మన పునీతులు

మన పునీతులు

పునీత బొనవెంచర్

పునీత బొనవెంచర్ గారు ఫ్రాన్సిస్కన్ సభకు చెందిన ఒక కార్డినల్. ఆయన క్రీస్తు శకం 1221 వ సంవత్సరంలో ఇటలీ దేశంలో జన్మించారు. ఆ కాలంలో పునీత ఫ్రాన్సిస్ వారు ఇటలీ దేశంలోనే తన సేవను చేస్తుండేవారు.  పునీత బొనవెంచర్ గారు నాలుగు సంవత్సరాల ప్రాయంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా, పునీత ఫ్రాన్సిస్ గారు వచ్చి బొనవెంచర్ గారు పై తన హస్తములను ఉంచి ప్రార్ధించారట. 

చిన్న ప్రాయములోనే దైవ సేవకు ఆకర్షితుడైన పునీత బొనవెంచూర్ గారు గురు శిక్షణ కోసమై 
 ఫ్రాన్సిస్కన్ సభలో చేరారు.

పునీత బొనవెంచర్ గారు చిరు ప్రాయం నుండే విద్య పట్ల ఎంతో మక్కువతో ఉండేవారు. పారిస్ నగరంలోని ఫ్రాన్సిస్కన్ సభ వారి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు.   అనంతరం ఆయన గురువుగా అభిషిక్తులు అయి 27 సంవత్సరాల ప్రాయంలోనే ఒక  తాను చదుకున్న విశ్వ విద్యాలయంలోనే అధ్యాపకునిగా నియామకం అయ్యారు.  ఫ్రాన్సిస్కన్ సభలో ఎన్నో అత్యున్నత బాధ్యతలను ఆయన నిర్వహించారు.  ఫ్రాన్సిస్కన్ సభ పరిణామ దశలో పునీత బొనవెంచర్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు.

పునీత బొనవెంచర్  గారు ఎంత ఉన్నత పదవిని అధిరోహించినా చాల సాధారణ జీవితాన్ని జీవించేవారు. అందరితో కలిసి మెలిసి ఉండేవారు. ఆయన నిరాడంబర జీవితమే ఆయనను ఎంతో మందికి ఇష్టమైన వ్యక్తిగా చేసింది.

15 జులై 1274 లో పునీత బొనవెంచర్ గారి మరణం అప్పటి కథోలిక సమాజాన్ని నివ్వెర పరచింది.

ఆయనను 14 ఏప్రిల్ 1482 న పునీతునిగా ప్రకటించడం జరిగింది.  

Article by 

Arvind Bandi

Online Producer

Add new comment

1 + 1 =