కోల్కతా నగర ధన్య మదర్ థెరిస్సా | 5th September

కోల్కతా నగర ధన్య మదర్ థెరిస్సా

 మదర్ థెరిస్సాగారు క్రీIIశ 1910 ఆగష్టు 26వ తేదీన యుగోస్లావియా దేశంలోని “స్కోప్ట్' నగరంలో విశ్వాసుల కుటుంబంలో జన్మించారు. తండ్రి నికోలాసు తల్లి ద్రానాపిలై. తమ బిడ్డకు జ్ఞానస్నానంలో ‘ఆగ్నేస' అని పేరు పెట్టించారు. మంచి భక్తి విశ్వాసాల్లో పెంచారు. 11వ పయస్ (భక్తినాథ) జగద్గురువుల రచనలు సందేశాలు ఆ బాలికను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఆగ్నేస తమ విచారణలోని ‘మరియదళం'లో సభ్యురాలుగా ఉండి పేదలు అవసరార్ధుల సేవ చేసేవారు. ఆ దళంవారు రకరకాల కరపత్రాలు ప్రచురించి పంచేవారు. వాటిలో కొన్ని సనాతన హిందూదేశంలో సువార్తా ప్రచార తీరుతెన్నులు వివరింపబడ్డాయి. బెంగాలు, డార్జిలింగులలో జేసు సభ గురువుల సేవ ఆ యమ్మను ఎంతగానో ప్రభావితం చేశాయి.

తానుకూడ దేవుని సేవ మానవసేవకే అంకితం కావాలని అందునా భార్య దేశంలో తన సేవలు అందించాలని ఆశించారు. అందుకు అనువుగా ఉండే ఐర్లాండులోని డబ్లిన్ నగరంలోగల 'లోరెట్టా కన్యస్త్రీల సభ'లో క్రీ.శ11 1928లో ప్రవేశించారు. క్రీ||శ|| 1929లో భారతదేశంలో పొదంమోపారు. హిమాలయాల ప్రాంతమైన డార్జిలింగు మఠంలో ఆయమ్మ రెండేళ్లు తర్ఫీదుపొంది సిస్టిర్ థెరిస్సాగా పేరు మార్చుకుని దేవునికి మొదటి మాట పట్టునిచ్చారు. పిమ్మట కోలకతాలో లోరెట్టా మఠవాసినులు నడిపే పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరారు. ఇక్కడే వారి జీవితం సంపూర్ణవికాసం పొందింది. ఆ పాఠశాలలో చరిత్ర, భూగోళ శాస్త్రం ఆధ్యాపకురాలిగా ఇరవై సం||లు సేవచేసి అక్కడే ప్రధానోపాధ్యాయినిగా కూడ పదోన్నతిపొందారు.

తమ లొరెట్టా మఠకన్యలు నిర్వహించే అనాథులు, పేదబాలికల వసతి గృహాల్లో కూడ థెరిస్సాగారు తమ సేవలు అందించారు. కేవలం ఒక బడి ప్రధానోపాధ్యాయినిగా “ఈ అభాగ్య పిల్లల్ని ఎలా ఉద్దరించగలను ?” అనే ప్రశ్నవారిని బహుగా వేదించింది. ఒకరోజు అనగా క్రీ.శ. 1946 సెప్టెంబరు 10వ తేదీన థెరిస్సాగారు డార్జిలింగు పట్టణంకు వెళ్లే రైలులో పయనిస్తుండగా వారి మదిలో ఒక దివ్య ప్రేరణ కలిగింది. “నీవు కాన్వెంటును వదలి నిరు పేదలకు సేవచేస్తూ వారితో కలసి జీవించు” అనేదే ఆ ప్రేరణ. "ప్రభూ ! నీ దాసిని. నీ సంకల్పం ప్రకారమే జరుగనీయండి” అని ఆ దివ్య ప్రేరణకు ఆ యమ్మ విధేయించారు.

