మరియమాత జయంతి | 8th SEPTEMBER

mother mary

మరియమాత గురించి పునీత అల్ఫోన్సస్ దె లిగోరిగారు ఈ విధంగా పేర్కొన్నారు. పరలోక వాక్కుకు తల్లిగానుండ ఆమె ఎన్నుకోబడింది. అందుకే ఆమె నిష్కళంకోద్బవిగా అనితర సాధ్యమైన గొప్పవరాలతో అభి షేకింప బడి జన్మించింది. పవిత్రతలో పునీతులను దేవదూతలను మించినది. దేవుని తల్లిగా ఉండే అర్హతకై ఉన్నత దైవ వరానుగ్రహాలతో నింపబడింది. ఆమె అత్యంత అధిక పరమ పునీతగానే పుట్టింది. తన సృష్టిలోనే అంతకుముందెన్నడు కలిగించనంత సుందరంగా ఆమె ఆత్మను తీర్చిదిద్దారు. ఆమె ఇహపరలోకాల దృష్టిలో మనోహరమై అందమైన ఆత్మకలిగి సంతోషపూరిత పాపగా ఆవిష్కరింపబడింది. అట్టి పరమ పావని దేవునికి అత్యంత ప్రియమైనదై, పూర్ణవరాలతో నింపబడింది. మనకు మధురమైన అట్టి పసిపాపతో కూడి మనందరం పరవశించిపోదాం”. ఆమె “జన్మపాప రహితోద్భవి' అదే ఆమెజన్మకు మన జన్మకు తేడా. ఆమె రెండవ ఏట. పవిత్ర గొర్రెపిల్లను ప్రసవింపబోవు మహా మంచి తల్లి గొర్రె. దైవ రక్షణ ప్రణాళిక తొలిమెట్టు. సాతాను ప్రారబ్దానికి ఆఖరి మెట్టు.

ఏ ప్రదేశంలో మరియ జన్మించింది ఇతమిద్దంగ తెలీదు. కాని ఆ యమ్మ జెరుసలేము పవిత్ర నగరంలో జన్మించి ఉండవచ్చని గట్టి నమ్మకం. తొలుతగా ఆరవ శతాబ్దంలో మేరీమాత జయంతిని సిరియా లేక పాలస్తీనాలో కొనియాడబడినట్లు తెలుస్తుంది. మరో నూరేళ్ల అనంతరం రోమునగరంలో ఆమె జన్మదినోత్సవం జరుపబడటం ఆనవాయితీ అయ్యింది. ఏసు జననం, బప్తిస్మయోహాను జననం, మరియమాత జననం ఉత్సవాల్ని శ్రీసభచే ఆరంభ సంవత్సరాలనుండే కొనియాడబడుతున్నట్లు తెలుస్తోంది. 4వ శతాబ్దంలోనే జెరుసలేములో పునీత అన్నమ్మగారి దేవళంలో మరియ జయంతిని తొలిసారిగా కొనియాడారు. ఆ స్ఫూర్తితోనే రోము నగరంలో శ్రీసభ ఆ యమ్మ జనన వార్షికోత్సవాల్ని ఆచరించడం ఆరంభింపబడింది. క్రీస్తుద్వారా లోక రక్షణ ప్రణాళికలో 'మేరీమాత జననం' ఒక ముఖ్యఘట్టంగా దేవుడు ఎర్పరచినట్లు వేదాలు ఘోషిస్తున్నాయి. పూర్వ వేద అంత్యానికి నూతన వేద ఆరంభానికి మధ్యస్థ వేదాంత రేఖ ఆ జగజ్జనని జన్మదినం.

పిత దైవానికి ప్రియ కుమార్తె ఈ లోకంలో పునీత జాకీము అన్నమ్మల సంతానంగా ఆవిర్భవించి దేవుని ఏర్పాటు చొప్పున మానవ రక్షణ ప్రణాళికలో పరిశుద్ధ భాగస్వామి అయ్యింది.రెండవ ఏవ అయిన ఆమెను గూర్చి ఆది. 3:15 మరియు యెష. 7:14 లో దేవుని వాక్కుగా ప్రజావళికి తెలుపబడింది.


The birth of the Blessed Virgin Mary announced joy and the approaching salvation of a lost world. Mary was brought into the world not like other children of Adam, infected with the contagion of sin, but pure, holy, beautiful, and glorious, adorned with all the most precious graces fitting for the One predestined to be the Mother of the Saviour. Never did She have the slightest inclination towards anything other than the absolute and immediate Will of God. She appeared indeed in the weak condition of all mortals, but in the eyes of Heaven She already transcended the highest seraphim in purity, humility, charity, and the richest ornaments of grace. God had created Her in the original grace, as in the beginning Adam and Eve had enjoyed that ineffable privilege; after original sin, it was lost for all Adam's posterity, until the time of the Redemption dawned in Mary. 

The nations celebrate, often too noisily, the birthdays of the great ones of this earth... How then ought we, Christians, to rejoice in that of the Virgin Mary, Mother of our Salvation, and to present publicly to God the homage of our best praises and thanksgiving for the great mercies He has shown in Her, imploring Her mediation with Her Divine Son! Jesus of Nazareth will not reject the supplications of His most holy Mother, through whom He chose to descend from Heaven; She, the Spouse of the Canticle, is all beautiful and is the One He was pleased to obey while on earth. Her love, care, and tenderness for Him, the title and qualities which She bears, the charity and graces with which She is adorned, and the crown of glory with which She is honored, incline Him readily to receive Her recommendations and petitions.

Add new comment

4 + 0 =