SAINT OF THE DAY - March 18 జెరుసలేంనగర పునీత సిరిల్ | ST. CYRIL OF JERUSALEM

@pjsri

(బిషప్పు, శ్రీసభ పండితుడు క్రీ||శ|| 315–386) పాలెస్తీనాలోని జెరుసలేం పట్టణంలో పునీత సిరిల్ ఒక క్రైస్తవ కుటుంబంలో క్రీIIశII 315లో జననమొందారు. జెరుసలేంలోనే విద్యాబుద్ధులు గడించారు. జెరుసలేం పీఠాధిపతియైన పునీత మాక్సిమనుగారి హస్తాలుమీదుగా పవిత్ర గురుపట్టాబి షిక్తులయ్యారు. క్రైస్తవ విశ్వాస ప్రబోధాన్ని సిద్దాంతాన్ని చిన్నచిన్న ప్రశ్నలు సమాధానాలరూపంలో సత్యోపదేశం పేరట ప్రజలకు నేర్పించిన మొట్టమొదటి గురువు సిరిల్గారే. విన్నవారెవరైనా ఒకసారి వింటే బాగా గుర్తుండి పోయేలా స్పష్టంగా, సులభంగా, సమగ్రంగా ఈ సత్యోపదేశాన్ని వీరు తయారుచేశారు.

ఈ విశ్వాస సుజ్ఞానాన్ని తరతరాలవరకు యుగయుగాలవరకు ఎంతమంది పిల్లలు, పెద్దలు నేర్చుకుని ధన్యులవుతారో చెప్పనలవికాదు కదా ! ఇది ఎల్లప్పుడు ఆధునికమైన బోధనా పద్దతిగా ప్రసిద్ధిచెంది శతాబ్దాల తరబడి నేర్పింపబడింది. నేర్వబడింది. ప్రతిగురువు ప్రతి విశ్వాసి ఈ సత్యోపదేశంవల్ల ఆధ్యాత్మిక శక్తిని, నూతనోత్సాహాన్ని పొందారు. ఇతరులకు ప్రతిభావంతంగా అందించి క్రీస్తు జ్యోతిని జగతికందించడంలో విజయులయ్యారు. 

ఈ సత్యోపదేశ స్వర్ణయుగ ఆరంభకులైన ఫాదర్ సిరిల్గారు ఎంతటి ధన్యులో కదా ! పీఠాధిపతి పునీత మాక్సిమనుగారి మరణానంతరం పునీత సీరిల్ గారే జెరుసలేంకు క్రీIIశII 349లో బిషప్పు అయ్యారు. గొప్ప ప్రార్థనా తత్పరులు అయిన బిషప్ సిరిల్గారు క్రీ||శ|| 351 మేనెల 7వ తేదీన ఒక దివ్యదర్శనాన్ని గాంచారు. అదేమంటే గొప్ప ప్రకాశవంత మైన పెద్దస్లీవ ఒకటి ఆకాశంలో ప్రత్యక్షమైంది. అది కల్వరి కొండ పైనుండి జరిగి ఓలివు కొండ పైకి వచ్చి స్థిరపడింది. ఇదిజరుగబోయే గొప్పదైవ కార్యానికి ప్రతీక అయ్యింది. 

అదే మంటే. క్రీ||శ|| 361లో జూలియన్ అనబడే చక్రవర్తి మూర్ఖుడుగా మారి జెరుసలేం పవిత్ర మహానగరంలో దబ్బర దేవుళ్లకై ఒక పెద్ద గుడిని కట్టించాడు. సువార్తమానానికి, క్రైస్తవ భక్తికి వ్యతిరిక్తంగా, జగడాన్ని పురికొల్పుతూ పిశాచి ఆవహించిన మూడుడులా ప్రవర్తించాడు. ఈ నిర్మాణఅంత్యదశలో దైవశాపం గొప్ప అగ్ని భూకంపం రూపంలో విరుచుకు పడింది. ఆ పెనుభూకంప తాకిడికి మంటల జ్వాలలకు ఆ దబ్బరగుడి ఆనవాలు లేకుండా కూలిపోయి సర్వనాశనమైపోయింది. కట్టుచున్నపని వాండ్రుకూడా ఒక్కడు మిగలకుండా భూమిలో శిథిలాలలో కూరుకుపోయి అగ్నికీలలకు మాడిమసై దుర్మరణంపాలయ్యారు. దేవుని ఓపికను పరీక్షించిన వారికి పట్టిన కఠిన శిక్షిఇడి. దుర్గతి ఇది. తన యీ అనుభవాన్ని పునీత సిరిల్గారు కాన్ స్టెన్షియస్ అను తరువాత కాల చక్రవర్తికి వ్రాసిన లేఖలో తెలియచేశారు.

