దేవుని ప్రేమను చూపిస్తూ...Rev Fr Kodvati Bose

ఓ మంచి నిర్ణయం ఎంతో మందిలో ప్రేరణ కలిగిస్తుంది. ఆలాంటి నిర్ణయం మన బోస్ ఫాదర్(Kodvati Bose) తీసుకున్నారు.విచారణ ప్రజలకు క్రీస్తు ప్రేమను తెలియజేస్తూనే, క్రీస్తు ప్రేమను కూడా అయన చేస్తున్న పనులలో చూపిస్తున్నారు.  
గుంటూరు జిల్లా ఎడ్లపాడు పారిష్‌లో పిఆర్ ఆర్గనైజేషన్( PR Organisation ) మరియు  విచారణ  పెద్దలు, సెయింట్ ఆన్ సిస్టర్స్ సహాయం తో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఒక విచారణ స్థాయిలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం.

 కోవిడ్ బారినపడి సరైన వైద్యం, పౌష్టికాహారం అందక అలమటిస్తున్న వారి కోసం ఈ  కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించినట్లుగా తెలిపారు. 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో వారికి మెరుగైన వైద్యం అందిస్తూ,  మంచి పౌష్టికాహారం వారికీ అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
గత సంవత్సరం లో కూడా కోవిడ్ లొక్డౌన్  సమయం లో ఎంతో మందికి ఆహారాన్ని అందించారు.
ఫాదర్ గారికి సహాయం చేస్తున్న ఎడ్లపాడు విచారణ గ్రామ ప్రజలు, సెయింట్ ఆన్స్ సిస్టర్స్  మరియు యూత్, పిఆర్ ఆర్గనైజేషన్ వారికీ అభినందనలు తెలుపుకుంటూ మీ అమృతవాణి రేడియో౦ వెరిటాస్ ఆసియ తెలుగు.

 

 

Add new comment

12 + 2 =