SAINT OF THE DAY - March 19 పునీత జోజప్ప|ST. JOSEPH

@pjsri

మనుష్యావతారమెత్తిన ఏసుకు, మేరీమాతకు సంరక్షకుడుగా బాలయేసుకు సాకుడు తండ్రిగా భక్త జోజప్పగారి గురించి సువార్తలు వెల్లడిస్తున్నాయి. కాని వారు మాత్రం సువార్తల్లో ఎక్కడా ఒక మాటైనా మాట్లాడినట్లు లేదు. వారియొక్క ప్రవర్తన, చేసేపనిని నిర్వర్తించడం బట్టి. దైవాదేశాలను పాటించడంబట్టి వారెలాంటివారో అంచనా వేసుకోవచ్చు. గొప్పవిశ్వాసం, విరకత్వం విధేయత శ్రమైకజీవితం, బాధ్యతాపాలన, వివేకం, వివేచనం, మితవ్యయం, మితభాషిత్వం, అమాయకత్వం, తనను తాను తగ్గించుకొనడం, దయ దానధర్మ గుణం, దిక్కులేనివారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, నిగర్వం, నిశ్చలత, నిరాడంబరత్వం ఇలా మంచిగుణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహామనిషి.

వునీత మత్తయి, వునీత లూకా సువార్తలను బట్టి జోజప్పగారు “న్యాయవర్తనుడు” గొప్ప నీతిమంతుడు అని తెలుస్తుంది. అప్రమాణికసువార్తలు, చారిత్రక సంఘటనల ప్రకారం, జోజప్పగారు చాలా పెద్దవాడుగా ఉన్నప్పుడు కన్యమరియాంబతో ప్రధానం జరిగిందని తెలుస్తోంది. అప్పటికి ఆయమ్మ వయస్సు 14 యేండ్లు ఉండవచ్చు. గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మరియమ్మగారి అందించకమునుపే ఈ నిశ్చితార్థం జరిగింది.
పునీత జోజప్పనే యోసేపు, జోజేపు, జోసపు అని కూడ పిలుస్తాం. వీరు బెల్లె హేములో జన్మించారు. ఏసుక్రీస్తు వారు తమ సువార్త ప్రచారం మొదలు పెట్టకమును పే నజరేతు గ్రామంలో క్రీ||శ|| 20లో ఏసు మరియల హస్తాలో వ్రాలి తమ వయోభారంతో పరిశుద్ద సహజమరణం పొందినట్లుగా తెలియవస్తుంది.

జోజప్పగారు మంచి బాధ్యతగల జ్ఞానభర్తగా, మంచి సాకుడుతండ్రిగా అత్యుత్తమ బాధ్యతాయుత సంరక్షకుడుగా సువార్తలవల్ల మనం గ్రహించకలుగుతాం. మత్తయిగారి ప్రకారం ఏసుక్రీస్తు వంశావళి (మ. 1:17)లో అబ్రహామునుండి దావీదు వంశంవరకు జోజప్పగారి ముందు తరాల పేర్లు ఇవ్వబడినాయి. అయితే జోజప్పగారికి మరియమ్మగారితో వివాహానికి నిశ్చితార్థం జరిగాక వారు సంసారపక్షంగా కాపురం చేయకముందే మరియమ్మ గర్బవతికావడం జోజప్పగార్ని కలచివేసింది. 

ఆయమ్మను నొప్పింపక అవమానింపక రహస్యంగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్లు (మ. 1:19) చెప్పబడి ఉంది. ఇక్కడ జోజప్పగారి గంభీర వ్యక్తిత్వం ఘర్షణ ధోరణిలేని సాధుత్వం. పుట్టుకతో వచ్చిన సహజ పాపభీతి ప్రస్పుటంగా కన్పిస్తాయి. పిమ్మట ప్రభువు దూత మాటప్రకారం మారుమాటాడక మరియను చేర్చుకున్నారు. ఇక్కడేవారు తమ బాధ్యత విధేయత పరిశుద్దతకు పూర్తిగా లోబరచుకుని దైవాజ్ఞను తు.చ. తప్పక పాటించారు. 

