మరియతల్లి మోక్షారోపణ  మహోత్సవము | August 15

మరియతల్లి మోక్షారోపణ  మహోత్సవము 

ప్రతి ఏటా ఆగస్టు 15న మన తల్లి శ్రీసభ మరియమాత  మోక్షానికి చేరుకున్నారని విశ్వసిస్తూ మరియమాత "మోక్షారోపణ" మహోత్సవాన్ని(Happy feast of Assumption of Blessed Virgin Mary )  కొనియాడుతూ ఉంటుంది. పరిశుద్ధ మరియమాత ఈ  భూలోక జీవితాన్ని విశ్వాసంతో ముగించుకుని  పరలోకానికి చేరుకున్నారు అని ప్రకటిస్తుంది. 

మరియతల్లి తన  జీవితమంతయు కూడా  దేవుని చిత్తానికి తలొగ్గి జీవించారు.  ఎ్లప్పుడూ దేవున్ని స్తుతిస్తూ జీవించారు. ఈలోక ఆశల వలయములో చిక్కుకొనక దేవునితో మాత్రమే సఖ్యత కలిగి ఉన్నది. జన్మ పాపమే లేనట్టి పవిత్రురాలు. ఈనాడు మనము పాపమును వీడి పుణ్య మార్గములోనికి రావాలి. అందుకు మరియతల్లిని, ఆమె జీవితాన్ని ఆదర్శముగా తీసుకుందాము. 
అందరికి దేవమాత మోక్షారోహణ మహోత్సవ శుభాకాంక్షలు.

Add new comment

6 + 5 =