SAINT OF THE DAY - March 24 స్వీడనుదేశ పునీత కేతరీనమ్మ|ST. CATHERINE OF SWEDEN

@pjsri

(పునీత బ్రిజీతమ్మగారి కుమార్తె, బ్రిజేతగారి మఠ తొలి మఠశ్రేషురాలు, క్రీ||శ|| 1331-1381). స్వీడను దర్శించే ఏ యాత్ర కులకైనా ముందుగా తెలిసేది అక్కడ మధ్యయుగంలో జన్మించిన గొప్ప క్రైస్తవ మత సన్యాసిని, పునీత బ్రిజేతగారిగూర్చే. బ్రిజీటైను మఠకన్యలసభ ఇక్కడ గొప్ప ప్రభావంచూపింది. బ్రిజీతగారు గొప్ప క్రియాశీలనాత్మక వ్యక్తి. తప్పుచేస్తే సరి వారు పోపుగారైనా, మహారాజైనా లెక్కలేదు. 

బుద్దిచెప్పి తీరుతారు. వీరొక ఇంజనీరు కూడాను. గృహనిర్మాణశాస్త్రంలో వాద్ సైనా నగరంలో తనకంటూ ఒక ప్రసిద్ద ముద్రకలవారు ఈ బ్రిజీతమ్మగారు. వీరి అద్భుత శిల్పకళావైభవానికి ప్రతీక స్వీడనులోని నీలిదేవాలయం. పునీత కేతరీనుగారు కూడ తల్లి అడుగుజాడల్లో నడిచిన గొప్ప పునీతురాలు. స్వీడను రాకుమారుడైన ఉల్ఫ్ గుడ్ మార్సను, పునీత బ్రిజీత దంపతులకు కలిగిన 8మంది సంతానంలో నాలుగవ సంతానమే ఈ కేతరీను. వీరు రైజ్బెర్లు వద్దనున్న కాన్వెంటులో విద్యాభ్యాసంగావించారు. తన తండ్రి ఆదేశానుసారం వీరు తన 14వ ఏటనే వివాహం చేసుకున్నారు. భర్త జర్మనీ దేశానికి చెందినవారు. పేరు ఎగ్గరు. ఈయన ధనికుడేకాక విద్యావంతుడు. గొప్ప భక్తిపరుడు. 

ఈ దంపతులిద్దరూ ఒకరికొకరు చెప్పుకొని అంగీకరించి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలని నిశ్చయించుకున్నారు. కేతరీను తానొక మఠకన్యలాగానే విశుద్ధ జీవితం జీవించారు. కొంతకాలం తర్వాత తన భర్త ఎగ్గర్లు చనిపోవడంతో వితంతువైన కేతరీనుగారు ఇటలీ దేశంలోని రోమునగరంలో ఉన్న తల్లి బ్రిజీతగారి వద్దకు చేరుకున్నారు. 1344లో వితంతువైన తన తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ వారు రోమునగరంలో నిర్వహించే భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లిగారు ఒనరించే దానధర్మాలు, జప తపాలు పరిశుద్ద ఆథ్యాత్మిక జీవిత సాధనలో సేవలందిస్తూ సహాయకారిగా ఉన్నారు. తననుతాను సానబెట్టుకుని మేలిమి బంగారంలా కేతరీను నిగ్గుతేలారు.

క్రీ||శ|| 1372లో తల్లీబిడ్డలైన పునీత బ్రిజేత, కేతరీనుగారలు కలసి ఏసుప్రభువు శ్రమలు అనుభవించిన, కలువరిగిరి అనబడు యెరూషలేము (పాలెస్తీనా) పవిత్ర భూమికి తీర్థయాత్రగా సందర్శించి, ఆ ప్రభుని మనసారా వేడుకొని ధ్యానించి వచ్చారు. వారి హృదయాలు నూతనుత్తేజంతో వెలుగొందాయి. ఈ పునీతులిద్దరు కలసి రోజుకు కనీసం నాలుగు గంటలపాటు ప్రభు శ్రమలైన పద్నాలుగు స్థలాలను ధ్యానించి ప్రార్థించేవారు. మరో రెండు సంవత్సరాల తర్వాత వీరితల్లి పునీత బ్రిజీతమ్మగారు క్రీ||శ|| 1373లో పరమపదించారు. 