ఇదే వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత. అప్పటి నుంచి దైవచిత్తాన్ని ఎరిగి, దాన్ని ఆచరింప నడుంకట్టారు. ఒకవైపు దేవుని తల్లి కాబోతున్న కన్యమరియాంబ వ్యక్తిత్వానికి ఏమాత్రం గౌరవభంగం కాకుండా పేరుకు మాత్రం భర్తగాను, వాస్తవానికి తన పరిధిలో సంరక్షకుడుగా, సహాయకుడుగా, సేవకుడుగా, సంద్భక్తుడుగా తనను తాను మలచుకున్నారు. మరోవైపు దివ్య బాలయేసుకు తండ్రి కాకున్నా లోకం దృష్టిలో అపార్థం రాకుండా ఆనవాయితీగా సాకుడు తండ్రిగా దేవుని ఏర్పాటుకు తలొగ్గి దైవబాలుని దీనతతో పెంచారు, శ్రమించారు, ఆదాధించారు, ఆనందించారు. 

తన జీవితాన్ని ఈ రెండు అంశాలకే అనగా సంరక్షకుడు, సాకుడుతండ్రిగా పూర్ణాంకితం గావించుకున్న ఋషిపుంగవులు వీరు. దేవునికి అర్పించుకున్న ప్రతివ్యక్తికి ఆదర్శనీయులు వీరు. పాలక పోషకులునూవీరే. అగస్తు చక్రవర్తి జనాభాలెక్కల విషయమై తనరాజ్య ప్రజలు వారివారి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా అనుజ్ఞనివ్వగా (మ. 2:1) దావీదు వంశస్తుడైన జోజప్ప గారు నిండుచూలాలు మరియాంబను ఒక గాడిదపై కూర్చుండబెట్టి, తాను నడుస్తూ, అతిజాగ్రత్తతో ఆ కొండలు, గుట్టలు, ఎడారినేలలు దాటుతూ నజరేతునుండి వందలకొలది మైళ్లు ప్రయాణించి బెల్లె హేము చేరుకున్నారు. మరియాంబను కన్నకూతురులా పొదివి పట్టుకుని తిరుగాడుతూ తలదాచుకొన స్థలంకోసం అక్కడి ఇళ్లవారిని బ్రతిమాలుకున్నారు. ఆఖరుకు పశువుల కొట్టమైనా దొరికినందుకు సంతృప్తిపడి గబగబ దాన్ని శుభ్రపరచి ఆయమ్మ సుఖ ప్రసవానికి తాను చేయగల్గిన మనంతాచేశారు. గొల్లలువచ్చినప్పుడుగాని, జ్ఞానులువచ్చినప్పుడుగాని వారు విలువైన బహుమానాలిచ్చినప్పుడుగాని అక్కడి పరిస్థితులనుబట్టి జోజప్పగారే వారందరితో తగు విధంగా వ్యవహిరించి ఉండవచ్చు.

బాబుకు ఎనిమిది దినాలు గడిచిన తరువాత సున్నతిగావింపజేసి 'ఏసు' అని పేరు పెట్ట బడింది. అలాగే మోషే చట్టప్రకారం నలభై దినాలప్రాయంలో బాలయేసును దేవాలయంలో అర్పించే నిమిత్తం మరియతోసహా యెరూషలేము దేవాలయానికి వెళ్లారు. అక్కడ దైవభక్తుడైన సిమియోను, ప్రవక్తి అన్నమ్మల ప్రవచనాలు, ధన్యతామాటలు జోజప్పగారు చెవులారా విని ధ్యానించారు. పిమ్మట ప్రభువుదూత పలుకులను శిరసావహించి హేరోదురాజు శిశుహత్యలకు వెరచి తల్లీ బిడ్డలను సురక్షితంగా ఈజిప్టుకు చేర్చారు. ఆ తర్వాత కొండమీద నిర్మితమైన నజరేతుగ్రామం చేరుకొని జీవనం కొనసాగించారు. ఈ దూర ప్రయాణాల్లోని వ్యయప్రయాసలన్నీ తాను ప్రేమించే దేవునికోసం భరించారు. జోజప్పగారి ఓర్పు, ఔదార్యం, దీనత, చురుకుదనం, జ్ఞానదృఢం వర్ణింపనలవికానివి. బాలునికి విద్య, వృత్తిపని నేర్పించడంలో మరియమ్మ గారితో పాటు తనవంతు కృషి సల్పారు.

