గురుశ్రీ కోస్టాంజో గ్యోసెప్పి బెస్చి గారి 342వ జయంతి వేడుకలు

తమిళనాడు రాష్ట్రం, కోనన్‌కుప్పంలోని అవర్ లేడీ ఆఫ్ పెరియనాయగి పుణ్యక్షేత్ర విచారణ సభ్యులు నవంబర్ 5న ఇటాలియన్ జేసు సభ మిషనరీ 342వ జయంతిని కొనియాడారు.

1711లో గురుశ్రీ కోస్టాంసో  గ్యోసెప్పి బెస్చి గారు (1680–1747) తమిళనాడులోని మధురై మిషన్‌కు పంపబడ్డారు.

తమిళ భాష మరియు సాహిత్యానికి వారు చేసిన కృషికి 'వీరమామునివర్' గా ప్రసిద్ధి చెందారు.
వీరు లాటిన్, గ్రీక్, హిబ్రూ మరియు పోర్చుగీస్‌తో సహా అనేక భాషలు మాట్లాడగలరు.

భారతదేశానికి మిషనరీగా వచ్చి తమిళం, సంస్కృతం, తెలుగు మరియు ఉర్దూ నేర్చుకున్నారు.

వీరు రెండు ముఖ్యమైన మరియతల్లి పుణ్యక్షేత్రాలను నిర్మించారు : తమిళనాడు కడలూరు జిల్లా, పరూర్ సమీపంలో కోనన్‌కుప్పం మరియు తంజావూరు సమీపంలోని ఎల్లకురిచ్చి.

వీరమామునివర్యుల విగ్రహానికి విరుతాచలం శాసన సభ సభ్యుడు (ఎమ్మెల్యే) ఆర్.రాధాకృష్ణన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడలూరు జిల్లా కౌన్సిలర్ సామి గారు కూడా పాల్గొన్నారు.

Add new comment

2 + 2 =