ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహం బెల్

ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహం బెల్  
గ్రహంబెల్ గారు 1847 మార్చి 3 వ తేదీన స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్ అనే ప్రాంతంలో జన్మించారు.ఆయనకు ఇద్దరు సోదరులు మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. ఆయన తల్లిదండ్రులు  ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే మరియు లీజా గ్రేస్ గారు.

గ్రాహంబెల్‌ గారి తాత గారు, తండ్రి  గారు వ్యక్తిత్వం, సంభాషణల విషయాలపై పరిశోధన చేస్తుండేవారు. ప్రాథమిక విద్యను తండ్రి వద్దే అభ్యసించిన గ్రాహంబెల్‌ ఎడింబరోలోని రాయల్‌ హైస్కూల్లో చదువుకుని, పదహారేళ్లకల్లా అక్కడే సంగీతం నేర్పించే పనిలో చేరారు . తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో  భావ వ్యక్తీకరణలో ఆరితేరారు. ఆమెతో ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని (Acoustics) అర్థం చేసుకున్నారు .

పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవారు . ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్‌ను కనిపెట్టగలిగారు . దీనిపై 1876లో ఆయనకు లభించిన బహుమానం అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది. ఆపై ఆప్టికల్‌ టెలికమ్యూనికేషన్స్‌, హైడ్రోఫాయిల్స్‌, ఏరోనాటిక్స్‌ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశారు  . నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రాహంబెల్‌ కూడా ఒకరు.

1880 వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రధానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నారు. గ్రహంబెల్ గారిని   చాలామంది టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నా ఆయన వివిధ రంగాలలో ఆవిష్కరణలు చేసారు

Add new comment

9 + 0 =