పునీత పేతురుగారి సింహాసనోత్సవం

పునీత పేతురుగారి సింహాసనోత్సవం

 

పునీత పేతురుగారి సింహాసనోత్సవం

అపోస్తులందరిలో పునీత పేతురుగారికి క్రీస్తు ప్రభువు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు.  పేతురు గారి విశ్వాసాన్నిబట్టి, ఆయనలోని నాయకత్వపు లక్షణాలను బట్టి, దేవుడు తాను నిర్మించిన శ్రీసభకు పేతురును నాయకుడిని చేశారు.  "నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను" (మత్తయి 16:18; యోహాను 21:16-17). ప్రభువు పేతురుకు ఇచ్చిన అధికారాన్ని ప్రత్యేక విధముగా స్మరించుకుంటూ తల్లి శ్రీసభ ప్రతి యేట ఫిబ్రవరి 22న పునీత రాయప్ప (పేతురు)గారి సింహాసనోత్సవముగా కొనియాడుతూ ఉన్నది.

పునీత పేతురుగారి సింహాసనోత్సవ పండుగ అంటే  పునీత పేతురు గారి కుర్చీ పండుగ అని అర్ధం.  మేత్రాసనం లలో  ఉండే  కేథడ్రల్  నందు మేత్రాణులు కూర్చోవటానికి ఒక ప్రత్యేకమైన సింహాసనము (కుర్చీ) ఏర్పాటు చేయబడి ఉంటుంది.ఈ  కుర్చీ వారియొక్క అధికారానికి గుర్తు.  
పీఠాధిపతులు తమయొక్క అధికారక సందేశాలను ఈ కుర్చీలోనుండి వినిపిస్తారు.

రోమునగరంలో పునీత పేతురుగారి దేవాలయంలో లోపలి భాగంలో మనం గమనిస్తే ఒక  చెక్కతో చేయబడిన సింహాసనం ఏర్పాటు చేయబడి ఉంటుంది.  ఇది సాక్షాత్తు పేతురుగారు ఉపయోగించిన సింహాసనం అని చెబుతారు. ఈ సింహాసనం యొక్క పైభాగంలో ఒక పెద్ద కిటికీ అమర్చబడి ఉంటుంది. ఆ కిటికీకి అద్దం మీద కొన్ని ప్రతిబింబాలు మనకు కనిపిస్తాయి. ఆ ప్రతిబింబం మీద ఒక పెద్ద పావుర రూపాన్ని మనం చూడవచ్చు. ఈ పావురం పవిత్రాత్మకు చిహ్నంగా ఉంటుంది‌. అలాగే ఈ పావురం చుట్టూ, 12 వెలుగు రేఖలుకూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీకూడా అపోస్తులుల చిహ్నంగా అవి గుర్తించబడుతున్నాయి.  

ఈ రోజు మనం జరుపుకునే వేడుకకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ 16 బెనెడిక్ట్ పాపుగారు,క్రీస్తు ప్రతినిధిగా శ్రీసభ పాలనా బాధ్యతల్ని అందుకున్న మొదటి జగద్గురువు అపోస్తలుడైన పునీత పేతురు సింహాసనోత్సవాన్ని శ్రీసభ ప్రారంభంనుండి జరుపుతున్నట్లు చరిత్ర వెల్లడిస్తుంది,ఏది చాలా పురాతన సాంప్రదాయం ,ఏది నాల్గవ శతాబ్దం నుండి రోమా నగరంలో ఉన్నట్లు నిరూపించబడింది.అపోస్తులైన పేతురుగారి వారసులు ఆయన అప్పగించిన పరిచర్య కోసం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
'కేథడ్రా'అంటే పీఠాధిపతి ఆసనం.దీనిని మేత్రాసన ప్రధాన దేవాలయం లో  ఉంచారు,దీని కారణంగా ప్రధాన దేవాలయాన్ని 'కాథెడ్రల్' అని అంటారు. ఇది పీఠాధిపతి అధికార చిహ్నం ముఖ్యంగా,ఆయన్ని "మేజిస్టీరియమ్'అనగా ఆపోస్టుల వారసునిగా, సువార్త బోధనా ,ప్రజలను రక్షించడానికి మరియు క్రైస్తవ సమాజానికి బోధించడానికి ప్రత్యేక అధికారం."నీవు పేతురువు ,ఈ రాతి నా సంఘమును నిర్మించెదవు.నరకశక్తులు దీనిని జయింపజాలవు.నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవిని ఇచ్చెదను .భూలోకమందు నీవు దేనిని బంధింతువో,అది పరలోకమందును బంధింపబడును .భూలోకమందు నీవు దేనిని స్వేచ్ఛగా ఉంచెదవో,అది పరలోకమందును స్వేచ్ఛగా ఉంచబడెను.

పునీత పేతురుగారి పరిచర్య తరువాత ,రోమా నగర పీఠాధిపతిగా గుర్తింపబడి,దాని పీఠాధిపతిగా "కేథడ్రా" నుండి తన మొత్తం మందను పోషించడానికి క్రీస్తు ఆయనకు అప్పగించిన పరిచర్యను సూచిస్తుంది.పునీత పేతురుగారి బోధనపీఠ ఉత్సవాన్ని జరుపుకోవడంవల్ల బలమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఆపాదించడం మరియు దేవుని ప్రేమకు విశేషమైన సంకేతంగా గుర్తించడం ,శాశ్వతమైన మంచి గొర్రెల కాపరి ,తన శ్రీ సభ మొత్తాన్ని సేకరించి,మోక్ష మార్గం లో నడిపించాలని కోరుతున్నారు.

Add new comment

2 + 17 =