థెరిస్సాగారు ఇప్పుడు అవలంభిస్తున్న జీవన విధానాన్ని, చేస్తున్న పనినీ విడనాడి నడివీధుల్లో మురికి వాడల్లో దుర్భర దారిద్ర్యంలో మగ్గే అభాగ్యుల సేవచేయ నడుం కట్టారు. తిరిగి కోల్కతా చేరుకుని తమ అనుభవాన్ని తోడి మఠ వాసినులకు ఆర్చిబిషప్ పెరియార్ గార్కి ఎరిగించారు.క్రీ||శ|| 1948 ఫిబ్రవరిలో మేత్రాసనంనుండి థెరిస్సాగారు తమ అభ్యర్ధనను జగద్గురువులకు పంపించారు. మత పరమైన సంస్థద్వారా క్రీస్తు పరిచర్యను పేదలు అనాథలు వ్యాధిగ్రస్తులు అవసరార్ధులందరికి అందించాలని ఆ యమ్మ తృష్ణ. క్రీ||శ|| 1948 ఆగష్టు 16న ఆ యమ్మ కాన్వెంటును విడచి అడుగు బయట పెట్టారు. పాట్నాకు వెళ్లి 'మెడికల్ మిషనరీ సిస్టర్స్' సంస్థలో నర్శింగ్'లో ఉత్తమ శిక్షణ గడించారు. క్రీ||శ|| 1948లోనే ఆ యమ్మ భారతదేశ పౌర సత్వం స్వీకరించారు.

పిమ్మట కోల్కతా వచ్చి "లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్' మఠంలో తాత్కాలిక ఎన ఏర్పాటు చేసుకుని తమ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు మదర్ థెరిసాగారు. మురికివాడల్లోకి వెళ్లి పేదలు, పిల్లలను పరామర్శిస్తూ, అక్షరాభ్యాసం చేయిస్తూ పరిశుభ్రతను అలవర్చారు. క్రీ||శ|| 1949 మార్చిలో థెరిస్సాగార్కి మొదటి సహచరురాలు “ఆగ్నేసు' లభించారు. క్రమంగా సభ్యులు పెరిగారు. సంస్థ ప్రారంభదశలో కనీసం పదిమంది సభ్యులు ఉండాలి. నిర్దిష్టమైన నియమనిబంధనలకు లోబడి ఉండాలి. ఆ నిబంధనలన్నీ పూర్తిచేసుకున్న తమ సంస్థకు ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ' అని పేరు పెట్టారు. ఆ సంస్థను ఆమోదిస్తూ క్రీ||శ|| 1950 ఆక్టోబరులో పవిత్ర జపమాల రాణి మహోత్సవంనాడు పరిశుద్ద పోపుగారి లేఖ మదర్ థెరిస్సాగారికి అందింది.

అనాథలకోసం మదర్ థెరిస్సా ఒక చికిత్సాలయాన్ని తెరిచారు. ఇది కోల్కతాలోని ప్రసిద్ధ కాళీమాత గుడి ప్రక్కనే ఉండేది. నిర్మల హృదయ్' దాని పేరు. అరవైమందికి మాత్రం ప్రవేశం ఉండింది. మిగతా రోగుల్ని పరామర్శించి మందులిచ్చి పంపేవారు.ఒకరోజు కొంతమంది యువకులు ఊరేగింపుగా వచ్చి “హైందవ కాళీమాత దేవాలయం ప్రక్కన ఆశ్రమం పెట్టి అందర్నీ క్రైస్తవులుగా మారుస్తోంది మదర్ థెరిస్సా. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలి”. అని నినాదాలిచ్చారు. మదర్ గారు వచ్చి వారి నాయకుని లోనికి తీసికొనిపోయి వారి సేవలను చూపించారు. ఆ నాయకుని హృదయం మారు మనస్సు పొందింది. వెలుపలకు వచ్చి “మదర్ థెరిస్సాను వెళ్లగొట్టేముందు వార్ల సేవాకార్యక్రమాల్ని కొనసాగించేందుకు మన అమ్మలకు అక్కా చెల్లెళ్లకు అప్పగించి వెళ్లగొడదాం” అనగానే అందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఒకసారి కాళీమాత పూజారి క్షయవ్యాధితో 'నిర్మల హృదయ్' చికిత్సాలయంలో చేరాడు. అక్కడి ప్రేమ, కారుణ్య పూరిత సేవలను చూచి చలించిపోయాడు. “అమ్మా గత 30 ఏండ్లుగా కాళీమాత సేవలో బ్రతికాను. కాని సజీవ కాళీమాతను ఇప్పుడే చూసి ధన్యమయ్యాను” అని పాదాభివందనం చేశాడు. | క్రీ||శ|| 1975లో “ప్రేమదాన్' అనే భవనం ఆ యమ్మగారికి కానుక చేయబడగా అందు కోలుకుంటున్న వ్యాధిగ్రస్తుల ఆసుపత్రిగా దాన్ని వినియోగించారు. అపర నైటింగేలుగా ఆ యమ్మ పేరు తెచ్చుకున్నారు.

