Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
పునీత పీటర్ డామియన్ | Saint of the day
పీటర్ డామియన్ గారు 1007లో ఇటలీలోని రావెన్నాలో ఏడుగురు పిల్లలలో చివరిగా జన్మించారు. ఆయన తల్లి చనిపోయినప్పుడు,డామియన్ గారు మొదట తన సోదరీమణులలో ఒకరిచే పెంచబడ్డారు తరువాత ఒక సోదరుడు ఆయనతో హీనంగా ప్రవర్తించేవారు . కొన్ని సంవత్సరాల తర్వాత,రవెన్నాలోని ప్రధాన గురువు అయిన డామియానస్ అనే మరో సోదరుడు. ఆయనపై జాలిపడి, తనతో పాటుగురు విద్యాభ్యాసం చేయడానికి తీసుకెళ్లాడు కృతజ్ఞతకు చిహ్నంగా, పీటర్ గారు తన సోదరుడి పేరు డామియన్ను తన పేరుకు జోడించుకున్నారు.
పీటర్ గారి యవ్వనంలో రెండు భాగాలు ఆయనకు జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. మొదటిది ఆయనకు ఒక నాణెం దొరికినప్పుడు ఆయన ఒక బొమ్మను కొంటానని అనుకున్నారు. అకస్మాత్తుగా, కొనుగోలు చేసిన ఏదైనా తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన గ్రహించి , అప్పుడాయన డబ్బును ఒక గురువు వద్దకు తీసుకువెళ్లి మరణించిన తన తల్లిదండ్రుల కోసం ఒక దివ్యపూజను సమర్పించారు. రెండవ సంఘటనలో ఆయన ఒక పేద అంధుడితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు పీటర్ డామియన్ గారు తనకు మంచి నాణ్యమైన తెల్ల రొట్టెని ఎంచుకొని తన అతిథికి ముదురు రొట్టెని అందించారు . తరువాత ఆయన తన స్వార్థం గురించి పశ్చాత్తాపపడి, తన రొట్టెని గుడ్డివాడితో మార్చారు. ఈ సంఘటనలద్వారా తనను తాను దేవునికి మాత్రమే సమర్పించుకోవాలని మరియు దేవునియందు జీవితాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.
1035 కమల్డోలీస్ లో పీటర్ డామియన్ గారి కీర్తి వ్యాప్తి చెందింది ఆయన ఇతర మఠాలలో కూడా బోధించడానికి ఆహ్వానించబడ్డారు. ఆశ్రమాన్ని పునర్వ్యవస్థీకరించడంలో మరియు ప్రభావితం చేయడంలోకొత్త ఇళ్లను నిర్మించడం ద్వారా, ఆయన రవెన్నా పీఠాధిపతులవారి దృష్టిని ఆకర్షించారు.
1057లో, IX స్టీఫెన్ పాపుగారు , పీటర్ డామియన్గారిని మతాధికారులను సంస్కరించడానికి సహాయం చేయడానికి రోమ్కు పిలిపించారు.తర్వాత పాపు గారు డామియన్గారిని ఓస్టియాకు కార్డినల్ మరియు పీఠాధిపతులుగా చేసారు. ఆయన VII గ్రెగొరీ పాపు గారితో కలిసి పనిచేసారు, ఆయన పీఠాధిపతులు మరియు మఠాధిపతులను నియమించుకున్నారు.ఆయన 27 సెప్టెంబర్ న XII లియో పాపు గారి చేత దేవాలయం లో వైద్యులుగా ప్రకటించబడ్డారు.
కొన్ని సంవత్సరాల తరువాత పీటర్ డామియన్ గారు1072లో ఫిబ్రవరి 21 న ఫెంజాలోని బెనెడిక్టైన్ మఠాన్ని సందర్శించినప్పుడు స్వర్గస్తులయ్యారు. ఆ సమయంలోనే ఆయన ప్రజలచేత పునీతులుగా ప్రశంసించబడ్డారు. ఆ రోజునే ఈ నాటికి మనం పండుగలా జరుపుకుంటున్నాము.
Add new comment