శ్రీసభ చరిత్రలోకి మరో 20 మంది హతసాక్షులు

 
 
శ్రీసభ చరిత్రలోకి మరో 20 మంది హతసాక్షులు

1936-39 మధ్యకాలంలో జరిగిన స్పానిష్ అంతర్యుద్ధములో ద్వేషంతో చంపబడిన 20 మంది అమరవీరులను నవంబర్ 18 శనివారం నాడు సెవిల్లెలో మహా పూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు  గుర్తు చేసుకున్నారు. ఘోరంగా హింసించబడి, క్రీస్తు కొరకు తమ అమూల్యమైన ప్రాణాలను సైతం అర్పించిన  20 మంది హతసాక్షులు "ధన్యులుగా" ప్రకటించబడ్డారు.
స్పెయిన్ లోని సెవిల్లే కేథడ్రల్‌లో జగద్గురువుని పరిపాలన యంత్రాంగంలోని ఒకటైన "పునీత పట్ట ఇవ్వటానికి నియమింపబడిన" విభాగానికి అధ్యక్షులుగా సేవలందిస్తున్న కార్డినల్ మార్సెల్లో సెమెరారో గారి అధ్యక్షతన ఈ ధన్యత పట్టా ప్రధానోత్సవం జరిగింది.
ఈ 20 మంది హతసాక్షులలో పదిమంది గురువులు, ఒక గురు విద్యార్థి, 9 మంది గృహస్థవిశ్వాసులు వున్నారు.  ఆదివారం నాడు  త్రికాల జపానంతరం,జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ అందించిన సువిశేష సందేశంలో ఆయన ఈ 20 మంది హతసాక్షుల ధన్య మరణాన్ని స్మరించుకుంటూ, వారి విశ్వాస జీవితాన్ని ప్రజలకు తెలియజేసారు.ప్రస్తుత కాలంలో శ్రమలను, హింసలను అనుభవిస్తున్న క్రైస్తవులందరు  వారి విశ్వాస జీవితాన్ని  ఆదర్శం గా తీసుకొని  కడవరకు క్రీస్తుకు సాక్షమిచ్చు వారిగా నిలబడాలని  పొప్ ఫ్రాన్సిస్ గారు కోరారు.

 

Add new comment

5 + 7 =