కల్లాకపటంలేని పిల్లల్ని, నిస్సహాయుల్ని క్రీస్తు పేరట ఆదరించడానికి మదర్గారు ఒక 'శిశు భవన్'ను తెరిచారు. నడి వీధుల్లో పోలీసుల కంటబడ్డ దిక్కూ మొక్కూలేని పసి గుడులకూ, చెత్త కుండీల్లో తల్లులుదారుణంగా పారవేసిన పాపలకూ కాన్వెంట్లముందు అజ్ఞాత వ్యక్తులు విడిచిపోయిన అనాథ బాలలకూ, సంఘానికి భయపడి కన్నవాళ్లు అప్పగించి వెళ్లే అక్రమ సంతానానికి “శిశుభపన్' దేవుడి ఒడిగా మారింది. కొందరు పిల్లలు మృత్యువాత పడినా చాలామంది ఆ మాతృమూర్తి ఆదరణలో క్రొత్త ఊపిరు పోసుకునేవారు. శిశుభవన్లో అనాధ శిశువులేగాక అక్రమ సంతానాన్ని మోస్తున్న అభాగినులు సైతం ఆశ్రయాన్ని ఓదార్పును పొందేవారు.

| కుష్ఠురోగుల వైద్య పునరావాసాలకై మదర్ థెరిస్సాగారు “శాంతి నగరం' అనే కేంద్రాన్ని స్థాపించారు. వారికోసం సంచార వైద్యశాలనుకూడ నిర్వహించారు. శ్రీసభ నిబంధనల ప్రకారం మేత్రాసన సభగా ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ' సంస్థ పదేళ్లు ముగించుటచే ఇక అనేక ప్రాంతాలకు అది విస్తరింప అనుమతి ఉంటుంది. అందువల్ల రాంచీ, ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో కూడ తమ కేంద్రాలను ఏర్పరచి తమ సేవలను విస్తరించారు. క్రీ||శ|| 1964లో 6వ పౌలు పోపుగారు దివ్యసత్రసాద మహాసభల్లో పాల్గొన భారత్ వచ్చినప్పుడు మదర్ గారి సేవాకార్యక్రమాల్ని స్వయంగా సందర్శించి సంతసించి తమ కారును ఆ యమ్మకు బహుకరించారు. అది వారికి నాలుగున్నర లక్షల రూపాయలు ఆర్జించి పెట్టింది. | క్రీశ 1977 నాటికే మదర్ థెరిస్సా ఆశ్రమాలు వెనిజులా, ఇటలీ (రోము), ఆస్ట్రేలియా, జోర్డాను, ఎమెన్ వంటి ఇరవై దేశాలకు ప్రాకాయి. ఆ యమ్మ జీవిత కాలంలోనే వారి సభ 132 దేశాల్లో 500కు పైగా సేవా సంస్థలు నడుపుతున్నారంటే ఆశ్చర్యకరమే.

ఒకసారి ఒక వ్యక్తి మదర్ థెరిస్సాగార్ని “మీరు మత మార్పిడిని ప్రోత్స హిస్తున్నారా?” అని ప్రశ్నింపగా “మీరేదైనా శుభప్రదమైన వస్తువును పొందితే మీ తోడివాళ్లకుకూడా దానిని సంపాదించి పెట్టాలని మీరు అభిలషించరా ? ప్రపంచంలో శుభప్రదమైన వ్యక్తి క్రీస్తు అని నా నమ్మకం” అని సమాధాన మిచ్చారు. “ఇది వ్యక్తిగతమైన నమ్మకం. ఇందులో ఎవరూ ఎవర్నీ మత మార్పిడి చేయలేరు” అనికూడ తెలిపారు. దీన జన సేవే సువార్తా ప్రచారంగా ఆ యమ్మ భావించారు.

