SAINT OF THE DAY - March 17 పునీత ప్యాట్రికు | ST. PATRICK

@pjsri

ఐర్లాండుదేశ అపోస్తలుడు (బిషప్పు, మతసాక్షి, క్రీ/శII 385-461) శైశవదశలోనున్న క్రైస్తవమతానికి ఐర్లాండు దేశంలో గట్టిపునాదులు వేసిన ఘనత పునీత ప్యాట్రికు (పునీత కర్తానంద) గారికే చెందుతుంది. అందుకే “ఐర్లాండుదేశ అపోస్తులుడు'గా అభివర్ణిస్తూ వారిని శ్రీసభ గౌరవిస్తూ వస్తోంది. ఇంగ్లాడులో వీరి తండ్రి పేవీర కల్పూర్నియుసు రోమీయుడు, రోమను బ్రిటీషు అధికారిగా పనిచేశాడు. వీరితల్లి టూరూను నగర పునీత మార్టినుగారికి దగ్గరి బంధువురాలు. బ్రిటన్ లో తండ్రిచెంతనే ఉండి చదువుకుంటున్న పాట్రికుగారి పదహారేళ్లవయసప్పుడు ఐర్లాండు దుండుగులు కొందరు పెద్దసంఖ్యలో వచ్చి దాడిచేశారు. 

ఆ దాడిలో ధనసంపదతోపాటు కొందరు యువకుల్ని బందీలుగా పట్టుకుపోయారు. ఆ బంధీల్లో పాత్రికుగారు ఒకరు. అక్కడవీరిని 'మిర్చి' అనే నాయకునికి అప్పగించారు. ఆ నాయకుడి గొర్రెలకు కాపలా దారుగా పాట్రికు పలు బాధలు అనుభవించారు.ఎలాగైతేనేం ఒకరోజు తప్పించుకొని పారిపోయి బ్రిటనుకు చేరుకున్నారు. టూరు నగరంలోని ఒక సన్యాసుల మఠంకు చేరుకుని తన ప్రవేశంకై ప్రాధేయపడ్డారు. అనుమతి లభించి మఠవాస జీవితంలో కలగలసిపోయారు. ప్రార్థనాజీవితం కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తు ఎదిగారు. తాను " కష్టాలను భవించిన ఐర్లాండులోనీ అవిశ్వాస ప్రజలకు - క్రీస్తువాక్యాన్ని అందించి విశ్వాసంలోకి తీసుకురావాలని, వారి మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగింప సాధ్యపడినంత కృషిచేయాలని పాట్రికు ప్రగాఢవాంఛ. అందుకనుగుణంగా అడుగులేస్తున్నారు. ఇంతలో తనకు ఇరవైఏళ్లు ప్రాప్తించి మంచి క్రీస్తు సన్యాసిగా మారాడు. 

ఆరోజుల్లో బ్రిటనులో బిషప్పు పల్లాడియసు మంచి పీఠాధిపతిగా పేర్గాంచి సేవలందిస్తున్నారు. అట్టితరుణంలో క్రీIIశII 430లో పోపు సెలస్టీనుగారు ఆ బిషప్పుగార్ని ఐర్లాండు వెళ్లి సువార్తా పరిచర్య చేపట్టాల్సిందిగా తాఖీదు జారీచేశారు. బిషప్పు పల్లాడియసు గారు ఐర్లాండులో పాదం మోపి పని ప్రారంభించి ప్రారంభించకముందే అజ్ఞాన ప్రజలు కొందరు వారి పై దాడికిదిగారు. తత్ఫలితంగా బిషప్పుగారు తప్పించుకుని తిరిగి ఇంగ్లాండుకే చేరుకున్నారు. ఆ పిమ్మట కొంతకాలానికి తమ అపోస్తోలిక పనియందే తనువు చాలించారు.

