మదర్ థెరీసా జయంతి | ఆగష్టు 26

ఎందరో అభాగ్యులను తన అక్కున చేర్చుకుని గొప్ప మనసున్న తల్లిగా వారిని ఆదరించి, తన జీవితాన్ని వారి సేవ కోసం పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా. 1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ.

కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. కోల్‌కతా వీధుల్లో జోలెపట్టి చాలామంది కడుపు నింపారు.
కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటురోగాలు సోకినవారికి, బాధితులు, శరణార్థులు, అంధులు, దివ్యాంగులు, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు.ఆమె సేవలకు గాను 1979లో  అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక, భారత అత్యున్నత పౌర పురస్కారం 1980లో భారతరత్న ఆమెను వరించింది.మదర్ థెరీసాకు సెయింట్‌హుడ్ హోదా కూడా దక్కింది.

 

Source: Samayam
 

Add new comment

11 + 0 =