తమ సేవా కార్యాలలో పాలు పంచుకునేందుకు మదర్ థెరిస్సాగారు “మిషనరీ బ్రదర్స్ ఆఫ్ చారిటీ' అనే సంస్థనుకూడ స్థాపించగా 1977 నాటికే వారికి దేశ విదేశాల్లో 14 కేంద్రాలు తెరిచారు. ఇందు గురువులుకూడ చేరి సంస్థను పరిపుష్టం చేశారు. మెక్సికోలో ప్రజల ఆథ్యాత్మిక అవసరాలు తీర్చడానికై “సిస్టర్స్ ఆఫ్ ది వర్' (దైవ వాక్కు మఠకన్యల సభ)ను ఏర్పరచారు. లౌకికులతో “మిషనరీస్ ఆఫ్ చారిటీ సహ కార్యకర్తల సంఘం" పేరట శ్రీమతి ఆన్ బెయిక్లీ నేతృత్వంలో ఇంగ్లాండులో ప్రార్థనాకూటాలు నిర్వహింప చేశారు. ఈ సంస్థను 1969 మార్చి 26న 6వ పౌలు పోపుగారు ఆశీర్వదించారు కూడా.

మదర్ థెరిస్సాగారు గర్భస్రావం, అమానుషత్వం, వివక్ష, గర్భనిరోధం, సునాయాస మరణ ప్రాప్తి వంటి అసహజ భావాలపై సమర శంఖం ఊదారు. ఎయిడ్స్ వంటి రోగం పై అవగాహన పెంచేందుకు కృషిచేశారు. సోమాలియా, ఇథియోపియా వంటి దేశాలు కరువు బారిన పడి రోగాలు అధికమవ్వగా మాతృమూర్తిలా మదర్ వారికి సహాయమందించారు. దేశ విదేశాలనుండి విరివిగా వచ్చే విరాళాలు స్వచ్ఛంద సేవకుల బలంతో ముఖ్యంగా దైవశక్తి పవిత్రాత్మ ప్రభావంతో ఆ తల్లి ఒక వ్యవస్థగా ఒక శక్తిగా పనిచేసి పేదల పెన్నిధి, కరుణామయి, శాంతిదూత, ప్రపంచ కుటుంబ సంఘ సేవికగా పేర్గాంచారు. వారి సభ వారు ఆ యమ్మను ఆదర్శంగా సేవానిరతి కొనసాగిస్తున్నారు. | ఎన్నో విశ్వవిద్యాలయాలు, సంస్థలు మదర్ గార్కి గౌరవ డాక్టరేట్లు బిరుదులు, బహుమతులు ఇచ్చి సత్కరించాయి. తనద్వారా క్రీస్తు వాక్యం వినబడాలని ఆ తల్లి వాటిని అందుకున్నట్లు పేర్కొన్నారు. 1962లో పద్మభూషణ్ అవార్డు, ఫిలిప్పీన్స్ నుండి మెగసెసె అవార్డు లభించగా, 1977లో 23వ జాన్ పోపుగారి శాంతి బహుమతి, బోస్టన్ వారినుండి గుడ్ సమారిటన్ అవార్డు, జాన్ కెన్నెడి అంతర్జాతీయ బహుమతి క్రీIIశII 1977లో లభించాయి. బ్రిటన్ వారి టెంపుల్టన్ అవార్డుకూడ వారికి దక్కింది. 1979 అక్టోబరు 17న 'నోబెల్ శాంతి బహుమతి, 1980 జనవరి 26న 'భారతరత్న' అత్యున్నత అవార్డు ఆ యమ్మకు లభించాయి.

అట్టి మహనీయురాలు కోల్కతాలోని తమ మఠాలయంలో క్రీశ 1997 సెప్టెంబరు 5న దేహంచాలించగా సెప్టెంబరు 13న ప్రభుత్వ లాంఛనాలతో దేశ విదేశీ ప్రముఖులరాకతో అంతిమ యాత్ర జరిగింది. భారత రాష్ట్రపతి శ్రీ నారాయణన్, ప్రధాని గుజ్రాల్ అందుకు ప్రత్యక్షసాక్యం. గుజ్రాల్గారు ఆ యమ్మను "రెండవ మహాత్మ అని అభివర్ణించి నివాళులర్పించారు. ఆ యమ్మ కన్నీటి వీడ్కోలు యూత్రను ప్రపంచమంతా టి.విలద్వారా ప్రత్యక్షప్రసారాల్ని తిలకించి ధన్యులయ్యారు. అమ్మలకే అమ్మ అయిన మదర్ గారికి భారత ప్రజ సంపూర్ణ సంతాపాన్ని ప్రకటించి తమ ప్రేమను వెల్లడించారు. మదర్ థెరిస్సాగారికి 2003 అక్టోబరు 19వ తేదీన వాటికను నగరంలో 2వ జాన్ పాల్ జగద్గురువులు ధన్యతా పట్టాను ప్రసాదించారు. తెరేస అనేది గ్రీకు దేశానికి చెందిన ఒక దీవి పేరు.


