ఉక్రెయిన్ లో యుద్ధం వల్ల బాధపడుతున్న ప్రజలకు సహాయం చేస్తామని ప్రమాణం చేసిన సిస్టర్స్

ఈశాన్య భారతదేశంలోని మిజోరం రాష్ట్రానికి చెందిన ఇద్దరు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సిస్టర్స్   ఉక్రెయిన్ లో యుద్ధం వల్ల బాధపడుతున్న ప్రజలకు తమ సేవ చేయడం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

సిస్టర్స్ రోసెలా నూతనాంగి (Rosela Nuthangi ) మరియు ఆన్ ఫ్రిద (Ann Frida) ఉక్రెయిన్ లో  గాయపడిన వారికి మరియు యుద్ధం నుండి పారిపోతున్న వారికి సేవ చేయడానికి  ఉక్రెయిన్ లోనే ఉండాలని  నిర్ణయించుకున్నారు.
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (ఎంసి), కలకత్తా మదర్ థెరిసా కన్య స్త్రీల  సుపీరియర్ జనరల్ సిస్టర్ ప్రేమ మార్చి 2 న ఇద్దరు  సిస్టర్స్ ను  సంప్రదించారు.  రష్యా చేస్తున్నటువంటి యుద్ధ దాడులనుండి  సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని సిస్టర్స్ ని  కోరారు.

ఆయితే   సాధ్యమైనంత వరకు ప్రజలకు సహాయం చేయడానికి సిస్టర్స్ ఇష్టపడ్డారు . సిలువ లో ప్రభు యేసు క్రీస్తు చూపించిన ప్రేమను, కరుణను ఈసమయం లో గుర్తు చేసుకున్నారు.  ప్రమాదకర పరిస్థితులలో వారు ఉన్నపటికీ ప్రజలకు సేవ చేయాలనీ నిర్ణయిచుకున్నారు.  

Add new comment

1 + 4 =