ఉచిత ఆహారాన్ని అందిస్తున్న తమిళనాడు మేత్రాసన గురువు

తమిళనాడు, గోపిచెట్టిపాళయం ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో, తపస్సు కాలం సందర్భంగా 200 మందికి ఉచిత ఆహార పొట్లాలను అందిస్తున్న మేత్రాసన గురువు గురుశ్రీ అంతోనీ లారెన్స్ గారు.

"నేను దేవుని సాధనం మాత్రమే, ప్రజల సహాయంతోనే ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించగల్గుతున్నాను" అని ఫాదర్ గారు RVAతో తెలిపారు.

గోపిశెట్టిపాళ్యం ప్రభుత్వా ఆసుపత్రి దగ్గర 100కి ఆహార పొట్లాలు ఉచితంగా అందించాలని అనుకున్నామని, అయితే అది వారికి సరిపోదని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని 200కి పెంచామని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఫాదర్ గారు అన్నారు.

విబూది బుధవారం మరియు పస్కా ఆదివారం మధ్య 47 రోజుల ఉచిత భోజనం సమయంలో, నేను విచారణ విశ్వాసుల ఆర్థిక సహాయానికి ఎంతో ప్రేరేపింపబడ్డాను.

"ఆహారం తీసుకున్న తర్వాత ఆకలితో ఉన్న వారి ముఖాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని అనుభవించాను, బాధపడుతున్న వ్యక్తులలో క్రీస్తును చూసేందుకు ఇది నిజమైన మార్గం" అని క్లెమెంట్ ప్రేమ్ కుమార్ అన్నారు.

కోయంబత్తూరు మేత్రాసనం, గోపిచెట్టిపాళయంలోని సేక్రేడ్ హార్ట్ దేవాలయంలోగల 400 కథోలిక కుటుంబాలకు ఫాదర్ లారెన్స్ గారు తన సేవను అందిస్తున్నారు.
 

Add new comment

7 + 6 =