 The remarkable woman who would be known as Mother Theresa began life named Agnes Gonxha Bojaxhiu. Born on August 26, 1910 in Skopje, she was the youngest child born to Nikola and Drane Bojaxhiu, Receiving her First Communion at the age of five, she was confirmed in November 1916. Her father died while she was only eight years old leaving her family in financial straits.Gonxha's religious formation was assisted by the vibrant Jesuit parish of the Sacred Heart in which she was very involved as a youth.

Subsequently moved to pursue missionary work, Gonxha left her home in September 1928 at the age of 18 to join the Institute of the Blessed Virgin Mary, known as the Sisters of Loreto, in Ireland. She received the name Sister Mary Teresa after St. Therese of Lisieux. In December of 1929, she departed for her first trip to India, arriving in Calcutta. After making her First Profession of Vows in May 1931, Sister Teresa was assigned to the Loreto Entally community in Calcutta and taught at St. Mary's School for girls.

Sister Teresa made her Final Profession of Vows, On May 24, 1937, becoming, as she said, the "spouse of Jesus" for "all eternity." From that time on she was called Mother Teresa.She continued teaching at St. Mary's and in 1944 became the school's principal. Mother Teresa's twenty years in Loreto were filled with profound happiness. Noted for her charity, unselfishness and courage, her capacity for hard work and a natural talent for organization, she lived out her consecration to Jesus, in the midst of her companions, with fidelity and joy.

It was on September 10, 1946 during a train ride from Calcutta to Darjeeling for her annual retreat,Mother Teresa received her "inspiration, her call within a call." On that day, in a way she would never explain, Jesus' thirst for love and for souls took hold of her heart and the desire to satiate His thirst became the driving force of her life.By means of interior locutions and visions, Jesus revealed to her the desire of His heart for "victims of love" who would "radiate His love on souls." "Come be My light,'"He begged her. "I cannot go alone."
Jesus revealed His pain at the neglect of the poor, His sorrow at their ignorance of Him and His longing for their love. He asked Mother Teresa to establish a religious community, Missionaries of Charity, dedicated to the service of the poorest of the poor.Nearly two years of testing and discernment passed before Mother Teresa received permission to begin. On August 17, 1948, she dressed for the first time in a white, blue-bordered sari and passed through the gates of her beloved Loreto convent to enter the world of the poor.

After a short course with the Medical Mission Sisters in Patna, Mother Teresa returned to Calcutta and found temporary lodging with the Little Sisters of the Poor. On December 21, she went for the first time to the slums. She visited families, washed the sores of some children, cared for an old man lying sick on the road and nursed a woman dying of hunger and tuberculosis. She started each day with communion then went out, rosary in her hand, to find and serve Him amongst "the unwanted, the unloved, the uncared for." After some months, she was joined, one by one, by her former students.

On October 7, 1950 the new congregation of the Missionaries of Charity was officially established in the Archdiocese of Calcutta. By the early 1960s, Mother Teresa began to send her Sisters to other parts of India. The Decree of Praise granted to the Congregation by Pope Paul VI in February 1965 encouraged her to open a house in Venezuela. It was soon followed by foundations in Rome and Tanzania and, eventually, on every continent. Starting in 1980 and continuing through the 1990s, Mother Teresa opened houses in almost all of the communist countries, including the former Soviet Union, Albania and Cuba.

In order to respond better to both the physical and spiritual needs of the poor, Mother Teresa founded the Missionaries of Charity Brothers in 1963, in 1976 the contemplative branch of the Sisters, in 1979 the Contemplative Brothers, and in 1984 the Missionaries of Charity Fathers. Mother Theresa's inspiration was not limited to those with religious vocations. She formed the Co-Workers of Mother Teresa and the Sick and Suffering Co-Workers, people of many faiths and nationalities with who she shared her spirit of prayer, simplicity, sacrifice and her apostolate of humble works of love.