ఇట్టి పరిస్థితుల్లో పాట్రికుగారు పీఠాధిపతులుగా అభిషేకింపబడి ఐర్లాండు దేశానికి నియమింపబడ్డారు. పాత్రీకు పరమానందంగా తన మత ప్రచారం పని చేపట్టేందుకు ఐర్లాండు సముద్రతీరం చేరుకోగానే అక్కడి 'డ్రూయిడ్' తెగవారు ఆయన పడవను అడ్డుకున్నారు. బెదిరించారు. క్రీస్తు సహవాసిగా దేవుని నమ్మిన పాత్రీకు భయపడలేదు. పైగా నూతనోత్సాహంతో దేవుని పై భారంమోపి ఉత్తర తీరానికి వెళ్లి ఐర్లాండులో తమ పాదం మోపారు. మొదటగా అక్కడ తన మహిమను ప్రదర్శించి అక్కడి నాయకుడైన 'డిచూ' ను క్రైస్తవం స్వీకరింపజేశారు. ఆయన సహాయ సహకారాలతో అక్కడ మొదటి క్రైస్తవ ఆశ్రమాన్ని ఆరంభించారు. 

కొంతకాలం గడిచాక అక్కడికి దగ్గరలో 'తారా' అనే ప్రదేశంలో ఐర్లాండులోని వివిధ తెగల నాయకులందరూ సమావేశమైన సందర్భంగా ప్యాట్రికుగారు కూడా అక్కడకు వెళ్లారు. పవిత్రాత్మ కృపవల్ల తెగించిన ధైర్యంతో క్రైస్తవ విశ్వాసాన్ని వారికి అనర్గళంగా వివరించారు. పవిత్ర త్రీత్వం సిద్దాంతాన్ని వారికి తేటతెల్లం చేసేందుకు ఆ దేశంలో విరివిగా కనిపించే షాంరాక్' అనబడు మొక్కకు ఉన్న మూడు ఆకులను ఉదాహారణగా ఉద్బోధించారు. అయితే అక్కడున్న 'డ్రూయిడ్' తెగ హజారులు తమ సైతాను శక్తులద్వారా గాలిలో తేలిపోతామని ప్యాట్రికుగారిపై సవాలు విసిరారు. ప్యాట్రికుగారికి ఇదిమంచి సమయం. 

దేవునికి చిన్న ప్రార్థనచేశారు. అంతే ఆ మాంత్రికుల ఎత్తుగడలు చిత్తయినాయి. వారి సవాళ్లు పారలేదు.'వియోగేయిర్ రాజు' ప్యాట్రికుగారు నిజమైన దైవభక్తుడు, సత్యసాక్షి అని నమ్మి వారిని ఐర్లాండు అంతటా తిరిగి తన సువార్తా ప్రచారం చేసుకోవచ్చని సెలవిచ్చాడు. తన కల నిజం కాబోతున్నందుకు ప్యాట్రికుగారు దేవునికి మేలెరిగిన స్తోత్రములు సల్పి ఇక శ్రమ అనుకోకుండ ఐర్లాండు ద్వీపమంతా కలియతిరుగుతూ శ్రీసభ వ్యాప్తికి విశేష కృషిచేశారు. అయితే ఇదిగిట్టని స్థానికులైన కొందరు నాయకులు ప్యాట్రికుగారిని నిర్బంధించి కారాగారం పాల్చేస్తున్నారు.

గత్యంతరం లేక విడిచి పెడుతున్నారు. తాత్కాలిక అంతరాయాలు తప్పలేదు. అయినా రగిలింపబడిన నిప్పు తన పని తాను చేసుకుపోతున్నట్లు క్రమంగా శ్రీసభ వ్యాపకమవుతూనే ఉంది. స్థానికుల్ని గురువులుగా తీర్చిదిద్దారు. ఐర్లాండులోని అనేక ప్రాంతాల్లో కాన్వెంటులు, సన్యాసుల మఠాలు, దేవాలయాలు విరివిగా వెలిశాయి. స్వయం పోషకమై ఏసు రాజ్య జెండా రెపరెపలాడుతోంది. తన చిరకాలకోరిక నీడేర్చుకున్నందుకు తగిన సహాయసహకారాలతో దైవం తన్ను ఆశీర్వదించినందుకు పూర్తి సంతృప్తినొందారు ప్యాట్రికు.తన జీవిత అవసానదశలో క్రీశ 461లో ప్యాట్రికుగారు “సాభాతో' అను ప్రదేశం వద్ద ప్రశాంతంగా పరలోక ప్రాప్తినొందినారు. ప్యాట్రికుగారు మరణించే నాటికి ఐర్లాండు శ్రీసభకు బలమైన పునాదులు వేయ బడ్డాయి. సువిశేష ప్రచారంతో పాటు వారు వ్రాసిన ప్రసిద్ధ గ్రంథాలుకూడా మెల్లమెల్లగా ప్రచారంలోకి వచ్చాయి. 

