లూర్దుమాత పండుగ శుభాకాంక్షలు

లూర్దుమాత పండుగ శుభాకాంక్షలు

 ప్రతి ఏటా ఫిబ్రవరి 11వ తేదీన విశ్వవ్యాప్తంగా మన తల్లి శ్రీసభ లూర్ధుమాత మహోత్సవాన్ని అత్యంత భక్తిపూర్వకముగా కొనియాడుతూ ఉంటుంది.   శ్రీసభ చరిత్రలో మరియతల్లి దర్శనాలు ఎన్నో నమోదయ్యాయి. ఈ దర్శనాలన్నింటిలో కూడా మరియ తల్లి యావత్‌ ప్రపంచాన్ని పశ్చాత్తాపం పొంది క్రీస్తు బాటలో నడవమని అజ్ఞాపించడం ప్రథమంగా నిలిచింది.

ఆమె దర్శనం ఇచ్చిన ప్రతి ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది. అశేష భక్తుల రాకతో విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. మరియతల్లి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న ఎందరో స్వస్థతలు, మేలులు పొంది క్రీస్తు బాటలో నడుస్తున్నారు.

క్రీస్తు శకం 1858వ సంవత్సరంలో మరియతల్లి ‘‘ బెర్నదెత్త సౌబిరన్‌’’ అనే 14 ఏళ్ల బాలికకు ఫిబ్రవరి 11, 1858 నుండి  జూలై 16 వరకు మరియతల్లి మొత్తంగా 18 సార్లు దర్శనమిచ్చారు. మరియతల్లి ఆ దర్శనాలలో, ‘‘హృదయ పరివర్తన కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని, పశ్చాత్తాపం పొంది అందరు క్రీస్తు బాటలో నడవాలని కోరారు.’’ దానితో పాటుగా ఇక్కడ  ఒక దేవాలయాన్ని నిర్మించాలని  ఆమె కోరారు. ఆ బాలిక అమాయకంగా మీరు ఎవరు అని అడిగినప్పుడు, ‘నేను జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ఞిని’ అని మరియతల్లి పేర్కొన్నారు. మరియ తల్లి ఆదేశించినట్లు అక్కడ ఒక దేవాలయం నిర్మించబడినది. నిత్యం అశేష భక్తులతో విశేషముగా ఆ యొక్క పుణ్యక్షేత్రం అలరారుతున్నది. ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్న ఎందరో ఎన్నో దీవెనలను, స్వస్థతలు పొందుతున్నారని మన తల్లి శ్రీసభ తెలియజేయుచూ ఉన్నది.

 
మరియమాత భక్తులందరికీ అమృతవాణి  రేడియో వెరితాస్  ఆసియ తెలుగు విభాగాం వారి  తరుపున శుభాకాంక్షలు. 
 

Add new comment

12 + 6 =