This spirit later inspired the Lay Missionaries of Charity. In answer to the requests of many priests, in 1981 Mother Teresa also began the Corpus Christi Movement for Priests as a "little way of holiness" for those who desire to share in her charisma and spirit.During the years of rapid growth the world began to turn its eyes towards Mother Teresa and the work she had started. Numerous awards, beginning with the Indian Padmashri Award in 1962 and notably the Nobel Peace Prize in 1979, honored her work, while an increasingly interested media began to follow her activities. She received both prizes and attention 'for the glory of God and in the name of the poor."

There was a heroic side of this great woman that was revealed only after her death. Hidden from all eyes, even from those closest to her, was her interior life marked by an experience of a deep, painful and abiding feeling of being separated from God, even rejected by Him, along with an ever increasing longing for His love. She called her inner experience, the darkness. The "painful night" of her soul, which began around the time she started her work for the poor and continued to the end of her life, led Mother Teresato an ever more profound union with God. Through the darkness she mystically participated in the thirst of Jesus, in His painful and burning longing for love, and she shared in the interior desolation of the poor.

In spite of increasingly severe health problems towards the end of her life, Mother Teresa continued to govern her Society and respond to the needs of the poor and the Church. By 1997, Mother Teresa's Sisters numbered nearly 4,000 members and were established in 610 foundations in 123 countries of the world. In March 1997 she blessed her newly-elected successor as Superior General of the Missionaries of Charity and then made one more trip abroad. After meeting Pope John Paul II for the last time, she returned to Calcutta and spent her final weeks receiving visitors and instructing her Sisters.

On September 5, Mother Teresa's earthly life came to an end. She was given the honor of a state funeral by the Government of India and her body was buried in the Mother House of the Missionaries of Charity. Her tomb quickly became a place of pilgrimage and prayer for people of all faiths, rich and poor alike.Mother Teresa left a testament of unshakable faith, invincible hope and extraordinary charity. Her response to Jesus' plea, "Come be My light," made her a Missionary of Charity, a "mother to the poor," a symbol of compassion to the world, and a living witness to the thirsting love of God. As a testament to her most remarkable life, Pope John Paul II permitted the opening of her Cause of Canonization. On December 20, 2002 he approved the decrees of her heroic virtues and miracles.

Mother Teresa was beatified by Pope John Paul II on October 19, 2003.On the occasion of her beatification, the Missionaries of Charity issued the following statement:"We, the Missionaries of Charity, give thanks and praise to God that our Holy Father, Pope John Paul II, has officially recognized the holiness of our mother, Mother Teresa, and approved the miracle obtained through her intercession. We are filled with joy in anticipation of the Beatification that will take place in Rome on Mission Sunday, 19 October 2003, the closest Sunday to the 25th anniversary of the Holy Father's Pontificate and the end of the Year of the Rosary.

 "Today, after three and a half years of investigation and study, the Church confirms that Mother heroically lived the Christian life and that God has lifted her up as both a model of holiness and an intercessor for all."Mother is a symbol of love and compassion. When Mother was with us, we were witnesses to her shining example of all the Christian virtues. Her life of loving service to the poor has inspired many to follow the same path. Her witness and message are cherished by those of every religion as a sign that "God still loves the world today." For the past five years since Mother's death, people have sought her help and have experienced God's love for them through her prayers. Every day, pilgrims from India and around the world come to pray at her tomb and many more follow her example of humble service of love to the most needy, beginning in their own families.

"Mother often said, 'Holiness is not the luxury of the few, it is a simple duty for each one of us. May her example help us to strive for holiness: to love God, to respect and love every human person created by God in His own image and in whom He dwells, and to care for our poor and suffering brethren. May all the sick, the suffering, and those who seek God's help find a friend and intercessor in Mother."Following her beatification, a long wait for a second miracle then followed. On December 17, 2015 Pope Francis announced a second miracle had been attributed to the intercession of Mother Teresa. The miracle involved a Brazilian man who was afflicted with tumors who was miraculously cured. This cleared the way for Mother Teresa's canonization.Mother Teresa will be canonized on September 4, 2016 by Pope Francis.   

Add new comment

4 + 15 =