వేళాంగణి మాత వద్దకు పాదయాత్ర- వరంగల్ కథోలిక విశ్వాసులు

ఆగస్టు 15, 2022 న స్వతంత్ర దినోత్సవం, జెండా వందనం తరువాత వరంగల్ పీఠాధిపతుల  మహా పూజ్య ఉడుమల బాల తండ్రి గారిని మరియు విచారణ గురువులను కలిసి ఆశీర్వాదం తీసుకొని చెన్నైలోని వేళాంగణి మాత యొద్దకు యాత్ర పార్రంభించారు వరంగల్ కథోలిక విశ్వాసులు.

వరంగల్ మేత్రాసనం నుండి ఈ ముగ్గురు వేళాంగణి మాత వద్దకు చెన్నై నుండి పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్రకు వేళ్ళు వారు కాషాయపు వస్త్రములను వేసుకోవడం ఆనవాయితి.

17 ఆగస్టు ఉదయం చెన్నై చేరుకొని, 18 వ తేదీ ఉదయం చెన్నైలోని ప్రశాంత్ నగర్, వేళాంగణి మాత దేవాలయములో దివ్యబలిపూజ అనంతరం అక్కడ నుండి పాదయాత్ర మొదలు పెడతారు. 

వీరు ప్రతిరోజు సుమారు 35, 40, 50 కిలోమీటర్ల నడుచుకుంటూ వెళుతారు. మొత్తం 450 కిలోమీటర్లు పది రోజుల్లో పూర్తి చేసుకొని వేళాంగణి మాత నవదిన ప్రార్థనలకు పండుగ జెండా ఆవిష్కరణకు ఒకరోజు ముందే చేరుకుంటారు.
 
ప్రతి ఏటా ఈ పాదయాత్రలో వేలది మంది పాల్గొంటారు. ఈ ముగ్గురితో చెన్నైలో కొంతమంది కలుస్తారట. చెప్పులు లేకుండా నడుస్తారట. ఇది ఒక పుణ్య కార్యమని, వీరు వేళాంగణిమాతను దర్శించుకొని, అమ్మ దీవెనలు పొందాలని, అమ్మ వాళ్ళని దీవించాలని అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు

Add new comment

1 + 1 =