"నేనున్నాను " అంటున్న ఫా.రాజేష్.

బెంగళూరు అగ్రపీఠానికి చెందిన గురుశ్రీ రాజేష్ గారు ఒక నూతన వరవడిని సృష్టించారు. అదేమంటె COVID బారిన పది చనిపోయిన వారి మృతదేహాలకు గౌరవ ప్రదమైన అంతిమ సంస్కారం చేయడం.అయన ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకుని తానే అంబులెన్సు డ్రైవర్ గా పని చేస్తూ ఆసుపత్రులకు వెళ్లి చనిపోయినవారి మృతదేహాలను తీసుకొని వెళ్లి గురువుగా ఆశీర్వదించి ఎప్పటికి 600 కు పైగా భూస్థాపిత కార్యక్రమాలు చేపట్టారు.దానితోపాటు బాధిత కుటుంబాలకు ఓదార్పును, చనిపోయిన వారి జీవితాలకు మంచి ముగింపును కల్పిస్తున్నారు.
ఫాదర్ గారు చస్తున్నది గోప్ప
సాహసమే. వారు చేస్తున్న గోప్ప సాహస కార్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందిస్తోంది అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం. ఫాదర్ గారిని, వారి బృంద సభ్యులను దేవుడు దీవించి వారి కార్యాలు నిరాటంకంగా కొనసాగేలా ప్రార్థిస్తుంది రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.

 

Add new comment

17 + 3 =