మీ అందరికీ మేము వున్నాము - SkyLimits

 యువతలో స్ఫూర్తి నింపుతూ, అవసరం లో ఉన్నవారికొరకు నేనున్నాను అంటూ నిలబడ్డారు మన పోలమరశెట్టి    సురేష్ గారు. విశాఖపట్నం లో  స్కైలిమిట్స్ (skylimits) అనే  ఫర్నిచర్ స్టోర్ ని స్థాపించి, వివిధ బ్రాంచిలను ఏర్పాటు చేసి  ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నారు. విశాఖపట్నం డయోసీస్ లో ఎప్పటికపుడు తన కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో కలసి  సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
 
కరోనా మహమ్మారి వల్ల  చాలామంది బంధువులను, స్నేహితులను పోగొట్టుకున్నాము. కరోనా వచ్చిందంటే  సొంతబంధువులే ఇంటికి రాలేని ఈ పరిస్థితులలో  మేము వున్నాము అంటూ కరోనా తో బాధపడుతున్న ప్రతి ఇంటికి వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు మన స్కైలిమిట్స్(skylimits) వారు.

కరోనా తో బాధపడుతూ ఉన్నవారు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు విశాఖపట్నం లో  వారు ఎక్కడ ఉన్న సరే ఉదయం, మధ్యానం  మరియు రాత్రి వారికీ సరిపడా ఆహారాన్ని ఉచితం గా  అందిస్తున్నారు. గత రెండు నెలలు గా ప్రతి రోజు ఇదే విధంగా అవసరం లో వున్నవారికి సహాయ పడుతున్నారు.  
లొక్డౌన్ కారణం గా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు, పేదవారికి కూడా ప్రతి రోజు ఉచిత భోజనం అందిస్తున్నారు.  అలాగే నీటి  సమస్య ఉన్న ఏరియా లో వాటర్ ట్యాంక్ లను తెపించి ప్రజలకు సహాయ పడుతున్నారు.గత ఏడాది కూడా కరోనా  సమయం లో ఇదే విధంగా వలస కూలీలకు, పేదవారికి మరియు అవసరం లో ఉన్న వారికీ సహాయం చేయడం జరిగింది.
కుటుంబసభ్యులు మరియు మిత్రుల సహాయ సహకారాల వల్లే ఇదంతా చేయగల్గుతున్నాము అని చెపుతున్నారు సురేష్ గారు. విశాఖపట్నం సిటీ లో ఎవరికైనా ఫుడ్(food) అవసరం అనుకుంటే ఈ నెంబర్ కు  8125634099 కాల్ చేయాలనీ సూచించారు.
దేవుని ప్రేమ ను తెలియజేసే ఇటువంటి కార్యక్రమాలు సురేష్ గారు మరెన్నో చేయాలని, అలాగే పోలమరశెట్టి  సురేష్ గారిని  మరియు వారికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని  ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుకుంటూ  మీ అమృతవాణి - రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు.                  

Add new comment

1 + 18 =