నాకు ఇది కావాలని ఎప్పుడూ దేవుని అడగలేదు నేను,నాకు ఎం కావాలో అది ఆయనే ఇస్తారు-జోస్ఫిని

covid testing lab

పునీతులు (saints) మన పక్కనే ఉన్నారు. అవి చరిత్ర యొక్క వార్షికోత్సవాలలో లేదా చర్చిల గాజు కిటికీల మీద మాత్రమే కాదు, వారు మీ ఇళ్లలో, పక్కింటి, మీ పరిసరాల్లో ఉన్నారు.పోప్ ఫ్రాన్సిస్ గారు  మొదటిసారిగా వాటికన్, ఏప్రిల్ 9, 2018 న విడుదలైన తన ఎన్సైక్లికల్ "గౌడెట్ ఎట్ ఎక్సల్టేట్" (సంతోషించండి మరియు సంతోషంగా ఉండండి) లో ఈ వ్యక్తీకరణను ఉపయోగించారు.ఈ రోజు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న కరోనా వైరస్- ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా వారు ముందంజలో ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారిని మా “సెయింట్స్ నెక్స్ట్ డోర్”(Saints next door) అని పిలిచారు.
కరోనా వైరస్ బారిన పడిన ప్రజలకు సేవ చేయడంలో గొప్ప ధైర్యం మరియు త్యాగం  చూపించే వారిలో నర్సులు మరియు వైద్యులు ముందు వరుసలో ఉన్నారు. అలాగే ప్రతి రోజు వేలకు పైగా కరోనా టెస్టులు చేస్తున్నశాస్త్రవేత్తల  సిబ్బంది  కూడా  ముందువరుసలోనే ఉన్నారు. ఎందుకంటే రాత్రి పగలు అన్న తేడాలేకుండా రోజు 1000కు పైగా టెస్టులను చేస్తూ ,కొన్నిసార్లు వారుకూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు.

జోస్ఫిని...ఒక సాధారణ కాలేజీ స్టూడెంట్ . బుల్లయ్య కాలేజీ,విశాఖపట్నం లో బయోటెక్నాలజీ  చదువుతుంది .కరోనా మహమ్మారి  మన తెలుగు రాష్ట్రలోకి వచ్చిన  సమయం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రములో కరోనా పరీక్షలు పెంచారు .అత్యధిక టెస్టులు చేయాలనీ నిర్ణయించిన సమయంలో,తగిన సిబ్బంది లేరు .ప్రభుత్వ ఆదేశాలనుసారం కొత్త సిబ్బందిని తీసుకోవడం జరిగినది . 

జోస్ఫిని  ప్రార్థనలో ఎక్కువగా వుండే అమ్మాయి. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో మనకందరికీ తెలిసినదే.  కరోనా వ్యాధి లక్షణాలు వున్నా వారినుండి సేకరించినటువంటి  సాంపిల్స్ ను పరీక్షా చేయాలంటే  ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగిన మనం కూడా కరోనా బారిన పడతాము .

జోస్ఫిని  వెళ్లాలనుకుంది,ఇది కూడా ఒక సేవ గా భావించింది. వాళ్ల ఇంటిలో ఎవరికీ ఇష్టం లేదు. అందరిని ఒప్పించింది .ఇంటర్వ్యూ లో సెలెక్ట్ ఐనా జోస్ఫిని ను  విశాఖపట్నం లో గలకింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) లో డ్యూటీ వేశారు .ప్రతి రోజు 1000 కు పైగా పరీక్షలు చేయాల్సి వచ్చేది.రాత్రి ,పగలు అన్న తేడాలేకుండా పని చేయాల్సి వచ్చింది . లొక్డౌన్ సమయం లో రాత్రి షిఫ్ట్ లో వెళ్లే టప్పుడు,వచ్చేటప్పుడు భయపడుతూనే ఉండేది .కానీ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తన పనిని సక్రమంగా నిర్వహిస్తుంది.ఒకొక్కసారి వారాంతర సెలవు కూడా ఉండేది కాదు. తాను పడుతున్న కష్టాన్ని చూసి ఇంటిలో అందరు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఎప్పటిలా తనను దగ్గరకు తీసుకోలేరు, తనకంటూ ఒక ప్రత్యక మైన గది,కుటుంబం తో కలసి వుండలేదు. ఒక ఇంటిలో వున్నా దూరం పాటిస్తూ ఉండాల్సి వస్తుంది .

