక్త, క్రీస్తుకు ముందుగా పంపబడిన దూత హతసాక్షి క్రీIIశII - 29) పునీత బప్తిస్మ యోహానుగారు జెరుసలేము పవిత్రనగర దాపులోని అయిన్ కరీం అనే ఊల్లో జూన్ 24న పుట్టారు. తండ్రి పూజారియైన జకరియ. తల్లి ఎలిజబెత్, ఈమె కన్య మరియాంబకు దగ్గరి బంధువురాలు. యూదయాసీమలో క్రీIIశII 29 వరకు యెడారుల్లో ఒక ఋషిగా జీవించినట్లు చరిత్ర చెబుతోంది. యొర్దాను నదీతీరంలో ఆయన సంచరిస్తూ రాబోవు క్రీస్తు దేవునిగూర్చి ప్రవచిస్తూ “పశ్చాత్తాపులుకండి. దైవరాజ్యం సమీపింపబోతోంది” అని పలికారు. ఎందరో ప్రజలు ఆయన మాట విన తరలివచ్చేవారు. క్రీస్తుకు కాబోయే శిష్యులుకూడ వారి మాటలు విన్నవారే.

ఏసుప్రభువుకు జ్ఞానస్నానమిచ్చింది బప్తిస్మ యోహానుగారే. ఆ సందర్భంలోనే “ఇదిగో ! దేవుని గొర్రెపిల్ల. లోకపాపాల్ని తొలగించేవారు.” అని ప్రకటించారు. యోర్దాను నది ఒడ్డు పొడవునా సంచరించి ప్రబోధించారు.  

Add new comment

1 + 1 =