మరియమాత మాతృత్వ మహోత్సవము

Mother Maryమరియమాత మాతృత్వ మహోత్సవము

మరియమాత మాతృత్వ మహోత్సవము

క్రీస్తు ప్రభువు జనన పండుగ తర్వాత మనం క్రొత్త సంవత్సరాన్ని మరియతల్లి మాతృత్వాన్ని ధ్యానిస్తూ ప్రారంభిస్తాము. కన్య మరియను దేవుడు తన కుమారునికి తల్లిగా ఉండుటకు ఎన్నుకున్నారు అంటే ఆమె ఎంత మహోన్నతురాలో మనకు అర్ధమౌతుంది. అందువలన మరియతల్లి ప్రేమతో, వాత్సల్యముతో మరియు సహాయముతో మనం క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. 

గడచిన కాలంలో మనం ఎన్నో విజయాలు, అపజయాలు, సంతోషాలు, విచారాలు ముగించాం. నూతన సంవత్సరం అనగానే ఎన్నో తీర్మానాలు, నిర్ణయాలు, ఆశయాలు, ఆత్రుత మరెన్నో ఆలోచనలు మనసులో మొదలవుతాయి. 

ఆ సమయంలో మరియతల్లి మనసులో కూడా ఇటువంటి ఆత్రుత ఉంది.  దేవునికి తల్లి కాబోతున్నావని గాబ్రియేలు దూత చెప్పగానే ఎంతో ఆందోళనకు గురి అయ్యింది. అయితే మరియతల్లి దేవుని సహాయంతో వీటన్నిటిని విశ్వాసంతో, భక్తితో మననం చేసి మనందరికి మార్గదర్శిగా నిలిచారు. మరియను దేవుని తల్లి అని ప్రకటించిన నూతన సంవత్సరాన్ని మరియతల్లి మార్గ నిర్దేశకత్వంలో నడుస్తూ, ఆమె వాలే దైవవాక్యాన్ని ధ్యానం చేయాలి. గొల్లలవలె ప్రబోధకులు కావాలి. క్రీస్తు ప్రభువు సహవాసాన్ని, మరియతల్లి వాత్సల్యాన్ని అందరికి ప్రకటన చేస్తూ, ఒకరికొకరం ఈ నూతన సంవత్సరంలో దీవెనకరంగా మారుదాం.

Add new comment

3 + 8 =