పునీత బప్తిస్మ యోహాను శిరచ్ఛేదము | August 29

★★★పునీత బప్తిస్మ యోహాను శిరచ్ఛేదము★★★ (జ్ఞానస్నానాలిచ్చిన ప్రవక్త | క్రీస్తుకు ముందుగా పంపబడిన దూత | హతసాక్షి క్రీIIశII - 29)

దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు.అతని పేరు యోహాను. ప్రజలందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.
యేసుక్రీస్తు నిజమైన వెలుగు. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది.లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు.
యోహాను ఆయనను గురించి పెద్ద స్వరంతో ఇలా సాక్ష్యం చెప్పాడు, “నా వెనుక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు, అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన.”

పునీత బప్తిస్మ యోహోనుగారు జెరుసలేము పవిత్రనగర దాపులోని అయిన్  కరీం అనే ఊళ్లో జూన్‌ 24న పుట్టారు. తండ్రి పూజారియైన జకరయా.తల్లి  ఎలిజబెత్‌. ఈమె కన్య మరియాంబకు దగ్గరి బంధువురాలు. యూదయసీమలో కీ॥శ!! 29 వరకు యెడారుల్లో ఒక బుషిగా జీవించినట్లు చరిత్ర చెబుతోంది.యొర్దాను నదీతీరంలో ఆయన సంచరిస్తూ రాబోవు క్రీస్తు దేవునిగూర్చి ప్రవచిస్తూ “పశ్చాత్తాప్తులుకండి. దైవరాజ్యం సమీపింపబోతోంది'' అని పలికారు. ఎందరో ప్రజలు ఆయన మాట విన తరలివచ్చేవారు. క్రీస్తుకు కాబోయే శిష్యులుకూడ వారి మాటలు విన్నవారే.

ఏసుప్రభువుకు జ్ఞానస్నానమిచ్చింది బప్తిస్మ యోహానుగారే, ఆ సందర్భంలోని “ఇదిగో ! దేవుని గొర్రెపిల్ల. లోకపాపాల్ని తొలగించేవారు.” అని ప్రకటించారు. యొర్దాను నది ఒడ్డు పాడవునా సంచరించి ప్రబోధించారు.

పునీత మార్కు సువార్తాలో బప్తిస్మ యోహానుగారి మరణంగూర్చి స్పష్టంగా పేర్కొనబడింది. ఆనాటి పాలకుడైన హెరోదురాజు అందగత్తెయైన తన తమ్ముని భార్యయైన హెరోదియాను అక్రమంగా పెండ్లాడటాన్ని ఆక్షేపించారు .యోహాను సరిదిద్దుకొమ్మని హెచ్చరించారు. అదే జరిగితే తన రాణి హోదాకు భంగం కలుగుతుందని హేరోదియా కుట్రపన్నింది.హేరోదు రాజు జన్మదినం సందర్భంగా తన కుమార్తె సలోమీచేత అద్భుతంగా నాట్యమాడ పురమాయించింది.అదే జరిగి రాజు ఒక కోరిక కోరుకోమనగా హెరోదియా మాట చొప్పున ఆ బాలిక యోహానును శిరచ్చేదంగావించి తల తెచ్చి,ఇమ్మని కోరింది.తన పంతం నెరవేర్చుకుంది.బప్తిస్మ యోహానుగారు క్రీ!!శ!! 29 ఆగస్టు 29న మరణించారు.

యోహాను శిరచ్చేదం సంఘటన్ని ఒక ఉత్సవంగా శ్రీసభ కొనియాడుతోంది.ఆయన మరణం ఏసుప్రభుని మరణానికి పోలి ఉండటమే అందుకు కారణం.ఏసుకు వలే యోహానుగారుకూడ మవునంగా నిస్సహాయంగా మరణాన్ని స్వాగతించారు.చిన్న నెపంతో పగ, ద్వేషం, మానవ పిరికితనం, కూరత్వంకు బలిపశువయ్యారు.

Add new comment

1 + 1 =