మన పునీతులు

మన పునీతులు

నేడు మనం పునీత జోసఫ్ కఫ్ఫాసో గారి గురించి ధ్యానించుకుందాం. జోసఫ్ కఫ్ఫాసో గారు వెన్నెముకలో వైకల్యంతో పుట్టారు. ఆయన ఇటలీ దేశం లో 19 వ శతాబ్ద కాలంలో నివసించారు. ఆ కాలంలో అంగవైకల్యం ఉన్నవారిని ఎంతో చిన్నచూపు చూసేవారు. కానీ జోసఫ్ కఫ్ఫాసో గారి జీవితం పట్ల దేవుని ప్రణాళిక మరో విధంగా ఉంది. ఆయనకు ఎంతో శక్తివంతమైన వాక్చాతుర్యాన్ని దేవుడు ప్రసాదించారు.

ఆయన దేవుని గూర్చి ఉపదేశించిన ప్రతిసారి ఎందరినో ప్రభావితం చేసేవారు. గురువుగా అభిషిక్తులు అయిన తర్వాత ఆయనను ఇటలీలోని ఒక సెమినరీ లో ప్రత్యేకంగా జెన్సెన్ సిద్ధాంతాలకు వ్యతేరేకంగా పని చెయ్యడానికి నియమించారు. సెమినరీలో అనుసరిస్తున్న పద్దతులలో మార్పు రావాలని ఆయన సూచించారు. ప్రాపంచిక ఆశలనుండి దూరంగా ఉండాలని సెమినరీ లో శిక్షణలో ఉన్న యువకులకు ఆయన నేర్పించేవారు. సెమినరీ లోనే కాక బయట సమాజంలో కూడా ఆయన తన బోధల ద్వారా సుప్రసిద్దులైయ్యారు.

ఆయనకు శక్తి పవిత్ర దివ్య సత్ప్రసాదం నుండి లభిస్తుందని ఆయన నిత్యం చెప్తూఉండేవారు. ఆయన చెరసాలలో బందీలకు దైవ మార్గ సూచకునిగా చాల సుప్రసిద్ధులు.1860 లో మరణించిన ఆయన  1947 లో  పునీతునిగా ప్రకటింపబడ్డారు. చెరసాలకు, అందలి బందీలకు పోషక పునీతునిగా ఆయన నియమింపబడ్డారు.

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

1 + 3 =