SAINT OF THE DAY - March 20 పునీత కుత్ బెర్టు|ST. CUTHBERT

@pjsri

(బిషప్, బ్రిటన్ అద్భుతకరుడు, మతసాక్షి క్రీ||శ|| 635-687) పునీత కుత్ బెర్డుగారు మావాడు అని ఐర్లండు,స్కాట్లాండు, ఇంగ్లాండు దేశస్తులు వాదిస్తుంటారు. అయితే పునీత బెడెగారు (మే-25 చూడండి) చెప్పిన ప్రకారమైతే వారు బ్రిటనులోని ఉంబ్రియా మండలంలో ఉత్తరప్రాంతానికి చెందినవారు. మంచి క్రైస్తవ కుటుంబంలో క్రీశ 635లో పుట్టారు. కాని వారి బాల్యదశలోనే తల్లిదండ్రులు చనిపోవుటవల్ల అనాథగానే పెరిగారు. 

కొంతకాలం గొర్రెలకాపరిగా పనిచేసి జీవనం గడిపారు. మెర్నియా రాజ్యపాలకుడైన పెండారాజు తమ ఉత్తర ఉంబ్రియా రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు తమ దేశం తరపున కుత్బెర్డుగారు యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. దీనినే “విన్ విడ్ ఫీల్డ్ యుద్ధం” అంటారు. యుద్ధం ముగిసి శాంతి ఏర్పడ్డాక కుత్బెర్జుగారిలో వైరాగ్యం విజృంభించింది. తానొక క్రైస్తవ గురువై దేవుని భటుడు కావాలని ఆశించారు. బాల్యంలో తాను ఊహించినట్లుగానే మెల్ రోస్ మఠంలో ప్రవేశించి గురువుగా అభిషిక్తులయ్యారు.

దేవుడు వారియందు అనేక అద్భుత ప్రదర్శనలు చేశారు. పవిత్రత, జ్ఞానసముపార్జనతో వారు తమ గురుత్వ సేవలందించారు. క్రీIIశII 661లో రైపొను పట్టణంలో ఒక క్రొత్త మఠాలయం తెరువబడింది. దీనికి అధిపతిగా పునీత ఈటగారు సేవలందిస్తున్నారు. వారువచ్చి ఫాదర్ కుత్బెర్డుగార్ని వెంటబెట్టుకొని వెళ్లి తమ మఠంలో గురు అతిథిగా ఉంచారు. కొన్నేళ్లు అక్కడగడిపారు. 

అయితే ఆ మఠంలో ఈస్టరు పండుగ జరుపుతేదీని నిర్ణయించడంలో సెల్టిక్ అర్చనాకాండ స్థానంలో రోమను తరహా అర్చనాకాండ ప్రవేశ పెట్టబడింది. ఇందుకు అసంతృప్తులైన కొందరు గురుసన్యాసులతో కలసి కుత్బెర్జుగారు తిరిగి స్వంత మఠం మెల్ రోస్ కు చేరుకున్నారు. వైట్బై నగరంలో జరిగిన సినడ్ క్రైస్తవ సమావేశాల్లో కూడా రోమను ఆచారాన్నే శ్రీసభ అంతటా పాటించాలని క్రీశll 664లో నిర్ణయం తీసుకోబడింది.

అందువల్ల కుబేరుగారునూ అందుకు శిరసావహించారు.మెల్రోజులోని మఠాన్ని అల్క్ షైడ్రాజు పునీత విల్ఫ్రెడ్ మఠంగా పేరు మార్చారు. తానే దానికి అధినేతగా నియమితులయ్యారు. కుత్ బెర్జుగార్ని మఠంలో చేర్చుకొన అంగీకరించలేదు. కాని వారు తమ సువార్తా సేవనే చేసుకుంటూ జీవిస్తుండగా తోడి గురువైన పునీత కో(త)మన్గారు వైబ్బైలో తీసుకోబడిన నిర్ణయాన్ని అనగా రోమను అర్చనాకాండ విధానంను వ్యతిరేకించి చాలామంది గురువులను వెంటబెట్టుకొని లిండిస్సైను గురు మండలం విడిచి పెట్టి ఐర్లాండు వెళ్లిపోయారు. 

