శివాజీ రాజే భోంస్లే

శివాజీ రాజే భోంస్లే 
ఛత్రపతి శివాజీ భారతదేశం యొక్క అత్యంత ప్రగతిశీల, ధైర్యసాహసవంతులు, మరియు తెలివైన పాలకులలో ఒకరు. మరాఠా రాజ్య స్థాపకులైన శివాజీగారు 1630 ఫిబ్రవరి 19న ప్రతిష్టాత్మకమైన శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు పోరాట యోధుడిగా జన్మించాడు. ఇప్పటి వరకు, మహారాష్ట్రీయులు ఈ రోజును శివజయంతిగా అత్యంత గౌరవంగా మరియు సాంప్రదాయ శైలితో జరుపుకుంటారు.

గొప్ప మరాఠా పాలకుడి పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ .......

ఆయన లౌకిక పాలకుడు, అన్ని మతాలకు చాలా అనుకూలంగా ఉండేవాడు. ఆయన  సైన్యంలో చాలా మంది మొహమ్మదీయులు ఉండడమే దానికి సాక్ష్యం . మొఘల్ పాలనను పడగొట్టి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడమే ఆయన ఏకైక లక్ష్యంగా ఉండేది. స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా శివాజీ తన పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించారు . ఆయన  తన ధైర్యసాహసాలు మరియు వ్యూహాలకు ప్రసిద్ధి చెంది దానితో  మొఘల్‌  పాలకులకు వ్యతిరేకంగా అనేక యుద్ధాలను జయించారు.

భారత నౌకాదళం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి వ్యక్తి శివాజీగారు ,అందుకే ఆయనను  భారత నావికాదళ పితామహుడిగా పిలుస్తారు, ఆయన  మహారాష్ట్రలోని కొంకణ్ ను  రక్షించడానికి సముద్రతీరంలో వ్యూహాత్మకంగా నౌకాదళాన్ని మరియు కోటలను స్థాపించాడు. జైగఢ్, విజయదుర్గ్, సింధుదుర్గ్ మరియు ఇతర కోటలు ఇప్పటికీ ఆయన ప్రయత్నాలకు మరియు ఆలోచనలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

శివాజీ మహిళలకు మరియు వారి గౌరవానికి నమ్మకమైన సహాయదారులు. మహిళలపై జరిగే అన్ని రకాల హింసలను, వేధింపులను, అగౌరవాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆయన పాలనలో స్వాధీనం చేసుకున్న భూభాగాలను  మహిళలకు  కూడా క్షేమంగా మరియు సమగ్రతతో పంచేవారు.

ఛత్రపతి శివాజీని 'మౌంటెన్ ర్యాట్' అని పిలుస్తారు. శివాజీ గారు  భూమి యొక్క భౌగోళిక శాస్త్రం మరియు శత్రువులపై దాడి చేయడం, మెరుపుదాడి చేయడం మరియు ఆకస్మిక దాడులు వంటి వ్యూహాలపై ఆయనకు ఉన్న అవగాహన కారణంగా శివాజీగారిని అలా పిలుచుకుంటారు. మంచి సైన్యం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని, నైపుణ్యంతో తన తండ్రి యొక్క 2000 సైనికుల సైన్యాన్ని 10,000 మంది సైనికులుగా  విస్తరించారు శివాజీగారు.

 అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అందరికి శివాజి జయంతి శుభాకాంక్షలు.

Add new comment

14 + 0 =