శ్రీసభ సిద్దాంతానికి బలమైన సమర్థకుడుగా వీరెన్నో కష్టాలు, అవమానాలు భరించాల్సి వచ్చింది. ఆ దినాల్లో క్రీస్తు నరుడే కాని దేవుడు మాత్రం కాదు. ఆయనొక మహాపురుషుడు మాత్రమే అని 'ఎరియసు' అను వ్యక్తి ఏసు గొప్పవాడు. త్రిక దేవునిలో ఒక వ్యక్తి కాదని దబ్బర సిద్ధాంతం ముందుకు తెచ్చి క్రైస్తవ మతంలో చిచ్చు పెట్టాడు. శ్రీసభ వ్యతిరేక సిద్దాంతం ఉచ్చులో పడి ఎందరో గురువులు, బిషప్పులు వితండవాదులై పరిశుద్ద పోపుగారికి అవిధేయులయ్యారు. కొందరు చక్రవర్తులబాసట చేరి చిందర వందరయ్యారు. తమ పదవి, అధికారంకోసం పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాల్లో భాగంగానే జెరుసలేం పీఠాధిపతిగా ఉన్న పునీత సిరిల్గార్ని ఎరియను సిద్దాంతం నమ్మిన కైసరియా బిషప్పు అయిన 'ఎకాషియసు బహిష్కారం చేశాడు. ఆ విధంగా జెరుసలేంనగరం తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. 

కాని అది తాత్కాలికమే అయ్యింది.సిరిల్గారిపై విచారణకూడా జరుపబడింది. కాని సత్యమేజయించునుకదా ! విచారణ చేయుటకు వచ్చిన పునీత నిస్సా గ్రెగొరిగారు సత్యం తెలుసుకున్నారు. బిషప్ సిరిల్గార్ని జెరుసలేం పీఠాధిపతిగానే గుర్తించి ఇరువురూ కలసి క్రీIIశII 381లో కాన్స్టాంట్ నోపులులో జరిగిన క్రైస్తవ సార్వత్రిక మండలి (జనరల్ కౌన్సిలు) సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ నైసిను విశ్వాస ప్రమాణాన్ని ముఖ్యంగా తిత్వేక సర్వేశ్వరుని, దేవుడు నరుడు అయిన, ఆది మధ్యాంతరహితుడైన దేవునికి ప్రత్యక్షరూపమే ఏసుక్రీస్తు (కొలొ.1 15-20) అని నొక్కివక్కాణింపబడింది. సత్యోపదేశ పితామహుడు, సుజ్ఞానియైన బిషప్ సిరిల్గారు ఈ సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడారు. తన సాక్ష్యం విన్పించి ఏరియన్ సిద్దాంతాన్ని దీటుగా ఎండగట్టారు.

పుసీత సిరిల్ తమ 71వ ఏట క్రీIIశII 386లో దేహం చాలించి దైవలోకం చేరు కున్నారు. శ్రీసభ పునీతునిగా గౌరవించింది. వారు నిజమైన శ్రీసభ పండితుడని 13వ లియో (సింహరాయలు) పోపుగారు 1882లో ప్రకటించారు. సిరిల్ అంటే ప్రభువు, చక్రవర్తి, రాజు అని అర్థం.


Bishop, Confessor, Doctor(315-386) Saint Cyril was born at or near the city of Jerusalem, about the year 315. He was ordained a priest by Saint Maximus, who gave him the important charge of instructing and preparing the candidates for Baptism. This office he held for several years, and today we still have one series of his instructions, given in the year 347 or 348. They are of singular interest as being the earliest record of the systematic teaching of the Church on the Creed and Sacraments, and as having been given in the church built by Constantine on Mount Calvary. They are solid, simple, profound, precise, and saturated with Holy Scripture, and, as a witness and exposition of the Catholic faith, invaluable.

On the death of Saint Maximus, Cyril was chosen Bishop of Jerusalem. At the beginning of his episcopate a cross was seen in the sky, reaching from Mount Calvary to Mount Olivet, and so bright that it shone at noonday. Saint Cyril gave an account of it to the emperor, and the faithful regarded it as a presage of victory over the Arian heretics.
While Saint Cyril was Bishop of Jerusalem, the apostate emperor Julian resolved to defy the words of Our Lord (Luke 21:6) by rebuilding the ancient temple of Jerusalem. He employed the power and resources of a Roman emperor; the Jews thronged enthusiastically to him and gave munificently. 

But Cyril was unmoved. The word of God abides, he said; one stone shall not be laid on another. When the attempt was made, a pagan writer tells us that horrible flames came forth from the earth, rendering the place inaccessible to the scorched and frightened workmen. The attempt was made again and again, and then abandoned in despair. Soon after, the emperor perished miserably in a war against the Persians, and the Church had rest.

Like the other great bishops of his time, Cyril was persecuted, and was driven twice from his see; but on the death of the Arian emperor Valens, he returned to Jerusalem. He was present at the Second General Council of Constantinople, and died in peace A.D. 386, after a troubled episcopate of thirty-five years.

Add new comment

6 + 4 =