జపమాల మాత పండుగ

జపమాల మాత పండుగ

మన శ్రీసభలో మే నెలకు , అక్టోబర్‌ నెలకు  ప్రత్యేక విశిష్టత ఉన్నది. ఎందుకంటే, ఈ రెండు నెలలు కూడా  మరియతల్లికి అంకితం చేయబడినవి. ఈ నెలలో మన యొక్క ప్రార్ధనా అవసరతను తన యొక్క ప్రియ కుమారుడు , మన ప్రభువైన యేసు ప్రభువు వారికీ  మనవి చేయమని మరియతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను అర్థిస్తూ పార్దిస్తుంటాము.  ఈసందర్భంగా పండుగ యొక్క చరిత్రను, మరియతల్లి మనందరికీ ఇచ్చిన జపమాల ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని గూర్చి తెలుసుకుందాం.

క్రీస్తు శకం 1571లో లెప్పాంతోలో అల్బి జెన్సీయులైన ఇస్లాము వారిపై యుద్ధములో విజయమును సాధించటానికి మరియతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఎంతో సహాయపడింది.  ఈ విజయానికి గుర్తుగా మన తల్లి శ్రీసభ అప్పటి పోప్‌గార్ల ఆమోదంతో ఈ పండుగను కొనియాడుతూ వస్తున్నది. మొదట ఈ పండుగ కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం చెందినది తరువాత  విశ్వవ్యాప్తం చెందినది.

క్రీస్తు శకం 13వ శతాబ్ద ఆరంభంలో మరియతల్లి తన యొక్క స్వహస్తాల ద్వారా పునీత దోమినిక్‌ గారికి జపమాలను ఇచ్చి జపమాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయనకు చెప్పి ఉన్నారు.

జపమాల :
పరలోక జపము,  మంగళ వార్త జపము, మరియు ఒక త్రీత్వ స్తోత్రము తో కలసి ఉంటుంది.
జపమాలలో మొత్తం 20 గురుతులు మనకు కనిపిస్తూ ఉంటాయి.  అందులో ఐదు సంతోష దేవరహస్యాలు, ఐదు దు:ఖ దేవరహస్యాలు, ఐదు మహిమ దేవరహస్యాలు, ఐదు వెలుగు దేవరహస్యాలు ఉంటాయి.

ప్రభు యేసుని  జననము, మరణము, మనకోసం ఆయన అనుభవించిన శ్రమలు, పునరుత్థానము, మోక్షారోహణము, పవిత్రాత్మ రాకడ, దివ్యసత్ప్రసాద స్థాపన. అదేవిధంగా మరియమాతకు సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక ఘట్టాలను మనము ఇందులో ధ్యానం చేయవచ్చు.
దేవమాత ప్రార్థన ,పునీత బెర్నార్డ్ దేవమాతను జూచి వేడుకొనిన జపము చివరిగా దేవమాతకు సమర్పణ తో ఇది ముగుస్తుంది.

 

Add new comment

6 + 0 =