అవి పాపోచ్చరణం(Confession), సుజ్ఞానం (Epiltola), కిరీటాభి షేకం (Corticum) ముఖ్యమైనవి. వారు తుది శ్వాస విడిచేవరకు తపోక్రియలనాచరిస్తూ ఎన్ని అవాంతరాలెదురైనా తమ దైవ రాజ్య విస్తరణాతపనను అవిశ్రాంతంగా నెరవేర్చుకున్న నిష్కామకర్మ యోగి పునీత పాట్రికుగారు. వీరి లాటీను పేరుకు ఘనుడు, గంభీరుడు, గొప్పవాడు అని అర్థం.


Please Like & Share If the virtue of children reflects honor on their parents, much more justly is the name of Saint Patrick rendered illustrious by the innumerable lights of sanctity which shone in the Church of Ireland during many ages, and by the colonies of Saints with which it peopled many foreign countries. The Apostle of Ireland was born in Scotland towards the close of the fourth century, in a village which seems to be the present-day Scotch town of Kilpatrick, between Dumbarton and Glasgow. He calls himself both a Briton and a Roman, that is, of mixed extraction, and says his father was of a good family named Calphurnius. Some writers call his mother Conchessa, and say she was the niece of Saint Martin of Tours.

In his sixteenth year he was carried into captivity in Ireland by barbarians. There he was obliged to shepherd cattle on the mountains and in the forests, in hunger and nakedness, amid snow, rain, and ice. The young man had recourse to God with his whole heart, in fervent prayer and fasting, and from that time faith and the love of God acquired a constantly renewed strength in his tender soul. 

After six months spent in slavery, Saint Patrick was amonished by God in a dream to return to his own country, and was informed that a ship was then ready to sail there. He went at once to the seacoast, though at a great distance, and found the vessel, but he could not obtain his passage — probably for want of money. Patrick was returning to his hut, praying as he went, when the sailors, though pagans, called him back and took him on board.Some years afterwards he was again taken captive, but recovered his liberty after two months.

While he was at home with his parents, God manifested to him, by divers visions, that He destined him for the great work of the conversion of Ireland. His biographers say that after his second captivity he traveled into Gaul and Italy, and saw Saint Martin, Saint Germanus of Auxerre, and Pope Saint Celestine, and that he received his mission and the apostolical benediction from this Pope, who died in 432. It is certain that he spent many years in preparing himself for his sacred calling. Great opposition was raised to his episcopal consecration and mission, both by his own relatives and by the clergy. 

They made him great offers in order to detain him among them, and endeavored to affright him by exaggerating the dangers to which he exposed himself amid the enemies of the Romans and Britons, who did not know God. All these temptations cast the Saint into great perplexity; but the Lord, whose Will he consulted by earnest prayer, supported him and he persevered in his resolution.He therefore left his family, sold his birthright and dignity, and consecrated his soul to God, to serve strangers and carry His name to the ends of the earth. In this disposition he passed into Ireland, to preach the Gospel where the worship of idols still generally reigned. 

He traveled over the island, penetrating into the remotest corners, and such was the fruit of his preaching and sufferings that he baptized an infinite number of persons. Everywhere he ordained clergymen, induced women to live in holy widowhood and continence, consecrated virgins to Christ, and founded monasteries, not without many persecutions.
Saint Patrick held several councils to regulate the discipline of the Church he had planted. Saint Bernard and the tradition of the country testify that he fixed his metropolitan see at Armagh. He established other bishops, as appears by the acts of a council and various other documents. He not only converted the whole country by his preaching and wonderful miracles, but also cultivated this vineyard with so fruitful a benediction from heaven as to render Ireland a flourishing garden in the Church of God, and a land of Saints. 

He converted and baptized the kings of Dublin and Munster and the seven sons of the king of Connaught, with the majority of their subjects, and before his death almost the whole island. He founded three monasteries and filled the countryside with churches and schools of piety and learning. He died and was buried at Down in Ulster. His body was found there in a church of his name in 1185, and moved to another part of the same church.

Add new comment

2 + 1 =