పరిశుద్ధ జపమాల మాత పండుగ - అక్టోబరు 7

చరిత్ర :

"జపమాలను శాంతిని సమకూర్చే ప్రార్ధనగా చెప్పమని నాకన్నా ముందు పాపుగార్లు బోధించి వున్నారు. కుటుంబములలో, లోకములో శాంతి కోసము జపమాల జపించండి.” అక్టోబరు 16, 2002 వ తేదీ బుధవారము - రెండవ జాన్ పాల్  పాపుగారు, “రొజారియుమ్ వర్జిన్ మారి విశ్వలేఖ.

పునీత దోమినికు గారి సమయములో అక్టోబరు 7, 1571 తేదీన లెప్పాంతోలో అల్బి జెన్సీయులైన ఇస్లాము వారిపై, యుద్ధములో విజయమును సాధించటానికి పునీత 5వ భక్తినాధ పాపుగారిచే క్రైస్తవులకు ఒసగబడిన బలమైన ఆయుధము “జపమాల ప్రార్థన”గా చరిత్రలో చెప్పబడింది.

చరిత్రలో అపుడు జపమాలను శ్రీసభ ప్రార్ధనా క్రమములో చేర్చటము జరిగింది. ఆ విజయమును పురస్కరించుకొని “విజయోత్సవ మాత" అను పండుగను స్థాపించగా దానిని 13వ గ్రెగోరి పాపుగారు “పరిశుద్ధ జపమాల మాత పండుగ” గా మార్చటం జరిగినది.
11వ క్లెమెంటు పాపుగారు అగస్టు 5, 1716 నాడు టర్కీవారి పై పీటరు వార్డెను వద్ద (ప్రస్తుతము దానిని సెర్బియాగా పిలుస్తున్నారు) సావాయి రాజు యూజిన్ సాధించిన ఘన విజయమునకు గుర్తుగా ఒక పండుగను, కృతజ్ఞతా పూర్వకముగా ఏర్పాటు చేశారు.

10వ సింహరాయలు పాపుగారు ఈ విజయము మత వ్యతిరేక శక్తులపై సాధించిన విజయముగా అభివర్ణించారు. 3వ జూలియసు పాపుగారు దానిని మహిమగా అభివర్ణించారు.

13వ సింహరాయలు పాపుగారు “జపమాల" మీద పన్నెండు విశ్వలేఖలను వ్రాసి “విశ్వాసమునకు వ్యతిరేకముగా యుద్ధము చేసేవారి యొక్క మహా ఆయుధము జపమాల అని బోధించారు. మరియు తల్లికి ఇష్టమైన ప్రార్ధన, శ్రీసభకు అత్యంత ప్రీతి పాత్రమైన, దీవెనలు ఒనగూర్చు ప్రార్ధన” అని వారు బోధించారు.

జపమాల ప్రార్ధన ద్వారా దేవుని రహస్య కార్యములను స్మరించి, ద్వానించి ఆత్మీయ మేలులను పొందమని రెండవ జాన్ పాల్ పాపుగారు తన విశ్వలేఖలో వివరించారు. విశ్వాసము నిలుపుకో. శాంతి కొరకు, కుటుంబముల కొరకు ప్రార్థించండి, అని వారు బోధించారు.

అక్టోబరు మాసము 2002వ సంవత్సరములో రెండవ జాన్ పాల్ పాపుగారిగా తన 25 సంవత్సరముల రజిత జాబిలీ సందర్భముగా “రొజారియుమ్ వర్జిన్
 మారి” “పరమ పావన మరియ జపమాల” (The Rosary of the Virgin Mary) అనే విశ్వలేఖ ద్వారా వెలుగు దేవ రహస్యములను జపమాలకు జత చేయటం జరిగింది. అప్పటి వరకు జపమాలలో యేసు ప్రభుని జీవిత ఘట్టములపై జపమాల ప్రార్ధనలో ధ్యానించేవారము కాదు. 

జపమాలలో సంతోష, దు:ఖ, మహిమ దేవరహస్యముల ద్వారా - యేసు పుట్టుక సమయం, యేసు మరణ సమయము, యేసు పునరుత్థానం ఆ తరువాత సంఘటనలను మాత్రమే ధ్యానము చేసే వారము. 

వెలుగు దేవరహస్యముల ద్వారా యేసు ప్రభుని పరిచర్య జీవితములో జరిగిన గొప్ప సంఘటనలను ధ్యానము చేసుకొనే భాగ్యము శ్రీసభచే కలిపించబడినది చాలా గొప్ప కార్యము సంభవించినది కదా!

రెండవ జాన్ పాల్ పాపుగారు తన విశ్వస లేఖలో జపమాలపై విశదీకరిస్తూ “స్వాభావికముగా ఈ ప్రార్థన మరియమాత జపమాల ప్రార్ధన అయినప్పటికీ - ఈ ప్రార్థనలకు యేసుక్రీస్తు జీవితము మూల ఆధారముగా మనము గ్రహించాలి” అని బోధిస్తారు. 

నిజమే మరియ మాత జపమాల ప్రార్థనలో యేసుని జీవిత ఘట్టములను గురించి లోతుగా ధ్యానము చేస్తూ ఆ పరమ రహస్యమును క్షుణ్ణముగా మన ఆత్మీయ జ్ఞానముతో అర్థము చేసుకోవటానికి ప్రయత్నిస్తూంటాము.

క్రీస్తు ప్రభువే జపమాలకు మూలాధారముగా బోధిస్తూ పరిశుద్ధ పాపు గారు ఆ
జపమాలను మనకు దివ్య ఔషదముగా ప్రసాదిస్తూ దానిలో యేసుని బహిరంగ జీవితములోని జ్ఞానస్నానము మొదలుకొని ఆయన శ్రమల వరకు వున్న ముఖ్య ఘట్టములను ఆ ప్రార్థనకు జోడించారు.
విశ్వలేఖలో పరిశుద్ధ పాపుగారు అందరూ తప్పని సరిగా జపమాలను ప్రతిరోజూ ధ్యానపూర్వకముగా ప్రార్ధించాలని బోధించారు. చాలామంది, చాలా కుటుంబములు జపమాలను చెప్పకుండా వుండటము తనకు బాధకలిగించినదనీ, భక్తిగల కథోలిక విశ్వాసులందరూ జపమాల ప్రార్థింప ప్రోత్సహించారు.

 

Add new comment

1 + 7 =