ఏసుకు పండ్రెండేడ్ల ప్రాయమప్పుడు మరియమ్మగారు జోజప్పగారు ఆ దివ్యబాలుని తీసుకొని పాస్కపండుగ కొనియాడటానికి యెరూషలేము వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పురుషులగుంపు ముందు నడుస్తుండగా స్త్రీలగుంపు వెనుక నడచుకుంటు వస్తున్నారు. బాలయేసు తండ్రితో ఉన్నాడని తల్లి, తల్లితో ఉన్నాడని తండ్రి అనుకొని ఒకమజిలీకి చేరుకున్నాక బాలుడు తమ ఇద్దరితోను లేడని గ్రహించి కలతచెందారు. ఆవేదనపడ్డారు. ఆతృతతో వెనుకకు వెళ్లి వేదపండితులను తన ప్రజ్ఞతో దైవసత్యాలను వెల్లడించి, విస్మయపరుస్తున్న బాలయేసుని కనుగొన్నారు. మరియమాతతో పాటు ఆ కలవరాన్ని తానూ పంచుకున్నారు. ఒక భర్తగా, ఒక తండ్రిగా సంరక్షణ బాధ్యతకు న్యాయంచేశారు. ఇంత వరకే సువార్తల ప్రకారం చరిత్ర ఉంది.

ఎసుబహిరంగ జీవితం ప్రారంభించకముందే జోజప్పగారు సుమారు క్రీ||శ|| 20లో స్వర్గస్తులై యుండవచ్చు. వీరి ఉత్సవాన్ని మాత్రం నాలుగో శతాబ్దంనుండే జరుపు కుంటున్నట్లు ఆధారాలున్నాయి. ముఖ్యంగా ఐర్లాండుదేశంలోను మధ్యయుగంలో యూరపులోను వారి పై అనేక పరిశుద్ధ కథలు చెప్పబడి వారి మధ్యవర్తిత్వాన ప్రార్థనలు ఆరంభమైనాయి. క్రీ||శ|| 1869-70లో జరిగిన మొదటి వాటికను మహాసభలో పాల్గొన్న 300 మంది పీఠాధిపతులు కోరిక పై 9వ పయస్ (భక్తినాధ) పోపుగారు పునీత జాజప్పగారిని విశ్వ శ్రీసభకు పాలక పోషకుడుగా ప్రకటించారు. శ్రీసభ ఆస్తిపాస్తులకు వారినే సంరక్షకులుగా ఏర్పరచారు. మార్చి మాసంలో గల అన్ని బుధవారాల్లో జోజప్పగారి ప్రార్థనలకై ప్రత్యేకంగా కేటాయించారు. క్రీ||శ|| 1955లో 12వ పయస్ (భక్తినాథ) జగద్గురువులు జోజప్పగారిని కార్మికుల పాలకులుగా బిరుదునిచ్చి గౌరవించారు. 

మంచి మరణాన్ని కోరుకునే వారందరూ పునీత జోజప్పగారిని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. “కొంతమంది పునీతులు వాళ్లప్రత్యేక కార్యసాధకతతో కొన్ని అవసరాల్లోనే వాళ్ల సహ కారిన్ని మనకందిస్తారు. కాని మన పవిత్రపాలకులైన భక్త జోజప్పగారు ప్రతి అవసరం, ప్రతిపనిలో అన్ని సందర్భాలలో మనకు సహాయంచేసే శక్తి కలిగి ఉన్నారు.” “పునీత జోజప్పగారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండాలేను. దీనిని నమ్మనీవారు పరీక్ష చేయవచ్చును. ఆ పరమ పితాపితృని గౌరవించుట ఎంతోమేలని తాముతెలుసుకొందురు” (పునీత తెరేసమ్మగారు). జోసెఫ్ అంటే కలుపుకొను, దేవుడు సమృద్ధిచేయును అని అర్థం.


