క్రీస్తు మోక్షారోహణ మహోత్సవము.

కుమారుడైన దేవుడు మానవుల రక్షణార్థం తండ్రిచిత్తాన్ని నెరవేర్చి దైవరాజ్య ప్రకటన  బాధ్యత మనకప్పగించి మోక్షారోహణుడైనాడు. “క్రీస్తు మోక్షారోహణ పండుగ” క్రైస్తవ విశ్వాసానికి ఒక గొప్ప పునాది. ఈ పండుగ సందర్బంగా మనం రెండు విషయాలను గురు కోవాలి. ఒకటి మన దృష్టిని స్వర్గం వైపు మళ్ళించడం. రెండు క్రీస్తు మనల్ని ఎంపిక చేసుకొని పంపబడిన బాధ్యతను సకకు నిర్వర్తించడం. “మీరు ప్రపంచ మనందంతట తిరిగి సకల ఆ జనులకు సువార్తను బోధింపుడు" అని క్రీస్తు ప్రభువు తాను మోక్షారోహణం అయ్యే ముందు గొప్ప బాధ్యతను అప్పగించారు. అతి సాధారణ మైన అర్హతలేని అల్పమైన అతి చిన్న సమూహమైన తన శిష్యులకు అప్పగించారు. ఎందుకంటే అతి సాధారణమైన వ్యక్తుల ద్వారా ఆద్భుత కార్యాలు సాధించాలన్నదే ఆయన ప్రణాళిక..

Add new comment

8 + 6 =