SAINT OF THE DAY - March 23 పునీత తొరిబియో దె మొగొవెజ్ | St.Turibius of Mogrovejo

@pjsri

(లాయరు, ప్రొఫెసరు, లిమా పీఠాధిపతి,మతసాక్షి ) స్పెయిన్ దేశంలో మయోర్గాలో పునీత తొరిబియో అల్ఫోన్సో దె మొగ్రోవెజోగారు క్రీ||శ|| 1538లో పుట్టారు. వీరినే తురిబియసు దే మొగొబెజొ అని కూడా పిలుస్తారు. వారు న్యాయశాస్త్రంలో ప్రవీణుడై సుప్రసిద్ద లాయరుగా పేరొందారు. అట్లే సలమంకా యూనివర్శిటీలో ప్రొఫెసరుగా కూడా పనిచేశారు.క్రీ||శ|| 1575లో 2వ ఫిలిప్పు చక్రవర్తి తొరిబియోగార్ని గ్రనడా నగర న్యాయస్థానంకు ప్రధాన న్యాయమూర్తిగ నియమించారు. వారు తమ లౌకిక బాధ్యతలు నిర్వహిస్తున్నా భక్తి విశ్వాసాలు ప్రదర్శించేవారు. మూడు సం||లు తర్వాత వారు తమ ఉద్యోగాలన్నింటిని విడిచి పెట్టి దైవ, మానవ సేవ నిమిత్తం ఒక క్రైస్తవ గురువుగా మారారు. వీరి ప్రజ్ఞాపాటవాలు దేవుని పై ప్రత్యేక భక్తి ప్రపత్తులను బట్టి పెరులోని లిమా పీఠానికి ఆర్చిబిషప్పుగా క్రీ||శ|| 1580లో వారి పేరు ప్రకటింపబడింది. 

“పెరు' కూడా ఆ రోజుల్లో స్పెయినుదేశంతో కలసి ఉండేది. 1581లో వారు ఆర్చిబిషప్పుగా అభి షేకితులై లిమాపీఠంకు చేరుకున్నారు. ఏడాది తిరగకుండానే జాతి వివక్షతను చూపుతున్న లౌకిక పాలకులతో జగడమాడాల్సి వచ్చింది. పెరులోని రెడ్ ఇండియనులు పట్ల వివక్ష చూపబడి తెల్ల వారిచే కించపరచబడటం వారు సహించలేదు. మానవులందరు దేవుని బిడ్డలైనప్పుడు అసలు వివక్షతలెందుకని నచ్చజెప్పచూశారు. వారి హక్కులను కాపాడవలసిందిగా పాలకులను కోరారు. తాము పాలించిన 26 సం||లలో విశ్వాస వ్యాప్తికోసం నమ్మలేనంత గొప్పగా కృషి ఒనరించారు. శ్రీసభ క్రమశిక్షణ పునరుద్దరించారు. పేదల సౌకర్యాలకోసం పోరాడారు. 

లెక్కలేనన్ని దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించి పేదసాదలనాదు కున్నారు. క్రీ||శ|| 1591లో అక్కడ గురుశిక్షణకోసం ఒక అమెరికన్ సెమినరీని స్థాపించారు. అక్కడి రెడ్ ఇండియనుల నాయకులతో తరచు మాట్లాడి వారికి సహాయ సహకారలనందించేవారు. దాన ధర్మాలకు వారు పెట్టింది పేరు. కష్టాల్లో ఉన్నవారిని తప్పక దర్శించి తగు సాయమందించి ఓదార్చేవారు. మేత్రాసనంలోని ప్రతి ప్రదేశానికి వారు తిరిగారు. కాలినడకనే వారు దాదాపు 50 వేల మైళ్లు నడచి ఉంటారు. జనన మరణ లెక్కలు, జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగంలు నిర్వహిస్తూ తీరికలేకుండా ఉండేవారు. తండ్రి దేవుని కృపలను నమ్ముకోమని ప్రతిఒక్కరికి బోధించేవారు. 

ఆండిసు పర్వతాల్లో ప్రమాదాలు పొంచియుంటాయని కొందరు తొరిబియో గార్ని హెచ్చరించినప్పుడు వారు “మనుష్యుల్ని రక్షించడానికే స్వర్గం వీడి క్రీస్తు ప్రభువు వచ్చారు. వారి మహిమకోసం ఇక ఎలాంటి ప్రమాదానికైనా వెనుదీ సేదిలేదు” అని అన్నారు. వారు తమ అపోస్తోలిక సేవలో సత్యం యెడ ప్రేమ, శ్రీసభ వ్యాపకం యెడల ఆసక్తి, దైవ ప్రజల అభివృద్ది యెడల కృషితో పనే ప్రార్థనగా దేవునికరించు కొని క్రీ||శ|| 1606 మార్చి 23న తమ 68వ ఏట ఇహలోక జీవితయాత్రను ముగించారు.

“పెరు” దేశంలోని శాంతాపట్టణంను సందర్శించి లిమా పట్టణంకు తిరిగు ముఖం పట్టి మార్గ మధ్యమంలో పరమపదించారు. వారు క్రీ||శ|| 1726లో పునీత పట్టాతో సత్కరింపబడ్డారు. ఈ సందర్భంగా 13వ బెనడిక్టు పోపుగారు ఈ పునీతుని అర్పణ జీవితంను బహుగా కొనియాడారు. అనగా తేజస్సు ప్రకాశం, గొప్ప జ్యోతి అని అర్థం.


(November 16, 1538 – March 23, 1606) Bishop and defender of the rights of the native Indians in Peru, Born in Mayorga, Spain, he studied law and became a lawyer and then professor at Salamanca, receiving appointment-despite being a layman-as chief judge of the court of Inquisition at Granada under King Philip II of Spain. The king subsequently appointed him in 1580 to the post of archbishopof Lima, Peru. After receiving ordination and then consecration, he arrived in Peru in 1581 and soon demonstrated a deep zeal to reform the archdiocese and a determination to do all in his power to aid the poor and defend the rights of the Indians who were then suffering severely under Spanish occupation. 

He founded schools, churches, hospitals, and the first seminary in the New World. To assist his pastoral work among the Indians, he also mastered several Indian dialects. He was canonized in 1726.#like #share #comment

Add new comment

12 + 2 =