కేతరీను తల్లి భౌతికకాయాన్ని తీసికొని వారి జన్మస్థలమైన స్వీడనుదేశంలోని 'వాద్ సైనా' పట్టణంకు వచ్చారు. అక్కడ బ్రిజీతమ్మగారే స్థాపించిన రక్షకుని సభ కాన్వెంటు ఆవరణలో భూస్థాపితం చేయించారు. ఆ తరువాత కేతరిన్గారు తన ప్రార్థనా జీవితం తన యోగ్యతవల్ల తమ తల్లిగారు నెలకొల్పి నిర్వహించిన రక్షకునిసభ కాన్వెంటుకు మఠ శ్రేష్ఠురాలమ్మ అయ్యారు. తన అనుభవంతో ఎంతోనేర్పుగా ఓర్పుగా ఆ మఠాన్ని పాలించారు. 6వ అర్బను పోపుగారి ద్వారా తమ మఠం యొక్క కడపటి గుర్తింపును కూడ పొందారు. క్రీ.శ. 1381 మార్చి 24న స్వీడనుదేశ కేతరీనుగారు దేవునియందు శాశ్వతంగా నిద్రించారు. వీరు తమ జీవితకాలంలో ‘ఆత్మ ఊరడింపులు' అనే శీర్షికతో పుస్తకం వ్రాశారు.

కాని ఆ ప్రతి ఇప్పుడు ఎక్కడా లభ్యం కావడంలేదు. కేతరీనుగారి క్రీస్తు విశ్వాసం మఠ శ్రేషురాలమ్మగా శ్రీసభకు ఒనరించిన సేవలకుగాను క్రీ|| శ|| 1484-92లో గల 8వ ఇన్నోసెంటు పరిశుద్ద పోపు గారిచే పునీతురాలుగా ప్రకటింపబడ్డారు. గ్రీకు పదమైన కేతరీన అంటే పరిశుద్ద, పవిత్ర, నిర్మల అని అర్థం.


Queen and widow, daughter of Saint Bridget (1322-1381)Saint Catherine was the daughter of Saint Bridget of Sweden and of Ulpho, Prince of Nericia, a region of the same land. The love of God seemed to hasten in her the use of her reason, and at seven years of age she was placed in the convent of Risburgh, to be educated in piety under the care of the holy abbess of that house. 

Being very beautiful, she was promised by her father in marriage to a young nobleman of great virtue; but the virgin persuaded her suitor to join with her in making a mutual vow of perpetual chastity. Listening to her discourses, the young man became desirous only for heavenly graces, and, to draw them down upon his soul in greater abundance, he readily acquiesced to the proposal. The happy couple, having but one heart and one desire, by a holy emulation encouraged each other to prayer, mortification, and works of charity.

After the death of her father, Saint Catherine, out of devotion to the Passion of Christ and to the relics of the martyrs, obtained her spouse's permission to join her mother in her well-known pilgrimages and practices of devotion and penance in Rome. She went to her there and they visited the tombs of the martyrs and the churches, and together practiced mortification and works of piety, caring for the sick in the hospitals. Not long afterward, Catherine's royal spouse died piously and then she found herself obliged to refuse numerous requests for her hand in marriage. 

When her mother died in 1373, she returned to Sweden, taking the mortal remains of Saint Bridget with her for burial. Catherine entered a monastery at Vatzan, where after a life of severe penance, she died on the 24th of March in 1381. For the last twenty-five years of her life Saint Catherine had purified her soul daily by the sacramental confession of her sins.
#like #share #comment

Add new comment

1 + 0 =