మరియ మాత జయంతి ఉత్సవం

మరియ మాత జయంతి ఉత్సవం

  క్రీస్తుద్వారా లోక రక్షణ ప్రణాళికలో 'మేరీమాత జననం' ఒక ముఖ్యఘట్టంగా దేవుడు ఎర్పరచినట్లు వేదాలు ఘోషిస్తున్నాయి.  అన్నమ్మ జ్వాకీములకు పవిత్రాత్మ వరం వలన జన్మించింది మరియ తల్లి. ఆ పుణ్య దంపతుల ప్రేమ, అనురాగాలతో పెరుగుతూ మంచి మార్గం, క్రమశిక్షణను, వినయం విధేయత అను సుగుణాలను అవరచుకున్నది.  చిన్నతనం నుండే దేవునికి ప్రియమైన బిడ్డగా  మంచి ప్రార్ధనా జీవితం జీవించింది. 

యోసేపు అనే వడ్ర౦గితో ఆమె పెళ్లి నిశ్చయమై౦ది, ఆయన పెద్ద ఆస్తిపరుడేమీ కాదుగానీ విశ్వాస౦ గలవాడు. కాబట్టి, పెళ్లయ్యాక యోసేపు భార్యగా ఆయనకు చేదోడువాదోడుగా ఉ౦టూ, ఇద్దరూ కలిసి ఒక చిన్న కుటు౦బాన్ని ఏర్పర్చుకు౦టారని ఆమె అనుకొనివు౦టు౦ది. అయితే అనుకోకు౦డా ఒక రోజు, దేవుడు ఆమెకు అప్పగి౦చనున్న ఒక బాధ్యత గురి౦చి చెప్పడానికి ఆ కొత్త వ్యక్తి వచ్చాడు. అది ఆమె జీవితాన్నే మార్చేసి౦ది.  

 మరియ దగ్గరకు వచ్చిన వ్యక్తి మానవమాత్రుడు కాదు, దేవదూత.  ఎప్పుడైతే గబ్రియేలు దూత వచ్చి తండ్రి దేవుని సందేశాన్ని మరియ తల్లికి తెలియ జేసిందో, ‘‘నేను ప్రభువు దాసిరాను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక’’ (లూకా 1:38) అని తండ్రి మాటను విధేయించింది. వినయవిధేయతలతో ఆమె స్ప౦ది౦చిన తీరు విశ్వాసుల౦దరికీ ఒక ఆదర్శం.

  

Add new comment

4 + 6 =