అమలోద్భవిమాత మహోత్సవం

మరియ అనే పదానికి హిబ్రూ భాషలో “సముద్రపు నక్షత్రం” అని అర్థం. గలిలీయ ప్రాంతంలోని నజరేతు  గ్రామంలో మరియ నివసించారు. తండ్రి పేరు జ్వాకీము తల్లి పేరు అన్నమ్మ, అన్నమ్మకు 20సం||ల ప్రాయంలో జ్వాకీంతో వివాహమైంది. పుణ్యదంపతులుగా గడిపారు. పెండ్లి అయిన అనేక సంవత్సరాల తర్వాత వారి ముసలి ప్రాయంలో మరియ జన్మించారు. సంతాన ప్రాప్తికై వారు చేసిన ప్రార్థనలు, త్యాగకృత్యాల ఫలితమే ఈ పాప. చిన్నప్పుడే ఆమెను దేవునికి కానుక చేశారా పుణ్యాత్ములు. దేవుడైన యావే పట్ల, పూర్వ వేద పఠనంపట్ల ఆమెకు ఆసక్తి ఉండేటట్లు పెంచబడ్డారు. అందుకే మరియ యుక్తవయస్సు వచ్చినప్పుడు తన జీవితాంతం కూడా దైవార్పితమైన కన్యగానే ఉండిపోవాలని ప్రమాణం చేశారు. ఇదంతా క్రీస్తు పూర్వపుమాట.

అయితే సమయం పరిపక్వమైనప్పుడు తండ్రియైన యావే “కన్య గర్భం ధరించి కుమారుని కనును” అను వేదాల్లోని వాక్యం నెరవేరునట్లు నిత్యం తనను జనించే ప్రేమ అనే జనితైక పుత్రుని ఏసుక్రీస్తుగా ఈ లోకానికి పంపాల నిశ్చయించారు. అంతెందుకు పూర్వం యావే దేవడు, ప్రవక్తల వాక్కులన్నీ సాకారమై మానవరక్షణ జరగాల్సి ఉంది. యేసు సిలువ మరణానంతరం కూడా ఆయమ్మ ప్రభు శిష్యుల్ని ఏకత్రాటిపై నడిపింది. 

గదిలో ప్రార్థిస్తుండగా అందరూ పవిత్రాత్మను పొంది రక్షణ సువార్త ప్రచారానికి శ్రీకారం చుట్టడంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. లోకమాతగా రక్షణమాతగా మరియ తాను పోర్చుగల్ లోని ఫాతిమా పట్టణంలో ముగ్గురు పిల్లలకు దర్శన మైనప్పుడు తాను “జన్మపాపం లేకుండా జన్మించిన రాణినని" స్వయంగా పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని 9వ పయస్ (భక్తినాథ) పోపుగారు 1854 డిసెంబరు 8న “మరియ నిష్కళంకిణి" అని అధికార పూర్వకంగా వెల్లడించారు.

Add new comment

1 + 2 =