Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ఇతరులకు సేవ చేయకుండా భారతీయ స్త్రీని ఎటువంటి సవాళ్లు ఆపలేవు
45 ఏళ్ల అముతశాంతి గారు , పుట్టినప్పటి నుండి శారీరక వికలాంగురాలు, 1000 మందికి పైగా శారీరక వికలాంగులకు సాధికారత కల్పించారు. 2005లో, దక్షిణ భారతదేశంలోని మదురైలో S.S. కాలనీలో త్యాగం ట్రస్ట్‌ని స్థాపించి ఆమె వారి స్వంత కాళ్లపై వారిని నిలబడేలా చేసింది.గ్రామీణ వికలాంగ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే త్యాగం ట్రస్ట్ , జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఉత్సాహంగా ఎదుర్కొనే వాతావరణాన్ని అందిస్తుంది.
అముతశాంతి గారు తమిళనాడులోని మదురై జిల్లాలోని 95 గ్రామాలలో తన సేవను ప్రారంభించి, జిల్లాలోని 15 బ్లాకులైన ఉసిలంపట్టి, వడిపట్టి, తిరుప్పరంకుండ్రం, తిరుమంగళం మరియు మదురై వెస్ట్ బ్లాక్‌లలో 1355 మంది శారీరక వికలాంగులతో కలిసి పనిచేస్తున్నారు .అముతశాంతి గారు ఆర్విఎ న్యూస్‌తో మాట్లాడుతూ.. ''పిల్లలకు జీవితానికి సంబంధించిన అన్ని విలువలను విద్యను నేర్పించాలి. “అందుకే నేను విద్య ద్వారా విలువను అందించే మార్గంగా చాలా గ్రామాలలో సాయంత్రం ట్యూషన్ను అందిస్తున్నాను. శారీరకంగా వికలాంగులైన ఈ మహిళలందరికీ నేను కుటుంబం యొక్క భావోద్వేగ భావాలను అందిస్తాను అని ఆమె అన్నారు.
భారత ప్రభుత్వం యొక్క చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, శ్రీ వజాహత్ హబీబుల్లాగారి చెడులమీదుగా డిసెంబర్ 12, 2008న, నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (PDP) ద్వారా హెలెన్ కెల్లర్ అవార్డు – 2008ని ఆమె అందుకున్నారు.మార్చి 07, 2009న, ఆమె మానవ సేవా ధర్మ సంవర్ధని, చెన్నై వారిచే సాధురు జ్ఞానానంద జాతీయ అవార్డు’ 09ని పొందారు.మార్చి 2019లో కవాసమ్ టెలివిజన బ్యాంక్ మేనేజర్ దీపక్ గారు పెన్ క్వీన్ అవార్డును ఆమెకు అందించారు.
"మరొక కొవ్వత్తికి వెలుగునివ్వడం ద్వారా ఒక కొవ్వత్తి తన వెలుగుని ఏమి కోల్పోదు" అని ఆమె చెప్పారు .
Add new comment