పోతూపోతూ తన స్థానంలో పునీత ఈటాగార్ని బిషప్పుగా నియమింప జేసి పునీత కుత్బెర్జుగార్ని లిండిస్ ఫ్రను విచారణ గురువుగా ఏర్పరుపజేసి వెళ్లారు.
ఫాదర్ కుత్బెర్డుగారు తిరిగి నూతన ఉత్సాహం పుంజుకొని తమ ఓపిక తెలివితేటలతో క్రైస్తవులందరిని ఒక త్రాటిపైకి తీసికొని వచ్చారు. తమ పరిశుద్ధత, ఆదర్శజీవితం ద్వారా వారిని బాగా ఆకట్టుకున్నారు. సెల్టిక్ ఆచారాన్ని పట్టుకు వ్రేలాడుతున్న వారిని కూడా క్రమంగా నూతన రోమను అర్చనా విధానానికి అలవాటు చేశారు. శ్రీసభకు విధేయులుగా నుండ జేశారు. 

ఇది చూసిన మెల్రోజు మఠాధిపతి కుత్బెర్జుగార్ని తిరిగి మఠంలోకి చేర్చుకున్నారు. ఫాదర్ కుత్ బెర్డుగారు దాపులోని ఒక ద్వీపంలో విశ్రాంతితో, ధ్యానంలో నిమగ్నం కావాలని తలంచారు. కాని దైవం వేరుగా తలంచారు క్రీIIశll 685లో కాంటర్బరీ ఆర్చిబిషప్పుగారైన పునీత థియోడోరుగారి హస్తాలుమీదుగా కుత్బర్జుగారు లిండిస్ ఫెర్న్ పీఠానికి బిషప్పుగా అభిషేకింపబడ్డారు. 
తమ శ్రమతో ప్రార్థనతో ఆశీర్వాద ఫలాలతో తమ విశ్వాసుల్ని పవిత్ర పరుస్తూ ఒక ఏడాదిపాటు మాత్రం తమ అవిరళ సేవలందించారు. తన మరణం ఇంకా కొద్దిమాసాలే ఉందని గ్రహించిన వారు తమ పదవికి రాజీనామానిచ్చారు. రోగులను ముఖ్యంగా ప్లేగు అంటువ్యాధి బారిన పడినవారిని బిషప్పు కుత్ బెర్డుగారు ఆశీర్వదించగా స్వస్థపర్చబడ్డారు. ఇలా స్వస్థతావరంతోను, ప్రవచనాలు చెప్పేవరంతోను దీవింపబడ్డ వీరు క్రీIIశll 687లో ప్రభువునందు శాశ్వతంగా నిద్రించారు.

పునీత కుబెశీల్దీగారు 'ఇంగ్లాండుదేశ అద్బుతకరుడు' అని ప్రసిద్దిచెందారు. దుర్హాము కేథెడ్రలులో వీరి భౌతికకాయం భద్రపరచబడింది. భక్తులు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు మరణించిన 400 సంవత్సరాల తర్వాత వారి సమాధి తెరచిచూడగా వారి శరీరం ఎలాంటి దుర్వాసనలేక శిథిలంకాక యథాతధంగా ఉండటం గొప్పవిశేషం. వారు వాడినకొన్ని అవశేషాలు 8వ హెన్రిచేసిన దాడిలో కొన్ని కనబడకుండా పోగా, కొన్ని బెనెడిక్టియను సభకు చెందిన నలుగురు గురువులు భద్రపరచారు. పునీత కుత్బెర్జుగారు ఓడ ప్రయాణీకుల పాలక పునీతులుగా శ్రీసభచే ఏర్పరుపబడ్డారు


Cuthbert was thought by some to be Irish and by others, a Scot. Bede, the noted historian, says he was a Briton. Orphaned when a young child, he was a shepherd for a time, possibly fought against the Mercians, and became a monk at Melrose Abbey.In 661, he accompanied St. Eata to Ripon Abbey, which the abbot of Melrose had built, but returned to Melrose the following year when King Alcfrid turned the abbey over to St. Wilfrid, and then became Prior of Melrose. Cuthbert engaged in missionary work and when St. Colman refused to accept the decision of the Council of Whitby in favor of the Roman liturgical practices and immigrated with most of the monks of Lindisfarn to Ireland, St. Eata was appointed bishop in his place and named Cuthbert Prior of Lindisfarn. 

He resumed his missionary activities and attracted huge crowds until he received his abbot's permission to live as a hermit, at first on a nearby island and then in 676, at one of the Farnes Islands near Bamborough. Against his will, he was elected bishop of Hexham in 685, arranged with St. Eata to swap Sees, and became bishop of Lindisfarn but without the monastery. He spent the last two years of his life administering his See, caring for the sick of the plague that decimated his diocese, working numerous miracles of healing, and gifted with the ability to prophesy. He died at Lindisfarn.

Add new comment

18 + 0 =