ఎన్నో జాగ్రత్తల మధ్య తాను మరియు తన టీం వారి వారి పనులను నిర్వహించే వారు . ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒకసారి తనతో పాటు పనిచేసే మరొకరికి కరోనా సోకింది . అంతే తనలో భయం ,ఇంటిలో అమ్మ ,నాన్నకు చెపితే ఇంకా అంతే మొదటి సారి తనకి ,తన టీం వారికీ కరోనా పరీక్షలు చేసారు .ఇంటిలో ఎవరికీ చెప్పలేదు, ఆ రోజంతా ప్రార్థన చేస్తూనే వుంది .మరుసటి రోజు రిపోర్ట్ లో నెగటివ్ వచ్చింది. ఒక్కసారిగా ఆనందం,రాత్రి పడిన కంగారు,భయం అన్ని పోయాయి. నూతన ఉత్సాహంతో మల్లి ల్యాబ్ వైపు పరిగెతింది జోస్ఫిన్.

"నాకు ఇది కావాలని ఎప్పుడూ దేవుని అడగలేదు నేను,నాకు ఎం కావాలో అది ఆయనే ఇస్తారు" , ఇది కూడా ఒక సేవ అని నేను భావిస్తున్నాను అని జోస్ఫిని అంటుంది .మనమందరం జోస్ఫిని కొరకు ప్రార్దించుదాం. ఇలాంటి యువత మనకు, మన దేశానికీ ఎంతో అవసరం .తాను చేసే పని యందు దేవుడు తోడుగా ఉండాలని, ఈ కరోనా నుండి మనమందరము రక్షింపబడలని ప్రార్దించుదాము.

                                                                                                                                    **********************************************************************************

Saints are next door. They are not just in the annals of history or on the stained glass windows of churches, nor adorning attractive picture books or those featured in the movies. They are in your homes, next door, in your neighborhood. We ought to discover them. Pope Francis for the first time used this expression in his encyclical "Gaudete et exsultate" (Rejoice and be glad), released at the Vatican, April 9, 2018.

They are at the forefront of the battle against Coronavirus- the global pandemic that is afflicting the world today. Pope Francis called them our “Saints Next Door.”

Josephnee...an ordinary college student, studying biotechnology at Bullaya college in Visakhapatnam.Josephnee spends most of her time in prayer. Josephnee is a kind of girl who remains most of the time in prayer.. she's having a habit of attending prayer daily at church before she leaves for college..

At that time when COVID-19 cases reported in Andhra According to the instructions of the respected chief minister Sri.YS.Jagan Mohan Reddy the number of tests being conducted has been increased in the State. At that time when it was decided to conduct more tests, there wasn't enough staff to conduct the tests for COVID-19. According to the government order's new staff are appointed. We all know how the coronavirus transmitted between people. Taking samples from the person who's having symptoms of COVID-19 for testing needs courage. It is because a small mistake may lead to getting effected by a coronavirus.

After the lockdown started, Josephnee didn't plan to stay at home like others. She wants to do her part of assistance to the people during the rapid increase in COVID-19 positive cases. She got to know about the government's requirements of staff to conduct tests for COVID-19. Josephnee wants to join that, considering it as a service. Everyone in her family disagreed with her decision. But Josephnee applied for the job and got selected in the interview. Josephnee got appointed at KGH hospital in Visakhapatnam.

A minimum of 1000 tests per day is needed to be conducted. She needed to be worked day and night. While traveling to the workplace during the night shift she was frightened. But she bound to her decision and flourishing her work. Sometimes there's no day off in a week too. Seeing her struggle at work all the family members were disconsolate. It is because they can't lay hold of her, her own bedroom and can't stay together with the family. Even if they all are under one roof, she's required to maintain her interspace. Under many safety measures she and her team performing their respective works. Even under all the preventive measures, one of her colleague was tested COVID positive. Josephnee was scared. If she informs the Father and mother at home, they will be demolished. For the first time tests were conducted for her and the team . She didn't inform regarding the test conducted to her to the family members. She's just praying God that whole day. The next day she got the test reports as negative. Instantly happiness, the distress of the night, and the fear have disappeared. With new confidence, Josephnee rushed to the lab.

"I've never asked God for everything I want, but God always gives me what I need", I consider this as a part of service - said Josephnee

We all need to pray for Josephnee Our nation and we need youngsters like Josephnee. Let's pray that God will be there for her in every work she does and rescue us from COVID-19.

 

Comments

Super

Really great akka......

Add new comment

8 + 12 =