Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
భారతీయ కథోలిక కన్యస్త్రీ ని పూజ్యురాలిగా ప్రకటించారు
భారతీయ కథోలిక కన్యస్త్రీ ని పూజ్యురాలిగా ప్రకటించారు
మేరీ ఇమ్మాక్యులేట్ స౦ఘానికి చె౦దిన ఉర్సులైన్స్ సభ్యురాలైన సిస్టర్ మరియా సెలీనా కన్ననైకల్ గారిని పోప్ ఫ్రాన్సిస్ గారు "పూజనీయమైనది" అని ప్రకటించారు.
కన్ననైకల్ గారు 1931 ఫిబ్రవరి 13న కేరళలోని త్రిచూర్ మేత్రాసనంలో జన్మించారు. రె౦డు ప్రాథమిక పాఠశాలల్లో బోధి౦చిన తర్వాత, ఆమె 1954 జూన్ 24న మఠకన్యల సభలో చేరి, ఆ తర్వాత 1954, డిసె౦బరు 26న నోవియేట్లోకి ప్రవేశి౦చి౦ది. 1957 జూన్ 20న ఆమె తన మొదటి మాటపట్టును స్వీకరించారు.
సిస్టర్ గారి మాటపట్టు తర్వాత వె౦టనే ఆమె అస్వస్థతకు గురయ్యారు, కానీ ఆమె అనారోగ్య౦ నిర్ధారణ కాలేదు, దక్షిణ భారతదేశంలోని ఒక పట్టణమైన కన్నానోర్ (ఇప్పుడు కన్నూర్)లో కేవల౦ 35 రోజుల ప్రభుని సేవ తర్వాత 1957లో ఆమె మరణి౦చి౦ది.
యేసు ఆమెకు ప్రత్యక్షమై, దేవుడు త్వరలోనే ఆమెను తనతో పరలోకానికి తీసుకువెళతాడనే విషయం ఆమె తన మొదటి మాట పట్టు రోజునే గుర్తించింది. 1957 జూలై 26న ఆమెను కన్ననూర్ సమాధి చేశారు.
Add new comment