దేవాలయ వాలంటీర్ ఉత్తర ఫిలిప్పీన్స్‌లో మహిళలకు సాధికారతను కల్పిస్తున్నారు

దేవాలయ వాలంటీర్ ఉత్తర ఫిలిప్పీన్స్‌లో మహిళలకు సాధికారతను కల్పిస్తున్నారు

సమాజంలో మార్పును సృష్టించేవారిగా మహిళలకు ఎక్కువ సామర్థ్యం ఉందని ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని మారుమూల ప్రాంతంలో నిర్వహించే పాస్టోరల్ మినిస్ట్రీలో 56 ఏళ్ల వాలంటీర్ చెప్పారు.“మార్పుకు మహిళలు ఏ సమాజపు పురోగతికైనా  ఉత్ప్రేరకాలు కావచ్చు. వారికి విద్య, సాధికారత మరియు సాధారణ మంచి కోసం సమాజానికి సహకరించడానికి అవకాశాలు ఇవ్వాలి, ”అని ఈడెన్ అబోగాడో కోర్డోవా గారు చెప్పారు.

ఆమె లుజోన్‌లోని బికోల్ రీజియన్‌లో ఉన్న ఫిలిప్పీన్స్‌లోని కామరైన్స్ నార్టే ప్రావిన్స్‌లోని బరంగే (గ్రామం) అవిటాన్‌కు చెందినవారు.కార్డోవ డైట్ లో పాస్టోరల్ కేర్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రాం (PCC) యొక్క సమన్వయకర్త, బారంగే హెల్త్ సెంటర్‌లో  న్యూట్రిషన్ స్కాలర్‌గా (BNS) పని చేస్తున్నారు.

మహిళా సాధికారత గురించి కార్డోవా  గారు మాట్లాడుతూ, "నేను నాలాంటి మహిళలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వ్యాప్తి చేయడం నేర్పుతాను."మహిళల ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి సహాయం చేయడం సమాజం యొక్క బాధ్యత, "మన సమాజాన్ని, పురోగమించడానికి స్త్రీలుగా మనం చేయగలిగినదంతా చేద్దాం; మన హక్కులను కూడా సాధించుకోవడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం" అని మహిళలకు సందేశంలో తెలిపారు.

ముఖ్యంగా, కుటుంబంలో ఐక్యత, ఒకరికొకరు సహాయం చేయడం మరియు మెరుగైన సమాజాన్ననిర్మించడం,కుటుంబాన్ని సంతోషంగా మరియు శాంతియుతంగా మార్చడం  స్త్రీల  చేతుల్లో ఉంది.

“మీరు ప్రార్దించే దేవుడు,మిమ్మల్ని చివరి వరకు నడిపిస్తాడు. నేను చేయగలిగినంత కాలం, నేను ఇతరులకు సేవ చేస్తూనే ఉంటాను, ”అని కోర్డోవా గారు చెప్పారు.

Add new comment

5 + 9 =