Please Like Spouse of the Blessed Virgin, Virginal Father of Jesus and Patron of the Universal Church Saint Joseph was by birth of the royal family of David, but was living in humble obscurity as a carpenter, until God raised him to the highest office ever accorded a mortal man, by choosing him to be the spouse of the Virgin Mother, the virginal father and guardian of the Incarnate Word. Joseph, says Holy Scripture, was a just man. He was innocent and pure, as became the husband of Mary; he was gentle and tender, as one worthy to be named the father of Jesus; he was prudent and a lover of silence, as became the master of the holy house; above all, he was faithful and obedient to divine calls.

His conversation was with Angels rather than with men. When he learned that Mary bore within Her womb the Lord of heaven, he feared to take Her as his wife; but an Angel bade him put his fear aside, and all doubts vanished. When Herod sought the life of the divine Infant, an Angel told Joseph in a dream to fly with the Child and His Mother into Egypt. Joseph at once arose and obeyed. This sudden and unexpected flight must have exposed both him and his little Family to many inconveniences and sufferings; the journey with a newborn infant and a tender virgin was long, and the greater part of the way led through deserts and among strangers. Yet Saint Joseph alleges no excuses, nor inquires at what time they were to return.

Saint Chrysostom observes that God treats in this way all His servants, sending them frequent trials to clear their hearts from the rust of self-love, but intermixing with afflictions, seasons of consolation. It is the opinion of the Fathers that when the Holy Family entered Egypt, at the presence of the Child Jesus all the oracles of that superstitious country were struck dumb, and the statues of their gods trembled, and in many places fell to the ground. The Fathers also attribute to this holy visit the spiritual benediction poured on that country, which made it for many ages fruitful in Saints.

After the death of King Herod, of which Saint Joseph was informed in another vision, God ordered him to return with the Child and His Mother into the land of Israel, which our Saint readily accomplished. But when he arrived in Judea, hearing that Archelaus had succeeded Herod in that part of the land, and apprehensive that the son might be infected with his father's vices, he feared to settle there, as he would otherwise probably have done, for the education of the Child. Therefore, directed by God through still another angelic visit, he retired into the dominions of Herod Antipas in Galilee, and to his former habitation in Nazareth.

Saint Joseph, a strict observer of the Mosaic law, journeyed each year at the time of the Passover to Jerusalem. Our Saviour, in the twelfth year of His age, accompanied His parents. Having participated in the usual ceremonies of the feast, the parents were returning with many of their neighbors and acquaintances towards Galilee, and never doubted that Jesus was with some of the company. They traveled on for a whole day's journey before they discovered that He was not with them. But when night came on and they could find no trace of Him among their kindred and acquaintances, they, in the deepest affliction, returned with the utmost haste to Jerusalem. We are left to imagine their tears and their efforts to find Him. 

After an anxious search of three days they discovered Him in the Temple, discoursing with the learned doctors of the law, and asking them such questions as aroused the admiration of all who heard Him. His Mother told Him with what grief and earnestness they had sought Him and asked, Son, why have You dealt with us in this way? Behold, Your Father and I have searched for You in great affliction of mind.

The young Saviour answered, How is it that You sought Me? Did You not know that I must be about My Father's business? In this way Jesus encourages all young persons who are called to serve God to persevere in that high vocation, whatever the cost. But we are told that although He had remained in the Temple unknown to His parents, in all other things He was obedient to them, returning with them to Nazareth, and living there in all dutiful subjection to them.

As no further mention is made of Saint Joseph, he must have died before the marriage feast of Cana and the beginning of our divine Saviour's ministry. We cannot doubt that he had the happiness of the presence of Jesus and Mary at his death, praying beside him, assisting and comforting him in his last moments; therefore he is invoked for the great grace of a happy death and the spiritual presence of Jesus in that hour.

Add new comment

5 + 0 =