ఫ్రాన్సిస్ పాపు గారికి హార్దిక 85 వ జన్మదిన శుభాకాంక్షలు

ఫ్రాన్సిస్ పాపు గారుపోప్ ఫ్రాన్సిస్

ఫ్రాన్సిస్ పాపు గారికి హార్దిక 85 వ జన్మదిన శుభాకాంక్షలు

ఫ్రాన్సిస్ పాపు గారు 17 డిసెంబర్ 1936 లో దక్షిణ అమెరికా లో ఆర్జెంటినా దేశంలోని బ్యూనస్ ఎరిస్ నగరంలో జన్మించారు. దేవుని సేవకు ఆకర్షితులైన ఆయన 1958 లో జేసుసభలో చేరి 1969 లో గురువుగా అభిషిక్తులయ్యారు. 1973 నుండి 1979 వరకు  ఆర్జెంటినా లోని జేసు సభకు ప్రొవిన్సియల్ సుపీరియర్ గా బాధ్యతలు నిర్వహించిన అనంతరం 1998 లో ఆర్జెంటినాకు అగ్రపీఠాధిపతిగా నియమితులైయ్యారు. 2001 లో రెండవ జాన్ పాల్ పాపుగారిచే కార్డినల్ గా నియమితులైయ్యారు. 13 మార్చ్ 2013 న జగద్గురులైయ్యారు. 

జేసుసభ నుండి మరియు అమెరికా నుండి జగద్గురువులుగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా ఫ్రాన్సిస్ పాపు గారు చరిత్ర సృష్టించారు. 

అంతర్జాలంలో అత్యధిక ప్రాచుర్యం గల జగద్గురువుగా ఫ్రాన్సిస్ పాపు గారు నేటికీ సుప్రసిద్ధులు. ఆయన యువతలో కూడా అత్యంత ప్రసిద్ధులు. ఫ్రాన్సిస్ పాపు గారు ఆధునిక సమాచార మాధ్యమాల ద్వారా కథోలిక సమాజంలో  అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.

కథోలిక సమాజాన్ని ఆధ్యాత్మికంగా మరిన్ని వసంతాలు నడిపించాలని కోరుకుంటూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం నుండి ఫ్రాన్సిస్ పాపు గారికి హార్దిక 85 వ జన్మదిన శుభాకాంక్షలు.

Add new comment

6 + 14 =